PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilac6ddd7a0-4665-4896-ba1e-3c6ad722bf8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sharmilac6ddd7a0-4665-4896-ba1e-3c6ad722bf8d-415x250-IndiaHerald.jpgఏపీలో కూటమి భారీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.అయితే విజయవాడలో బుధవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో ఈసారి ఎన్నికలు విచిత్రంగా జరిగాయని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని మార్పు కోసం వైసీపీని ఓడించారని అన్నారు.మాజీ సీఎం జగన్ కు ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెప్పsharmila{#}swetha;Y. S. Rajasekhara Reddy;polavaram;wednesday;Sharmila;kadapa;Polavaram Project;Congress;Elections;Telangana Chief Minister;Bharatiya Janata Party;Government;politics;CBN;Jagan;YCP;CM;mediaషర్మిల : పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే..!షర్మిల : పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే..!sharmila{#}swetha;Y. S. Rajasekhara Reddy;polavaram;wednesday;Sharmila;kadapa;Polavaram Project;Congress;Elections;Telangana Chief Minister;Bharatiya Janata Party;Government;politics;CBN;Jagan;YCP;CM;mediaWed, 19 Jun 2024 22:12:30 GMTఏపీలో కూటమి భారీ విజయం సాధించిన తర్వాత  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సారథ్యంలో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.చంద్రబాబు ఇప్పటికే బాధ్యతలను స్వీకరించారు. పాలనను పరుగులెత్తించడంపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా అయిదు గ్యారంటీలపై సంతకాలూ చేశారు.అయితే విజయవాడలో బుధవారం  మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఏపీలో ఈసారి ఎన్నికలు విచిత్రంగా జరిగాయని, ప్రజలు ఒక నిర్ణయం తీసుకొని మార్పు కోసం వైసీపీని ఓడించారని అన్నారు.మాజీ సీఎం జగన్ కు ప్రజలు ఓటు రూపంలో బుద్ది చెప్పారని కొంతమందినే పట్టించుకొని మిగితా వారిని వదిలేస్తే ఎలా ఉంటుందో జగన్ కు తెలిసోచ్చిందని షర్మిల గుర్తు చేశారు.అయితే షర్మిల తన ఓటమిపై కారణాలు మీడియాతో చెప్తూ చెప్తూ ఎన్నికల ప్రచారానికి తగినంత సమయం లేకపోవడం వల్లే కడపలో తాను ఓడిపోయానని వైఎస్ షర్మిల అన్నారు. ”కడప ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. కడప ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కడపలో విచ్చలవిడిగా డబ్బులు పంచిపెట్టారు. నా ఓటమికి కారణం సమయం లేకపోవడమే.చంద్రబాబు మద్దతు ఇవ్వకపోతే కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండేది కాదు. చంద్రబాబు ఇచ్చిన ఎంపీల వల్ల బీజేపీ అధికారంలో ఉంది. చంద్రబాబు హోదా కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేస్తున్నా.

వైఎస్ఆర్ కల అయిన పోలవరం నిర్మాణం పూర్తి చేయాలి. 2018కి పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు మాట నిలుపుకోలేదు. రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ కాలయాపన చేసింది. పోలవరం ప్రాజక్ట్ పై శ్వేత పత్రం విడుదల చేయాలి. రాష్ట్రంలో ప్రాజెక్టుల స్థితిగతులపై బ్లూ ప్రింట్ ఇవ్వాలి. సూపర్ సిక్స్ హామీలని షరతులు లేకుండా అమలు చేయాల”ని షర్మిల డిమాండ్ చేశారు.వైసీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే అవకాశముందా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ఆర్సిపి నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వలసలు వస్తున్నాయని వార్తలపై షర్మిల ఆసక్తికరమైన సమాధానం చెప్తూ ఏదో ఒక రోజు పిల్ల కాలువలు అన్ని సముద్రంలో కలవాల్సిందేనని షర్మిల సమాధానం ఇచ్చారు.మరణించిన వైయస్సార్ కి రాజకీయాలు ముడి పెట్టవద్దని ఆయన విగ్రహాలను ధ్వంసం చేయవద్దని ఆమె కోరారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>