PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-nimmala-image-double-hero-in-ap-historyb0ebe958-865f-44cb-9cc6-a39b5803c2fa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/minister-nimmala-image-double-hero-in-ap-historyb0ebe958-865f-44cb-9cc6-a39b5803c2fa-415x250-IndiaHerald.jpg- న‌దుల అనుసంధానం పూర్త‌యితే నిమ్మ‌ల పేరు సువ‌ర్ణాక్ష‌రాలే - పోల‌వ‌రం, వంశ‌ధార‌, వ‌రిక‌పూడిసెల‌, వెలిగొండ పూర్త‌వ్వాల్సిందే ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు వ‌చ్చే ఐదేళ్లు కూడా చాలా కీల‌క‌మేన‌ని చెప్పాలి. ముఖ్య‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టును వ‌డివ‌డిగా ప‌రుగులు పెట్టించ‌డంతోపాటు... పున‌రావాస కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌డం ద్వారా.. ఆయ‌న పేరు చిర‌స్థాయి గా నిలిచిపోతుంద‌న‌డంలో సందేహంలేదు. ఇక‌, ఒక్క పోల‌వ‌ర‌AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Nimmala; Nimmala ramanaidu; tdp{#}Prakasam;Nellore;MLA;YCP;Indiaమంత్రి ' నిమ్మ‌ల ' ఇమేజ్ డ‌బుల్‌... ఏపీ హిస్ట‌రీలో హీరో..!మంత్రి ' నిమ్మ‌ల ' ఇమేజ్ డ‌బుల్‌... ఏపీ హిస్ట‌రీలో హీరో..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; Nimmala; Nimmala ramanaidu; tdp{#}Prakasam;Nellore;MLA;YCP;IndiaWed, 19 Jun 2024 11:07:25 GMT- న‌దుల అనుసంధానం పూర్త‌యితే నిమ్మ‌ల పేరు సువ‌ర్ణాక్ష‌రాలే
- పోల‌వ‌రం, వంశ‌ధార‌, వ‌రిక‌పూడిసెల‌, వెలిగొండ పూర్త‌వ్వాల్సిందే

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన పాల‌కొల్లు ఎమ్మెల్యే నిమ్మ‌ల రామానాయుడుకు వ‌చ్చే ఐదేళ్లు కూడా చాలా కీల‌క‌మేన‌ని చెప్పాలి. ముఖ్య‌మైన పోల‌వ‌రం ప్రాజెక్టును వ‌డివ‌డిగా ప‌రుగులు పెట్టించ‌డంతోపాటు... పున‌రావాస కార్య‌క్ర‌మాల‌ను వేగ‌వంతం చేయ‌డం ద్వారా.. ఆయ‌న పేరు చిర‌స్థాయి గా నిలిచిపోతుంద‌న‌డంలో సందేహంలేదు. ఇక‌, ఒక్క పోల‌వ‌ర‌మే కాదు.. ఇత‌ర ప్రాజెక్టులు కూడా.. రాష్ట్రంలో పెండింగులో ఉన్నాయి. వాటిని కూడా ఆయ‌న ప‌రుగులు పెట్టిస్తే.. గొప్ప‌పేరే రానుంది.


వ‌రిక‌పూడిసెల‌: ప‌ల్నాడు జిల్లాలోని సుమారు వెయ్యి ఎక‌రాల‌కు నీరు అందించే ఈ ప్రాజెక్టు వ్య‌వ‌హారం ఎప్ప‌టిక‌ప్పుడు వివాదంగానే మారుతోంది. అంతేకాదు..నిధుల కేటాయింపు నుంచి అనేక స‌మ‌స్య‌లు ఈ ప్రాజెక్టు ఎదుర్కొంటోంది. గ‌తంలో జ‌గ‌న్ దీనికి ప్రారంభోత్స‌వం చేసినా.. త‌ర్వాత మాత్రం ప‌ట్టించుకోలే దు. దీనిని పూర్తి చేయ‌గ‌లిగితే.. ప‌ల్నాడులో నిమ్మ‌ల‌కు విగ్ర‌హం పెట్టించినా ఆశ్చ‌ర్యం లేదు.


వంశ‌ధార‌: ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు వ‌ర‌దాయిని వంటి వంశ‌ధార ప‌నులు కూడా ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోయా యి. గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలోఈ ప‌నులు ప్రారంభించారు. కానీ, వైసీపీ వ‌చ్చాక నిధులు లేక‌.. ఆగిపోయింది. విజ‌య‌న‌గ‌రం, ఒడిశాల‌కు కూడా.. మేలు చేసే ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేందు కు నిధుల స‌మ‌స్య ప్ర‌ధాన అడ్డంకిగా మారింది. దీంతో ప్రాజెక్టు అడుగులు ముందుకు ప‌డ‌డం లేదు. ఇప్పుడైనా నిమ్మ‌ల స‌హ‌కారం ఉంటే.. ఇది పూర్త‌యితే.. మేలు జ‌రుగుతుంద‌ని అంటున్నారు.


వెలిగొండ‌:  ఈ ప్రాజెక్టు ఉమ్మ‌డి ప్రకాశం జిల్లా స‌హా.. నెల్లూరు ప్ర‌జ‌ల‌కు కూడా.. వ‌ర‌దాయిని. ఇది కూడా.. అనేక ప్రాధ‌మిక క‌ష్టాలు దాటుకుని.. మ‌ధ్య స్థితిలో ఉంది. వెలిగొండ ట‌న్నెల్ ప‌నుల‌ను వైసీపీ పూర్తి చేసినా.. నీటివిడుద‌ల‌కు సంబంధించి మాత్రం స‌మ‌స్య‌లు అలానే ఉన్నాయి. ఇక‌, విజ‌య‌వాడలోని బుడ‌మేరు కాల్వ‌, అనంత‌పురంలోని పెన్నాన‌ది, కావేరీ న‌ది అనుసంధానం ప‌నులు కూడా పూర్తి కావాల్సి ఉంది. ఇవి పూర్తయితే.. నిమ్మ‌ల‌కు పెద్ద ఎత్తున ఇమేజ్ పెర‌గ‌డంతోపాటు.. ఆయ‌న నిబ‌ద్ధ‌త కూడా.. సువ‌ర్ణాక్ష‌రాల‌తో నిలిచిపోతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>