MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh4bdd9477-c1d9-4046-9fda-b74c7406335f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/mahesh4bdd9477-c1d9-4046-9fda-b74c7406335f-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయినప్పటికీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవడంలో కాస్త విఫలం అయింది. ఇక మహేష్ తన తదుపరి మూవీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమా యొక్క షూటింగ్ మరో రెండు, మూడmahesh{#}mahesh babu;Guntur;Athadu;trivikram srinivas;Rajamouli;Cinemaరాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన మహేష్... ఈసారైనా గట్టిగా కొడతారా..?రాజమౌళి తర్వాత ఆ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చిన మహేష్... ఈసారైనా గట్టిగా కొడతారా..?mahesh{#}mahesh babu;Guntur;Athadu;trivikram srinivas;Rajamouli;CinemaTue, 18 Jun 2024 12:49:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు ఆఖరుగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయినప్పటికీ ఆ స్థాయి విజయాన్ని అందుకోవడంలో కాస్త విఫలం అయింది. ఇక మహేష్ తన తదుపరి మూవీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి రాజమౌళి దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నాడు.

సినిమా యొక్క షూటింగ్ మరో రెండు, మూడు నెలల్లో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ దాదాపు సంవత్సరం కంటే ఎక్కువ రోజులు సాగే అవకాశం ఉన్నట్లు, దాదాపుగా ఈ మూవీ 2026 వ సంవత్సరం చివరలో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే మహేష్ బాబు, రాజమౌళి సినిమా పైనే అందరి దృష్టి ఉన్నప్పటికీ మహేష్ మాత్రం రాజమౌళి సినిమా తర్వాత ఎవరితో సినిమా చేయాలి అనే దానిపై కూడా ఇప్పటి నుండే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఓ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.

ఇక మహేష్, రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ కు ఈ విషయం గురించి చెప్పినట్లు, ఆయన కూడా అందుకు అనుగుణంగా ఆ కథను రెడీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. మహేష్, త్రివిక్రమ్ కాంబోలో ఇప్పటి వరకు అతడు, ఖలేజా, గుంటూరు కారం సినిమాలు రూపొందాయి. ఇందులో ఖలేజా, గుంటూరు కారం సినిమాలు ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. అతడు సినిమా ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో ఆకట్టుకున్న విడుదల అయిన సమయంలో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ విజయాన్ని అందుకోలేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>