PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-this-the-first-challenge-for-deputy-chief-ministe-pawan-how-will-he-face-itab158430-1c6c-4fb7-bbf5-c0627abd5fc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-this-the-first-challenge-for-deputy-chief-ministe-pawan-how-will-he-face-itab158430-1c6c-4fb7-bbf5-c0627abd5fc7-415x250-IndiaHerald.jpg- 17వ ఆర్థిక సంఘం నిధులు పంచాయ‌తీల‌కు ఇవ్వ‌లేదు - పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధికి కేంద్రం నిధులు రాబ‌డ‌తాడా..! ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్కు చంద్ర‌బాబు పంచా యతీరాజ్‌, గ్రామీణా భివృద్ది శాఖ‌ల‌ను అప్ప‌గించారు. ఈ నెల 19న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌స‌ద‌రు బాధ్య‌త‌ను కూడా తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. పంచాయ‌తీరాజ్‌.. గ్రామీణాభివృద్ది శాఖ‌లు అంత ఈజీ అయితేకాదు. నిరంత‌రం అందుబాటులో ఉండాలి. నిరంత‌రం వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; cm; jenasena{#}central government;war;electricity;YCP;Party;Indiaఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కు ఎదుర‌య్యే తొలిస‌వాల్ ఇదేనా.... ఎలా ఫేస్ చేస్తాడో ?ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌కు ఎదుర‌య్యే తొలిస‌వాల్ ఇదేనా.... ఎలా ఫేస్ చేస్తాడో ?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; cm; jenasena{#}central government;war;electricity;YCP;Party;IndiaTue, 18 Jun 2024 09:48:27 GMT- 17వ ఆర్థిక సంఘం నిధులు పంచాయ‌తీల‌కు ఇవ్వ‌లేదు
- పంచాయ‌తీ, గ్రామీణాభివృద్ధికి కేంద్రం నిధులు రాబ‌డ‌తాడా..!

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్కు చంద్ర‌బాబు పంచా యతీరాజ్‌, గ్రామీణా భివృద్ది శాఖ‌ల‌ను అప్ప‌గించారు. ఈ నెల 19న ప‌వ‌న్‌క‌ల్యాణ్‌స‌ద‌రు బాధ్య‌త‌ను కూడా తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించారు. అయితే.. పంచాయ‌తీరాజ్‌.. గ్రామీణాభివృద్ది శాఖ‌లు అంత ఈజీ అయితేకాదు. నిరంత‌రం అందుబాటులో ఉండాలి. నిరంత‌రం వ‌చ్చే స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ కూడా ఉండాలి. ప్ర‌ధానంగా ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌ను అధ్య‌య‌నం చేశారు.


`ఇవి నామ‌న‌సుకు ద‌గ్గ‌ర‌గా ఉన్న శాఖ‌లు` అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పినా.. చేత‌ల్లోకివ‌చ్చే స‌రికి మాత్రం పంచాయ‌తీరాజ్ స‌మ‌స్య‌లు గుట్ట‌లుగా పేరుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు 17వ ఆర్థిక సంఘంనిధుల‌ను పంచాయతీల‌కు ఇవ్వ‌లేదు. గ‌త ఐదేళ్ల‌లో పంచాయ‌తీల‌ను ప‌ట్టించుకోలేదు. పైగా.. కేంద్ర ప్ర‌భుత్వ ఆదేశాల మేర‌కు.. పంచాయ‌తీల కరెంటు బిల్లుల‌ను త‌క్ష‌ణ‌మే వ‌సూలు చేయాల‌న్న ఆదేశాలు కూడా ఉన్నాయి. వీటిని కాద‌ని వెన‌క్కి తీసుకుంటే.. పంచాయతీల‌కు కేంద్రం ఇచ్చే నిధుల్లో కోత ప‌డ‌నుంది.


అలాగ‌ని పంచాయ‌తీల పీక‌పై క‌త్తి పెట్టివ‌సూలు చేసే ప్ర‌య‌త్నంచేస్తే.. వైసీపి స‌ర్కారు ప‌డిన‌ట్టే  ఇబ్బందుల్లో ప‌డాల్సి ఉంటుంది. సో.. ఎలా చూసుకున్నా.. పంచాయ‌తీ వ్య‌వ‌స్థ ను గాడిలో పెట్ట‌డంఅంత తేలిక‌గాఅయ్యే ప‌నికాదు. మ‌రోవైపు.. అన్నిగ్రామ పంచాయ‌తీల్లోనూ.. దాదాపు వైసీపీ అనుకూల సంఘాలే ఉన్నాయి. ఆ పార్టీ సానుభూతి ప‌రులే ఉన్నారు. ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో వైసీపీకి ఓటు బ్యాంకు త‌గ్గినా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం స్థిరంగానే ఉండ‌డానికి ఇదే కార‌ణం.


ఈ క్ర‌మంలో పంచాయతీల‌కు.. రాష్ట్ర స‌ర్కారు ఏమేర‌కు నిధులు విడుద‌ల చేస్తుంద‌నేది డౌటే. దీనిని సాధించుకునే క్ర‌మంలో ప‌వ‌న్‌కు ఇబ్బందులు ఎదురైనా ఆశ్చ‌ర్యం లేదు. ఇక, గ్రామీణాభివృద్ది విష‌యం లో కేంద్రం ఇచ్చే నిధుల‌ను రాష్ట్రం వాడింద‌నే విమ‌ర్శ‌లు వున్నాయి. అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలు.. ఇత‌ర‌త్రా కార‌ణాల‌తో ఈ నిధులు దారి మ‌ళ్లాయి. అయితే.. ఇప్పుడు కూడా ఇలాంటి ప‌రిస్థితి నెల‌కొంది. ఈ క్ర‌మంలో ప‌వ‌న్ వీటిని స‌రిచేసుకుని ముందుకు సాగ‌డం స‌వాళ్ల‌తో యుద్ధం చేసినంత ప‌నేన‌ని ప‌రిశీల‌కులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>