PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesh-is-an-inspiration-to-his-successors3b49fa0f-0871-4165-b488-799e4f615ad1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/nara-lokesh-is-an-inspiration-to-his-successors3b49fa0f-0871-4165-b488-799e4f615ad1-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి అధికారం చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ విజయం కంటే నారా లోకేష్... విక్టరీ ఆ పార్టీలో జోష్ పెంచింది. ఎక్కడ పడ్డాడు అక్కడే నిలబడి చూపించాడు నారా లోకేష్. వార్డు మెంబర్గా కూడా... గెలవలేదని వైసీపీ ఎంత ట్రోల్ చేసినా... అంతే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మంగళగిరి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాడు. nara lokesh{#}CBN;Lokesh;bharath;Hyderabad;Telugu Desam Party;Nara Lokesh;Sri Bharath;history;Mangalagiri;Yuva;Lokesh Kanagaraj;Research and Analysis Wing;Josh;Leader;Dookudu;Minister;Venkatesh;YCP;Andhra Pradeshనారా లోకేష్ : మగాడ్రా బుజ్జి... ఏపీ ఫ్యూచర్ స్టార్ ఈతగాడే?నారా లోకేష్ : మగాడ్రా బుజ్జి... ఏపీ ఫ్యూచర్ స్టార్ ఈతగాడే?nara lokesh{#}CBN;Lokesh;bharath;Hyderabad;Telugu Desam Party;Nara Lokesh;Sri Bharath;history;Mangalagiri;Yuva;Lokesh Kanagaraj;Research and Analysis Wing;Josh;Leader;Dookudu;Minister;Venkatesh;YCP;Andhra PradeshWed, 19 Jun 2024 10:21:00 GMT* చంద్రబాబు వారసుడిగా గుర్తింపు  
* తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలవడం
* యూత్ లో మంచి ఫాలోయింగ్
* ఐటీ, విద్యాశాఖ మంత్రిగా దూకుడు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మళ్ళీ ఊపు వచ్చింది. ఐదు సంవత్సరాల తర్వాత తిరిగి అధికారం చేపట్టింది తెలుగుదేశం పార్టీ. అయితే తెలుగుదేశం పార్టీ విజయం కంటే నారా లోకేష్... విక్టరీ ఆ పార్టీలో జోష్ పెంచింది. ఎక్కడ పడ్డాడు అక్కడే నిలబడి చూపించాడు నారా లోకేష్.  వార్డు మెంబర్గా కూడా... గెలవలేదని వైసీపీ ఎంత ట్రోల్ చేసినా... అంతే బౌన్స్ బ్యాక్ అయ్యాడు. మంగళగిరి నియోజకవర్గంలో చరిత్ర సృష్టించాడు.

 దాదాపు 25 సంవత్సరాల తర్వాత...  మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేశాడు యువ లీడర్ నారా లోకేష్. దాదాపు 90వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు లోకేష్. ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా... ఏపీ విద్యాశాఖ అలాగే ఐటీ శాఖ మంత్రిగా బాధ్యతలు కూడా తీసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో.. యూత్ లో ఎక్కువగా క్రేజ్ ఉన్న నాయకుడు నారా లోకేష్. యువ గళం పేరుతో కొత్త టీం సిద్ధం చేసిన నారా లోకేష్... యువతకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్తున్నారు.

 పీజీ భరత్ లాంటి వ్యక్తి మంత్రి కావడం వెనుక నారా లోకేష్ పాత్ర ఉంది. అంతేకాకుండా విద్యాశాఖలో ప్రక్షాళన చేసే దిశగా నారా లోకేష్ ముందుకు వెళ్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలను బయటకు తీస్తూ... విద్యార్థులకు న్యాయం చేస్తున్నారు. ఇటు ఏపీలో ఐటీ శాఖను అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు నారా లోకేష్. ఈ ఐదేళ్ల కాలంలో... విద్యాశాఖనే కాకుండా ఐటీ శాఖను ఎక్కువగా నారా లోకేష్ పట్టించుకోవాలి.

 హైదరాబాద్ ను తలదన్నేలా... ఐటి కంపెనీలను ఏపీకి తీసుకువచ్చే బాధ్యత నారా లోకేష్ పైన ఉంటుంది.  యూత్ కు ఉపాధి కల్పన  సృష్టించాలి. అదే సమయంలో వైసీపీకి  స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తూ ముందుకు వెళ్లాలి. చంద్రబాబు తర్వాత... భవిష్యత్తు లీడర్ తానేనని.. నిరూపించుకోగలగాలి నారా లోకేష్. విద్యాశాఖలో ఉన్న... ఖాళీలనుభర్తీ చేసి... విద్యార్థులకు మెరుగైన సదుపాయాలను కనిపించాలి. ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు...  అవినీతి లేకుండా చూసుకునే బాధ్యత రా చంద్రబాబు తర్వాత  లోకేష్ పైన ఉంటుంది. ఇలా.. చాలా రకాల సమస్యలను... సవాళ్లను నారా లోకేష్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. అప్పుడే నారా లోకేష్... ఫ్యూచర్ స్టార్ గా మారిపోతాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>