MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ స్థానం నుండి ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషన్ గా మారిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక శక్తిగా మారాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు అనేకమైన కీలక శాఖలకు మంత్రిగా ఆయన మారడంతో క్షణం తీరికలేకుండా పవన్ రోజులు గడుపుతున్నారు. ప్రస్తుతం పవన్ పూర్తి చేయవలసిన సినిమాలు మూడు మిగిలి ఉన్నాయి. ‘ఓజీ’ మూవీకి 20 రోజులు కేటాయిస్తే చాలు ఆమూవీ షూటింగ్ పూర్తి అవుతుంది అని అంటున్నారు. ఇక ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ఈమూవీ షూటింగ్ ఇంకా చాలవరకు పూpavankalyan{#}Kshanam;Industry;harish shankar;Pawan Kalyan;kalyan;News;Telangana Chief Ministerఅంతర్మధనంలో పవన్ కళ్యాణ్ నిర్మాతలు ?అంతర్మధనంలో పవన్ కళ్యాణ్ నిర్మాతలు ?pavankalyan{#}Kshanam;Industry;harish shankar;Pawan Kalyan;kalyan;News;Telangana Chief MinisterTue, 18 Jun 2024 15:45:03 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ స్థానం నుండి ఇప్పుడు ఫుల్ టైమ్ పొలిటీషన్ గా మారిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఆయన కీలక శక్తిగా మారాడు. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రి హోదాతో పాటు అనేకమైన కీలక శాఖలకు మంత్రిగా ఆయన మారడంతో క్షణం తీరికలేకుండా పవన్ రోజులు గడుపుతున్నారు.



ప్రస్తుతం పవన్ పూర్తి చేయవలసిన సినిమాలు మూడు మిగిలి ఉన్నాయి. ‘ఓజీ’ మూవీకి 20 రోజులు కేటాయిస్తే చాలు ఆమూవీ షూటింగ్ పూర్తి అవుతుంది అని అంటున్నారు. ఇక ‘హరి హర వీరమల్లు’ పరిస్థితి కూడ ఇలాగే ఉంది. ఈమూవీ షూటింగ్ ఇంకా చాలవరకు పూర్తి కావలసి ఉండటంతో ముందుగా ప్రస్తుతం పవన్ ఆలోచనలలో ఈమూవీ షూటింగ్ ను పూర్తి చేసి ఆతరువాత ‘ఓజీ’ వైపు అడుగులు వేయాలని పవన్ ఆలోచన అని అంటున్నారు.



ఇక హరీష్ శంకర్ కాంబినేషన్ లో పవన్ చేయవలసి ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ షూటింగ్ కేవలం వారం రోజులు మాత్రమే జరిగిన నేపధ్యంలో ఈమూవీ పూర్తి చేయాలి అంటే కనీసం పవన్ మూడు నెలలు తన సమయాన్ని కేటాయించవలసి ఉంది అని అంటున్నారు. ప్రస్తుతం పవన్ బిజీని పరిగణలోకి తీసుకుంటే ఈ సంవత్సరం చివరి వరకు పవర్ స్టార్ షూటింగ్ ల వైపు రావడం కష్టం అంటూ సంకేతాలు వస్తున్నాయి.



ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న వార్తల ప్రకారం పవన్ ఆరు నెలల తరువాత నెలకు వారం రోజులు చొప్పున తన పెండింగ్ సినిమాల షూటింగ్ కోసం డేట్స్ ఇచ్చి ఆసినిమాలను వీలైనంత వేగంగా పూర్తి చేయాలి అన్న ఆలోచనల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాలు అన్నీ అత్యంత భారీ బడ్జెట్ సినిమాలు కావడంతో ఆసినిమాల షూటింగ్ విషయంలో జరిగే ఆలస్యం ఆమూవీ ఆమూవీ నిర్మాతలకు ఆర్ధికంగా పెను భారంగా మారే ఆస్కారం ఉంది అని అంటున్నారు. దీనితో ప్రస్తుతం కళ్యాణ్ తో సినిమాలు తీస్తున్న నిర్మాతలు కన్ఫ్యూజన్ లో ఉన్నట్లు టాక్..  



.  









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>