PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/did-babu-put-parita-family-asidec5cbad71-b5d5-4507-8df0-b7a269b173b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/did-babu-put-parita-family-asidec5cbad71-b5d5-4507-8df0-b7a269b173b8-415x250-IndiaHerald.jpgప‌రిటాల కుటుంబం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అనంత‌పురం జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌రిటాల ర‌వి కాలం నుంచి కూడా ఈ కుటుంబాన్ని ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. అలాంటి కుటుంబం ఇప్పుడు కొంత వెనుక‌బ‌డింద‌నే భావం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ఈ కుటుంబానికి ప్రాధాన్యం త‌గ్గించార‌నేది వాస్త‌వం. దీనికి కార‌ణాలు కూడా బాగానే ఉన్నాయి. ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ప‌ద‌వులు ఇచ్చే వ‌ర‌కు కూడా.. ఆయ‌న చ‌ర్య‌లు గ‌మ‌నిస్తే.. ఏదో నేర్పించాల‌నిAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; Parita; family {#}Paritala Sriram;Dookudu;sriram;MLAప‌రిటాల కుటుంబాన్ని బాబు అందుకే ప‌క్క‌న పెట్టేశారా..?ప‌రిటాల కుటుంబాన్ని బాబు అందుకే ప‌క్క‌న పెట్టేశారా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; tdp; chandrababu; Parita; family {#}Paritala Sriram;Dookudu;sriram;MLAWed, 19 Jun 2024 08:39:00 GMTప‌రిటాల కుటుంబం గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. అనంత‌పురం జిల్లాలోని రెండు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ కుటుంబానికి ప్ర‌త్యేక స్థానం ఉంది. ప‌రిటాల ర‌వి కాలం నుంచి కూడా ఈ కుటుంబాన్ని ప్ర‌జ‌లు ఆద‌రిస్తున్నారు. అలాంటి కుటుంబం ఇప్పుడు కొంత వెనుక‌బ‌డింద‌నే భావం వ్య‌క్త‌మ‌వుతోంది. దీనిలో ప్ర‌ధానంగా చంద్ర‌బాబు ఈ కుటుంబానికి ప్రాధాన్యం త‌గ్గించార‌నేది వాస్త‌వం. దీనికి కార‌ణాలు కూడా బాగానే ఉన్నాయి.


ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి ప‌ద‌వులు ఇచ్చే వ‌ర‌కు కూడా.. ఆయ‌న చ‌ర్య‌లు గ‌మ‌నిస్తే.. ఏదో నేర్పించాల‌ని అనుకుంటున్నారు. మ‌రి వీటిని ప‌రిటాల కుటుంబం ఏమేర‌కు స్వీక‌రిస్తుంద‌నేది చూడాలి. నిజానికి ఈ ఎన్నిక‌ల్లో రెండు టికెట్లు ఆశించారు. ధ‌ర్మ‌వ‌రం, రాప్తాడు. కానీ, రెండు ద‌క్క‌లేదు. పైగా.. ప‌రిటాల వార‌సు డిని ప‌క్క‌న పెట్టిన చంద్ర‌బాబు.. సునీత‌కు మాత్ర‌మే అవ‌కాశం ఇచ్చారు. దీనికి కార‌ణం.. ఏంటి? అనేది కుటుంబం అర్ధం చేసుకోవ‌లి.


పార్టీలో క‌లివిడి లేక‌పోవ‌డం ప్ర‌ధాన కార‌ణ‌మైతే.. మెజారిటీ నాయ‌కులు శ్రీరాం నాయ‌క‌త్వాన్ని తిర‌స్క‌రి స్తున్నార‌నేది మ‌రో వాద‌న‌. ముందుగా ఈ విష‌యంపై శ్రీరామ్ అధ్య‌య‌నం చేయాలి. ఎందుకంటే.. మ‌రో ఐదేళ్ల వ‌ర‌కు కూడా ఆయ‌న‌కు అవ‌కాశం లేదు. అప్ప‌టికి కూడా.. ఆయ‌న త‌న‌ను తాను స‌రిదిద్దుకుని అంద‌రితోనూ క‌లివిడిగా లేక‌పోతే.. అప్పుడు కూడా క‌ష్ట‌మ‌నే భావ‌న ఉంది. ఇక‌, అతి కీల‌క‌మైన కార‌ణం.. దూకుడు త‌గ్గించుకోవ‌డం. యువ‌రక్తం వేడి ఉన్నా . . సంయ‌మ‌నం పాటించాలి.


ఇక‌, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిన చంద్ర‌బాబు మంత్రిప‌ద‌వికి సునీత ను దూరం పెట్టారు . ఇది కూడా.. ఈ కుటుంబానికి ఒక పాఠ‌మ‌నే చెప్పాలి. గ‌తంలో మంత్రిగా ప‌నిచేసిన సునీత త‌క్కువ మార్కులు తెచ్చుకు న్నారు. చంద్ర‌బాబు ఆశించినంత ఆమె చేయ‌లేక‌పోగా.. ప్ర‌తి విష‌యంలోనూ అధికారుల‌పై ఆధార‌పడ్డా రు . ఈ ప‌రిణామాలు కూడా.. ఆమెకు శాపంగా మారాయి. మ‌రి ఇప్ప‌టికైనా ఈ కుటుంబం ఈ విష‌యాల‌పై దృష్టి పెడితే .. త‌ప్ప .. మేలు జ‌రిగే అవ‌కాశం ఉండ‌ద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>