PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/powerstar-pawan-kalyan-ap-will-be-the-hero-who-will-change-rural-india07043fc8-f8e0-4e80-b0c5-7ab7965c309a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/powerstar-pawan-kalyan-ap-will-be-the-hero-who-will-change-rural-india07043fc8-f8e0-4e80-b0c5-7ab7965c309a-415x250-IndiaHerald.jpg- ప‌వ‌నూ చెక్ ప‌వ‌రేనా.. నిధులు కూడా ఇస్తావా..! - పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి బ్యాలెన్స్ స‌వాలే - అట‌వీ సంప‌ద అక్ర‌మ‌ర‌వాణాకు బ్రేక్ వేయ‌డం ట‌ఫ్‌ ( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ ) ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌న మ‌న‌సుకు న‌చ్చిన పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌లు, అట‌వీ శాఖ కూడా ద‌క్కాయ‌ని ఆయ‌న సంబ‌ర ప‌డ్డారు. అంతా బాగానేఉంది. పోస్టు చూస్తే.. పైకి ఈజీ అనే అనుకోవ‌చ్చు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆయా శాఖ ల‌ప‌రిస్థితి చూస్తే.. అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే.. పంచాయ‌తీ రాAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; ap; rural India{#}raj;Aqua;local language;India;Cheque;YCPప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... ఏపీ గ్రామీణ భార‌తాన్ని మార్చే హీరో అవుతాడా..!ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌... ఏపీ గ్రామీణ భార‌తాన్ని మార్చే హీరో అవుతాడా..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; ap; rural India{#}raj;Aqua;local language;India;Cheque;YCPWed, 19 Jun 2024 11:53:31 GMT- ప‌వ‌నూ చెక్ ప‌వ‌రేనా.. నిధులు కూడా ఇస్తావా..!
- పంచాయ‌తీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి బ్యాలెన్స్ స‌వాలే
- అట‌వీ సంప‌ద అక్ర‌మ‌ర‌వాణాకు బ్రేక్ వేయ‌డం ట‌ఫ్‌

( విజ‌య‌వాడ - ఇండియా హెరాల్డ్ )

ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు త‌న మ‌న‌సుకు న‌చ్చిన పంచాయ‌తీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ‌లు, అట‌వీ శాఖ కూడా ద‌క్కాయ‌ని ఆయ‌న సంబ‌ర ప‌డ్డారు. అంతా బాగానేఉంది. పోస్టు చూస్తే.. పైకి ఈజీ అనే అనుకోవ‌చ్చు. కానీ, క్షేత్ర‌స్థాయిలో ఆయా శాఖ ల‌ప‌రిస్థితి చూస్తే.. అంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే.. పంచాయ‌తీ రాజ్ శాఖ‌లో రెండు ద‌శాబ్దాలుగా స‌మ‌స్య‌లు తిష్ట‌వేశాయి. ముఖ్యంగా గ్రామ స‌ర్పంచుల‌కు చెక్ ప‌వ‌ర్ ఉన్నా నిధులు లేని ప‌రిస్థితి నెల‌కొంది.


అదే స‌మ‌యంలో కేంద్రం ఇస్తున్న నిధుల‌ను కూడా రాష్ట్ర ప్ర‌భుత్వాలు వాడేశాయి. ఇప్పుడు కూడా అదే ప‌రిస్థితి నెల‌కొన్నా ఆశ్చ‌ర్యం లేదు. ఈ నేప‌థ్యంలో పంచాతీరాజ్ గ్రామీణ అభివృద్ది శాఖ‌ల‌ను ఏక‌తాటి పైకి తీసుకురావ‌డం.. వివాద ర‌హితంగా నిర్వ‌హించ‌డం స‌వాలేన‌ని చెప్పాలి. ఇక‌,అట‌వీ శాఖ విష‌యానికి వ‌స్తే.. ఇదిమ‌రింత వివాదంగా ఉన్న శాఖ‌. అక్ర‌మ ర‌వాణాను అరిక‌ట్ట‌డం.. అనేది పెద్ద స‌వాలుగా మారింది. ముఖ్యంగా ఎర్ర‌చంద‌నం ర‌వాణాను అడ్డుకోవ‌డం ప్ర‌ధాన స‌వాలు.


అదేస‌మ‌యంలో గ‌త చంద్ర‌బాబు హ‌యాంలో ఎర్ర‌చంద‌నాన్ని విదేశాల‌కు విక్ర‌యించారు. ఇప్పుడు కూడా దానిని అమ‌లు చేయాలి. అదేవిదంగా గ‌త వైసీపీ హ‌యాంలో ఎర్ర‌చంద‌నం అక్ర‌మ ర‌వాణా వ్య‌వ‌హారాన్ని ఆధారాల‌తో స‌హా వెలికి తీయాలి. గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ రాష్ట్ర స‌ర్కారు కంటే కేంద్రం ఇస్తున్న నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగంలోకి తీసుకుర‌వాలి. జ‌ల్ జీవ‌న్ మిష‌న్‌ను ప‌క్కాగా అమ‌లు చేయాల్సి ఉంది.


ఇవ‌న్నీ ఇలా ఉంటే.. మ‌రో ఏడాదిన్న‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీనికి సంబంధించి ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం.. పంచాయ‌తీ కార్యాల‌య‌ల్లో సిబ్బందిని నియ‌మించ‌డం.. వారికి మౌలిక స‌దుపాయాలు.. ఏర్పాటు చేయ‌డంవంటివి కూడా ప‌వ‌న్‌కు ఇబ్బందిగానే ప‌రిణ‌మించే అంశాలు. ఇక‌, నాడు నేడు ద్వారా ఏర్పాటు చేసిన స‌చివాల‌యాల‌ను పంచాయ‌తీల్లోనే ఏర్పాటు చేశారు. వాటిని సంస్క‌రించి.. పంచాయ‌తీ భ‌వ‌నాల‌ను ఖాళీ చేయించి.. కొత్త కార్యాల‌యాలు ఏర్పాటు చేయాలి. ఇలా.. పోస్టు మ‌న‌సుకు న‌చ్చినా.. ప్ర‌జల మ‌న‌సును ఆక‌ట్టుకునేందుకు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఏర్పాట్లు చేయాల్సి ఉంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>