PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pulivendula-chandrababu-ysr-sharmilae9d1d452-ccf4-4d6b-b550-1b10423f4f32-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pulivendula-chandrababu-ysr-sharmilae9d1d452-ccf4-4d6b-b550-1b10423f4f32-415x250-IndiaHerald.jpgఏపీ రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ వైయస్ ఫ్యామిలీ పేరు గుర్తుకొస్తుంది. ఇక్కడ ఈ ఫ్యామిలీని ఆరాధిస్తారు. అలాంటి ఈ పులివెందులలో జగన్ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు. అలాంటి ఈ నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో జగన్ గెలుపొందారు. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. దీంతో ఈ నియోజకవర్గంలో పులిలా ఉండే జగన్మోహన్ ను పిల్లిని చేయాలని స్కెచ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా. 2029 నాటికి ఈ నియోజకవర్గ స్వరూపాన్ని మార్చే ప్లాన్లోjagan;pulivendula;chandrababu;ysr;sharmila{#}Telangana;Congress;Scheduled caste;Scheduled Tribes;Government;Telangana Chief Minister;Pulivendula;Reddy;king;King;central government;dr rajasekhar;Assembly;Jagan;TDP;Andhra Pradesh;CBN;YCPపులివెందుల:పులిలాంటి జగన్ ను పిల్లిని చేసే స్కెచ్ వేసిన చంద్రబాబు..!పులివెందుల:పులిలాంటి జగన్ ను పిల్లిని చేసే స్కెచ్ వేసిన చంద్రబాబు..!jagan;pulivendula;chandrababu;ysr;sharmila{#}Telangana;Congress;Scheduled caste;Scheduled Tribes;Government;Telangana Chief Minister;Pulivendula;Reddy;king;King;central government;dr rajasekhar;Assembly;Jagan;TDP;Andhra Pradesh;CBN;YCPWed, 19 Jun 2024 10:43:25 GMT ఏపీ రాష్ట్రంలో పులివెందుల నియోజకవర్గం పేరు చెప్పగానే అందరికీ వైయస్ ఫ్యామిలీ పేరు గుర్తుకొస్తుంది.   ఇక్కడ ఈ ఫ్యామిలీని ఆరాధిస్తారు.  అలాంటి ఈ పులివెందులలో జగన్ హ్యాట్రిక్ విజయం అందుకున్నారు.  అలాంటి ఈ నియోజకవర్గంలో కూడా భారీ మెజారిటీతో జగన్ గెలుపొందారు. కానీ వైసీపీ ప్రభుత్వాన్ని కోల్పోయింది. దీంతో ఈ నియోజకవర్గంలో పులిలా ఉండే జగన్మోహన్ ను పిల్లిని చేయాలని స్కెచ్  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆ వివరాలు ఏంటో చూసేద్దామా. 2029 నాటికి ఈ నియోజకవర్గ స్వరూపాన్ని మార్చే ప్లాన్లో టిడిపి ఉన్నట్టు తెలుస్తోంది. 2026 లో  నియోజకవర్గాల పునర్విభజన జరగనుంది. 

ఈ టైంలో చంద్రబాబు ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది. ఈ క్రమంలో ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్లను పెంచుకునే అవకాశం ఉంది. ఏపీలో ఉన్న 175 సీట్లను కాస్త 225 కు పెంచే అవకాశం కనిపిస్తోంది. 2006లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది ఆ టైంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉన్నారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఉంది. దీంతో వారికి తగినట్టుగా నియోజకవర్గాలను మార్చుకున్నారు.  టిడిపికి బలం ఉన్నచోట విడగొట్టి కాంగ్రెస్ కు బలం ఉన్నచోట కలిపేసుకున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి 2026 లో జరగబోతుందని తెలుస్తోంది. ఈసారి పునర్విభజన జరిగితే కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి కాంటెస్ట్ చేసే పులివెందులపై ఫోకస్ పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకవేళ ఆ నియోజకవర్గాన్ని ఎస్సీ రిజర్వుడు చేసిన కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు.

అలాగే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలను కూడా మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో జనరల్ లో ఉన్నవి రిజర్వుడ్ గా మారిపోతాయి. ఈ విధంగా అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సేఫ్ జోన్ లో ఉండడం కోసం తప్పకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండే స్థానాలపై తప్పక దెబ్బ కొడతారని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రస్తుతం కేంద్రంలో కూడా కింగ్ మేకర్ గా ఉన్నారు కాబట్టి ఈయన చెప్పింది కేంద్ర ప్రభుత్వం కూడా పాటించే అవకాశం కనిపిస్తోంది.  ఈ విధంగా పునర్విభజన జరిగితే మాత్రం తప్పకుండా జగన్ పోటీ చేసే పులివెందులను ఆయనకు దూరం చేస్తారనే టాక్ వినిపిస్తోంది.  మరి చూడాలి విభజనలో ఎలాంటి మార్పులు జరుగుతాయి అనేది ముందు ముందు తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>