BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu7daddeff-d07f-4f3b-97bf-0cdd44a60fc6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/chandrababu7daddeff-d07f-4f3b-97bf-0cdd44a60fc6-415x250-IndiaHerald.jpgప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న 11, 12 తరగతుల విద్యార్ధులకూ ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్ , ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 1,08,619 మంది విద్యార్ధులు, 2 ఏడాది ఇంటర్ చదివే 92,134 మంది విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ నిర్ణయించారు. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్chandrababu{#}Jr NTR;Director;Andhra Pradesh;Government;Teluguచంద్రబాబు గుడ్‌న్యూస్‌.. వాళ్లకు కూడా ఉచిత పుస్తకాలు?చంద్రబాబు గుడ్‌న్యూస్‌.. వాళ్లకు కూడా ఉచిత పుస్తకాలు?chandrababu{#}Jr NTR;Director;Andhra Pradesh;Government;TeluguWed, 19 Jun 2024 08:26:00 GMTప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న  11, 12 తరగతుల విద్యార్ధులకూ ఉచిత పాఠ్యపుస్తకాలు ఇవ్వాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూల్స్ , ఏపీ రెసిడెన్షియల్ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్ లలో చదివే విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ చేస్తారు. ఇంటర్ మొదటి సంవత్సరం చదివే 1,08,619 మంది విద్యార్ధులు, 2 ఏడాది ఇంటర్ చదివే 92,134 మంది విద్యార్ధులకు ఉచిత పాఠ్యపుస్తకాలు పంపిణీ నిర్ణయించారు. ఈ పథకానికి నోడల్ అధికారిగా సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ ను నియమిస్తూ  ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.


పాఠ్యపుస్తకాలతో పాటు నోట్ పుస్తకాలు, బ్యాగ్ లను ను తెలుగు అకాడెమీ నుంచి సరఫరా చేయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పుస్తకాల స్టాక్ ను పంపిణీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీలో లోటు ఉంటే తక్షణం పుస్తకాల ముద్రణకు అనుమతిచ్చేలా సమగ్ర శిక్షా డైరెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు. జూలై 15 తేదీలోగా విద్యార్ధులందరికీ అందేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>