MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ag-letest-update-fresh-news9c7009fb-25d5-4607-aa9a-5c501bff6cc5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ag-letest-update-fresh-news9c7009fb-25d5-4607-aa9a-5c501bff6cc5-415x250-IndiaHerald.jpgచిన్నతనంలోనే అవికా గౌర్ "చిన్నారి పెళ్ళికూతురు" అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపుని తెచ్చుకుంది. దానితో ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన ఈ నటికీ కూడా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన అమాయకత్వపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో ag{#}Car;Raj Tarun;Uyyala Jampala;Event;India;BEAUTY;Cinema;Teluguఅతడి అసభ్య ప్రవర్తనకి షాక్ అయ్యాను... ఇప్పుడు అలా జరిగితే ఏం చేసేదాన్ని అంటే...అవికా గౌర్..!అతడి అసభ్య ప్రవర్తనకి షాక్ అయ్యాను... ఇప్పుడు అలా జరిగితే ఏం చేసేదాన్ని అంటే...అవికా గౌర్..!ag{#}Car;Raj Tarun;Uyyala Jampala;Event;India;BEAUTY;Cinema;TeluguWed, 19 Jun 2024 12:10:00 GMTచిన్నతనంలోనే అవికా గౌర్ "చిన్నారి పెళ్ళికూతురు" అనే సీరియల్ లో నటించింది. ఈ సీరియల్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపుని తెచ్చుకుంది. దానితో ఈ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన ఈ నటికీ కూడా ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించింది. సీరియల్ ద్వారా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఈ బ్యూటీ ఆ తర్వాత రాజ్ తరుణ్ హీరోగా రూపొందిన ఉయ్యాల జంపాల అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా మంచి విజయం సాధించడం, ఇందులో ఈమె తన అమాయకత్వపు నటనతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు పెరిగాయి.

అందులో భాగంగా ఇప్పటికే అనేక తెలుగు సినిమాలలో నటించిన ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్ల క్రేజ్ కూడా భారీగా పెరగడంతో ఈమె కొన్ని రోజుల క్రితమే వధువు అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. హాట్ స్టార్ ఓటిటి లో అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూలో భాగంగా తాను ఒక ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు బాడీ గార్డ్ ల వల్ల ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పుకొచ్చింది.

తాజాగా ఈమె మాట్లాడుతూ... కొంతకాలం క్రితం కజక్‌స్థాన్‌కి ఒక ఈవెంట్ కోసం వెళ్లాను. కారు దిగి నడుస్తున్న సమయంలో నాకు ఎవరో నన్ను వెనక నుంచి నన్ను తాకినట్లు అనిపించింది. దానితో వెనక్కి తిరిగి చూశాను. నా బాడీగార్డ్‌ మాత్రమే అక్కడ ఉన్నాడు. సర్లే అనుకోకుండా జరిగిందేమో అనుకున్నాను. మళ్లీ స్టేజ్ వెళ్తున్నప్పుడు కూడా మరోసారి కూడా అలానే జరిగింది. దీంతో నేను వెంటనే కోపంతో చేయి పట్టుకుని ఏం చేస్తున్నావని అతన్ని గట్టిగా అడిగాను. దానితో అతను నాకు సారీ చెప్పాడు. దానితో నేను ఆ విషయాన్ని అక్కడే వదిలేసాను. నాకు ధైర్యం కాస్త తక్కువ. అందుకే అతనిని ఏమీ చేయలేదు. నాకు కాస్త ఎక్కువ ధైర్యం ఉంటే అలా చేసిన చాలా మందిని ఇప్పటికే కొట్టేదాన్ని అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా అవికా గౌర్ చెప్పుకొచ్చింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>