MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఅల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ అభిమానులు కూడ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ ఆగష్టు 15 విడుదల తేదీ నుండి వాయిదా పడటం ఖాయం అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ క్లైమాక్స్ విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ ఒక కారణం అయితే ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో జరుగుతున్న జాప్యం కూడ ఈమూవీ వాయిదా మరో కారణం అన్న లీకులు వస్తున్నాయి. ఈకారణాలతో పాటు మరోకారణం కూడ ‘పుష్ప 2’ వాయిదాకు ప్రధాన కారణంగా మరొక విషయం కూడ ఉందని అంటున్నారు. ఈమధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మెగా హీరోలPUSHPA2{#}Allu Arjun;kalyan;shilpa;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;pithapuram;August;Graphics;Hero;Arjunపుష్ప వాయిదా వెనుక మరొక కోణం !పుష్ప వాయిదా వెనుక మరొక కోణం !PUSHPA2{#}Allu Arjun;kalyan;shilpa;Andhra Pradesh;Y. S. Rajasekhara Reddy;pithapuram;August;Graphics;Hero;ArjunTue, 18 Jun 2024 08:00:00 GMTఅల్లు అర్జున్ అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ అభిమానులు కూడ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘పుష్ప 2’ ఆగష్టు 15 విడుదల తేదీ నుండి వాయిదా పడటం ఖాయం అన్న స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. ఈమూవీ క్లైమాక్స్ విషయంలో ఏర్పడ్డ కన్ఫ్యూజన్ ఒక కారణం అయితే ఈమూవీ గ్రాఫిక్స్ వర్క్స్ విషయంలో జరుగుతున్న జాప్యం కూడ ఈమూవీ వాయిదా మరో కారణం అన్న లీకులు వస్తున్నాయి.


ఈకారణాలతో పాటు మరోకారణం కూడ ‘పుష్ప 2’ వాయిదాకు ప్రధాన కారణంగా మరొక విషయం కూడ ఉందని అంటున్నారు. ఈమధ్యనే జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో మెగా హీరోలు అంతా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం వచ్చి అతడి గెలుపు కోసం ప్రచారం చేస్తే అల్లు అర్జున్ మాత్రం తన మిత్రుడైన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి శిల్పా రవికి ప్రచారం చేయడం ఒక పెద్ద వివాదంగా మారదమే కాకుండా ఆవిషయాన్ని మెగా ఫ్యామిలీ కూడ చాల సున్నితంగా తీసుకుంది అన్నఅభిప్రాయాలు ఉన్నాయి.


ఈవిషయమై మెగా ఫ్యామిలీ హీరోలు ఓపెన్ గా ఏమీ చెప్పకపోయినా మెగా యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఎకౌంట్ అన్ ఫాలో చేయడంతో మెగా అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ మళ్ళీ ఏర్పడిందా అన్న సందేహాలు చాలామందికి వచ్చాయి. దీనికితోడు పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకార మహోత్సవంలో మెగా హీరోల సందడి కనిపించినా ఎక్కడా అల్లు అర్జున్ కనిపించకపోవడం మరిన్ని చర్చలకు తెరతీసింది.


దీనితో మెగా ఫ్యాన్స్ కూడ అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ హడావిడి మొదలుపెట్టారు. దీని ప్రభావం ‘పుష్ప 2’ టాక్ పై ఉంటుందని కొన్ని ఊహాగానాలు కూడ వచ్చాయి. ఈవిషయాలు ‘పుష్ప 2’ బయ్యర్ల వరకు వెళ్లడంతో వారంతా టెన్షన్ లో ఉన్నట్లు గాశిప్పులు కూడ వచ్చాయి. ఈవిషయాలు అన్నీ ఈమూవీ నిర్మాతలవరకు వెళ్లడంతో ఈ నెగిటివ్ కామెంట్స్ వేడి తగ్గే వరకు ‘పుష్ప 2’ విడుదల వాయిదా వేస్తే మంచిది అన్న ఆలోచన కూడా ఈమూవీ వాయిదాకు ఒక కారణం అని అంటున్నారు..  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>