PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp20272096-c43b-4e52-9ea6-c497ff46f75e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdp20272096-c43b-4e52-9ea6-c497ff46f75e-415x250-IndiaHerald.jpgఏపీలో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత...మంత్రులు, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోం మంత్రి అనిత, అచ్చెన్నాయుడు...పోలీసులు, వైసీపీ పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ తరుణంలోనే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్వో, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు...పసుపు బిళ్లాలు వేసుకుని వెళ్లాలని కోరారు. పసుపు బిల్లాలు వేసుకుంటే...మీకు టీం, టిఫిన్‌ పెట్టి మరీ అధికారులు పని చేస్తారన్నారు. tdp{#}ATCHANNAIDU KINJARAPU;District;Srikakulam;Turmeric;MLA;Party;Minister;YCP;TDP;Government;Telugu Desam Party;CBNఅచ్చెన్నా: పసుపు బిళ్లతో వెళ్లండి, అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు?అచ్చెన్నా: పసుపు బిళ్లతో వెళ్లండి, అధికారులు మిమ్మల్ని గౌరవిస్తారు?tdp{#}ATCHANNAIDU KINJARAPU;District;Srikakulam;Turmeric;MLA;Party;Minister;YCP;TDP;Government;Telugu Desam Party;CBNTue, 18 Jun 2024 08:40:24 GMTఏపీలో తెలుగు దేశం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత...మంత్రులు, టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా హోం మంత్రి అనిత, అచ్చెన్నాయుడు...పోలీసులు, వైసీపీ పార్టీ నేతలకు వార్నింగ్‌ ఇస్తున్నారు. ఈ తరుణంలోనే.. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మార్వో, జిల్లా ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే టీడీపీ కార్యకర్తలు...పసుపు బిళ్లాలు వేసుకుని వెళ్లాలని కోరారు. పసుపు బిల్లాలు వేసుకుంటే...మీకు టీం, టిఫిన్‌ పెట్టి మరీ అధికారులు పని చేస్తారన్నారు. 

ఒకవేళ ప్రభుత్వం అధికారులు అలా చేయకపోతే...వాళ్ల అంతుచూస్తామంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు...ఏపీ రాజకీయాల్లో దుమారన్నే రేపుతున్నాయి. శ్రీకాకుళంలో జిల్లాలో మంత్రి అచ్చెన్నాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు.
పార్టీ చాలా ‌కష్టాలు , ఒడుదుడుగులు ఎదుర్కొందని... నిద్రలేని రాత్రులు గడిపామన్నారు. వైసిపి ప్రభుత్వంలో నాలుగైదు సార్లు ఎమ్మెల్యేలుగా గెలిచిన టిడిపి నేతలు మాట్లాడలేక పోయేవారని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు.


ఇక మన ప్రభుత్వం వచ్చింది... కార్యకర్తలకు అన్యాయం చేయబోమన్నారు.  పసుపు బిల్లాలు పెట్టుకొని వెళ్లండి... అధికారులు పనిచేసే విధంగా అర్డర్ ఇస్తానని ప్రకటించారు. చంద్రబాబు కొసం ప్రాణత్యాగానికి సిద్దమని చెప్పిన ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ర్ట వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు...తన కుటుంబానికి రెండు పదవులు ఇచ్చారని కొనియాడారు.  ఒక‌ నమ్మకంతో చంద్రబాబు పదవి ఇచ్చారని వివరించారు. అచ్చెన్నాయుడు మాట ఇస్తే పీకకొసుకుంటాడు తప్ప మాటతప్పడని వెల్లడించారు. ‌

వైసీపీ పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో వ్యవస్దలు సర్వనాశనం అయ్యాయని... శ్రీకాకుళం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. నేను చాలా అదృష్టవంతుడును, తన సమర్దతను బాబు గుర్తించి కీలక శాఖలు ఇచ్చారని తెలిపారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయ్యాను....నా ‌జీవితం శ్రీకాకుళం జిల్లా, టిడిపి, చంద్రబాబు కుటుంబానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇక తమ ప్రభుత్వంలో ఏపీని అభివృద్ది చేసి చూపెడతామని వెల్లడించారు మంత్రి అచ్చెన్నాయుడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>