Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb3f0d65f-4b83-445f-904a-43fda640bbdc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyleb3f0d65f-4b83-445f-904a-43fda640bbdc-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ కింగ్ నాగార్జునతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అప్పట్లో రమ్మకృష్ణ, సౌందర్య, రోజా, మీనా.. ఆతరువాత శ్రీయా, ఆర్తీ ఆగర్వాల్, నయనతార, ఇలా అందరూ ఆయనతో స్క్రీన్ ను శేర్ చేసుకున్నవారే.. కాని 90స్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ తో మాత్రం నాగార్జున ఒక్క సినిమా కూడా చేయలేదట. కారణం ఏంటో తెలుసా..?ఇంతకీ వీరి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు..? కారణం ఏంటి..? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు. 90లలో టాప్ స్టార్స్ తో రంభ జతకట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, socialstars lifestyle{#}Rambha;indraja;rajendra prasad;Nijam;babu rajendra prasad;Hello;king;King;Akkineni Nagarjuna;Industry;Ishtam;Tollywood;Heroine;Hero;Blockbuster hit;Cinema;Telugu'నాగార్జున' సినిమాలను రిజెక్ట్ చేసిన సీనియర్ బ్యూటీ ..?'నాగార్జున' సినిమాలను రిజెక్ట్ చేసిన సీనియర్ బ్యూటీ ..?socialstars lifestyle{#}Rambha;indraja;rajendra prasad;Nijam;babu rajendra prasad;Hello;king;King;Akkineni Nagarjuna;Industry;Ishtam;Tollywood;Heroine;Hero;Blockbuster hit;Cinema;TeluguWed, 19 Jun 2024 17:45:00 GMT
టాలీవుడ్ కింగ్ నాగార్జునతో సినిమా అంటే హీరోయిన్లు ఎగిరి గంతేస్తారు. అప్పట్లో రమ్మకృష్ణ, సౌందర్య, రోజా, మీనా.. ఆతరువాత శ్రీయా, ఆర్తీ ఆగర్వాల్, నయనతార, ఇలా అందరూ ఆయనతో స్క్రీన్ ను శేర్ చేసుకున్నవారే.. కాని 90స్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగిన ఓ హీరోయిన్ తో మాత్రం నాగార్జున ఒక్క సినిమా కూడా చేయలేదట. కారణం ఏంటో తెలుసా..?ఇంతకీ వీరి కాంబోలో సినిమా ఎందుకు రాలేదు..? కారణం ఏంటి..? టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలిన తెలుగు అమ్మాయిల్లో రంభ ఒకరు. 90లలో టాప్ స్టార్స్ తో రంభ జతకట్టారు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, జేడీ చక్రవర్తి, రాజేంద్ర ప్రసాద్ లాంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది రంభ. ముద్దుగా బొద్దుగా ఉండే రంభ.. అప్పట్లోనే ఏమాత్రం మోహమాటం లేకుండా గ్లామర్ రోల్స్ చేశారు. స్కిన్ షోకి కూడా వెనుకాడేవారు కాదు.స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రంభ… నాగార్జునతో మాత్రం ఒక్క సినిమా కూడా చేయలేదు. దీనికి ఓ పెద్ద కారణమే ఉందట. బ్లాక్ బస్టర్ హిట్ కొటటిన ఓ సినిమా నుండి నాగార్జున తనను తప్పించడంతో.. ఆయనపై రంభ కోపం పెంచుకున్నారట. దాంతో ఆతరువాత కింగ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా ఆమె రిజెక్ట్ చేశారని తెలుస్తోంది. ఆయనతో అస్సలు నటించకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారట.

1992లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది రంభ. ఆమె అసలు పేరు విజయలక్ష్మి. అచ్చతెలుగు హీరోయిన్ తన స్క్రీన్ నేమ్ గా రంభ అని పెట్టుకుంది. కాగా రాజేంద్ర ప్రసాద్ జోడీగా.. 'ఆ ఒక్కటీ అడక్కు' మూవీతో రంభ వెండితెరకు పరిచయమయ్యింది. ఈ సినిమాతో ఈవీవీ మెప్పించిన రంభకు ఆయన తన సినిమాల్లో వరుసగా అవకాశాలు ఇచ్చారు.అయితే ఆక్రమంలోనే ఈవీవీ సత్యనారాయణ నాగార్జునతో హాలో బ్రదర్ సినిమా చేశారు. ఈమూవీ ఎంత హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే ఈసినిమాలో రంభను హీరోయిన్ గా అనుకున్నారట ఈవీవీ. సౌందర్య, రంభతో సినిమా చేయాలి అనుకున్నారట. కాని హీరో నాగార్జున హలో బ్రదర్ లో రంభకు బదులు రమ్యకృష్ణను పెటాలని అడిగారట. దాంతో ఇష్టం లేకపోయినా.. ఈవీవీ రంభ ప్లేస్ లో రమ్యకృష్ణను తీసుకున్నారట.అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి.. సౌందర్య, రమ్యకృష్ణల కెరీర్ ను ఎక్కడికో తీసుకెళ్ళింది. దాంతో నాగ్ వల్లే ఈసినిమా మిస్ అయ్యానని ఇక నాగార్జునతో లైఫ్ లో సినిమాలు చేయకూడదని నిర్ణయం తీసుకున్నారట రంభ. అప్పటి నుంచి అవకాశం వచ్చినా.. ఏదో కారణంగా నాగార్జున సినిమాలు రిజెక్ట్ చేస్తూ వచ్చిందని ఇండస్ట్రీ టాక్. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని... సోషల్ మీడియాలో మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది.అయితే ఇందులో వింత ఏంటంటే.. ఇదేసినిమాలో ఓ స్పెషల్ సాంగ్ లో నాగార్జునతో కలిసి స్టేప్పులేసింది రంభ. తనకు మూవీ లైఫ్ ను ఇచ్చిన దర్శకుడుఈవీవీ అడగడంతో కాదనలేకు స్పెషల్ సాంగ్ చేసిందట రంభ. ఈసినిమాలోని కన్నె పెట్టరో' సాంగ్ లో రంభ, ఆమని, ఇంద్రజ నాగార్జునతో పాటు స్టెప్స్ వేశారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>