MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcbe76ead-4c9f-4173-80b6-2e64b193fe6b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodcbe76ead-4c9f-4173-80b6-2e64b193fe6b-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్ ఏ డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న చర్చలు మొదలయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు విశ్వంభర తర్వాత మెగాస్టార్ పలు సినిమాల కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది. కొందరు డైరెక్టర్ల తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ వాటికి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా బయటకు రాలేదు. అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే tollywood{#}editor mohan;Deputy Chief Minister;Director;God Father;Pawan Kalyan;Chiranjeevi;News;Cinemaఆ స్టార్ డైరెక్టర్ తో చిరంజీవి 157వ సినిమా.. ఇదిగో క్లారిటీ..!?ఆ స్టార్ డైరెక్టర్ తో చిరంజీవి 157వ సినిమా.. ఇదిగో క్లారిటీ..!?tollywood{#}editor mohan;Deputy Chief Minister;Director;God Father;Pawan Kalyan;Chiranjeevi;News;CinemaTue, 18 Jun 2024 10:10:00 GMTమెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం యంగ్ హీరోలకి పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ సినిమా తర్వాత మెగాస్టార్డైరెక్టర్ తో సినిమా చేయబోతున్నాడు అన్న చర్చలు మొదలయ్యాయి. తాజాగా అందుతున్న సమాచారం మేరకు విశ్వంభర తర్వాత మెగాస్టార్ పలు సినిమాల కథలు వింటున్నట్లుగా తెలుస్తోంది. కొందరు డైరెక్టర్ల తో సినిమా చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. కానీ వాటికి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ కూడా బయటకు

 రాలేదు. అయితే అన్ని అనుకున్నట్లుగా జరిగితే మాత్రం చిరంజీవి ఒక దర్శకుడితో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇక తాజాగా ఈ విషయాన్ని క్లియర్ చేస్తూ ఒక ఫోటో సైతం విడుదల చేశారు. ఇక అసలు విషయం ఏంటంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటీవల భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాలామంది సినీ ప్రముఖులు అందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే అందులో గాడ్ ఫాదర్ దర్శకుడు

 మోహన్ రాజా కూడా ఒకరు. ఆయన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలపడానికి వెళ్లారు. దీంతో పవన్ ఒక ఫోటోని షేర్ చేసాడు. ఇక ఆ ఫోటో చూసిన వారందరూ మెగాస్టార్ తదుపరి సినిమా ఆయనతోనే చేయబోతున్నారు అంటూ కామెంట్లు పెట్టడం మొదలుపెట్టారు. అయితే ఈ డౌట్ ఎందుకు వచ్చిందా అని అందరూ అనుకుంటున్నారేమో.. ఎందుకంటే ఈ ఫోటోలో కేవలం మోహన్ రాజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరే ఉంటే ఈ ప్రశ్న రాకపోయేది. కానీ అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. అందుకే ఈ వార్తలు రావడం మొదలయ్యాయి. మొత్తానికి అయితే మోహన్ రాజా తో చిరంజీవి నెక్స్ట్ సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. కానీ దీనికి సంబంధించిన ఎటువంటి అధికారిక ప్రకటన లేదు..!!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>