Politicsmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-pemmsani8a658575-198f-4eef-a8d8-7945f8358207-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-pemmsani8a658575-198f-4eef-a8d8-7945f8358207-415x250-IndiaHerald.jpg*ఎంపీ గా గెలిచిన మొదటిసారే కేంద్రసహాయ మంత్రిగా పెమ్మసాని *గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని భాద్యతలు * ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజల ఆశలన్ని పెమ్మసానిపైనే పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది. పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం బుర్రిపాలెం. సినీ నటుడు కృష్ణది కూడా ఇదే ఊరు కావడం విశేషం.1993 -94 లో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎంసెట్ లో 27వ ర్యాంకు రాగాఆయనకు ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింద#pemmsani{#}Cabinet;Thota Chandrasekhar;Srikakulam;MP;Party;Telugu Desam Party;Minister;Andhra Pradesh;TDP;Gunturపెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణ ప్రజల ఆశలన్ని పెమ్మసానిపైనే.. ఏపీ భవిత మారుస్తాడా..?పెమ్మసాని చంద్రశేఖర్ : గ్రామీణ ప్రజల ఆశలన్ని పెమ్మసానిపైనే.. ఏపీ భవిత మారుస్తాడా..?#pemmsani{#}Cabinet;Thota Chandrasekhar;Srikakulam;MP;Party;Telugu Desam Party;Minister;Andhra Pradesh;TDP;GunturWed, 19 Jun 2024 11:11:49 GMT*ఎంపీ గా గెలిచిన మొదటిసారే కేంద్రసహాయ మంత్రిగా పెమ్మసాని
*గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా పెమ్మసాని భాద్యతలు
* ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రజల ఆశలన్ని పెమ్మసానిపైనే


పెమ్మసాని చంద్రశేఖర్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో ఈ పేరు హాట్ టాపిక్ గా మారింది. పెమ్మసాని చంద్రశేఖర్ స్వగ్రామం బుర్రిపాలెం. సినీ నటుడు కృష్ణది కూడా ఇదే ఊరు కావడం విశేషం.1993 -94 లో పెమ్మసాని చంద్రశేఖర్ కు ఎంసెట్ లో 27వ ర్యాంకు రాగాఆయనకు ఉస్మానియా యూనివర్శిటీలో ఎంబీబీఎస్ సీటు వచ్చింది. 2000లో అమెరికాకు వెళ్లిన చంద్రశేఖర్. జాన్స్ హోప్కిన్స్ యూనివర్శిటీలో ఐదేళ్ల పాటు వైద్య విద్యను బోధించారు.పెమ్మసాని చంద్రశేఖర్ వైద్య విద్యార్ధులకు అతి తక్కువ ధరకే వైద్య విద్యకు సంబంధించిన నోట్స్ ను అతి తక్కువ ధరకే ఇచ్చేవారు. దీంతో ఆయనకు వారిలో మంచి పాపులారిటీ వచ్చింది. నర్సింగ్, ఫార్మసీ, లా, బిజినెస్,అకౌంటింగ్ వంటి కోర్సులకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఆయన ఓ సంస్థను కూడా ప్రారంభించడం జరిగింది. ఆ సంస్థ ద్వారా ఎంతో మందికి ట్రైనింగ్ ఇచ్చారు. పెమ్మసాని ఫౌండేషన్ పేరుతో ఆ సంస్థ నడుస్తుంది.  

ఇటీవల జరిగిన ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి గెలిచారు. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో ఈ స్థానం నుండి పెమ్మసాని చంద్రశేఖర్‌ను తెలుగుదేశం పార్టీ పోటీకి దింపింది..అత్యధిక ధనవంతుడు మరియు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉండటంతో ప్రజలలో పెమ్మసాని క్రేజ్ బాగా పెరిగింది.. దీనితో పెమ్మసాని గుంటూరు ఎంపీగా విజయం సాధించారు.అలాగే ఊహించని విధంగా మొదటి సారి ఎంపీ గా గెలిచిన పెమ్మసాని ఎన్డీఏ ప్రభుత్వంలో మంత్రి పదవి పొందారు.. టీడీపీ నుంచి మంత్రులైన ఇద్దరిలో ఒకరు పెమ్మసాని. కాగా, మరొకరు క్యాబినెట్ పోస్ట్ దక్కించుకున్న శ్రీకాకుళం ఎంపీ కింజారపు రామ్మోహన్ నాయుడు.

 తెలుగుదేశం పార్టీకి డూ ఆర్ డై లాంటి 2024 ఎన్నికల్లో పెమ్మసాని ఆ పార్టీ అభ్యర్థులకు అండగా నిలిచారని అందరూ చెబుతారు..ప్రస్తుతం పెమ్మసాని చంద్రశేఖర్ మోదీ కేబినెట్ లో అత్యంత సంపన్నుడైన మంత్రిగా వున్నారు. పెమ్మసానికి కేంద్రప్రభుత్వం గ్రామీణాబివృద్ధి, కమ్యునికేషన్స్‌ సహాయ మంత్రిగా అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని గ్రామీణాభివృద్ధి నుంచి ఎక్కువ నిధులు ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొస్తారనే ఆశలో ప్రజలు ఉన్నారు. పైగా ఐటీపై కూడా పెమ్మసానికి అవగాహన ఉంది. దీనితో పెమ్మసానిపై ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. దీనితో పెమ్మసానిపై మరింత భాద్యత పెరిగింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>