PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbnf152f4c7-229e-47e9-83e9-b8c7789937c4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/cbnf152f4c7-229e-47e9-83e9-b8c7789937c4-415x250-IndiaHerald.jpgఅభివృద్ధి కోసం విద్యావంతులకు మంత్రి అవకాశాలు.. సూపర్ CBN!•రాష్ట్రానికి విద్యావంతులు మంత్రులు•చంద్రబాబు తాట్ కి హాట్స్ ఆఫ్ అంటున్న ఆంధ్రులు ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: 24 మంది మంత్రులతో అధికార పార్టీ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కగా కొలువుదీరింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 వ సారి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించగా, కొత్త మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అయ్యారు.చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉంCBN{#}Ford;DR NIMMALA RAMANAIDU;PAYYAVULA KESHAV;K S Ravikumar;Degree;Nimmala Ramanaidu;Kandula Durgesh;bharath;Sri Bharath;Kannada;Cabinet;Nadendla Manohar;ATCHANNAIDU KINJARAPU;srinivas;Nara Lokesh;Backward Classes;Reddy;Minister;India;Telangana Chief Minister;Bharatiya Janata Party;Party;Janasena;CBN;Andhra Pradeshఅభివృద్ధి కోసం విద్యావంతులకు మంత్రి అవకాశాలు.. సూపర్ CBN!అభివృద్ధి కోసం విద్యావంతులకు మంత్రి అవకాశాలు.. సూపర్ CBN!CBN{#}Ford;DR NIMMALA RAMANAIDU;PAYYAVULA KESHAV;K S Ravikumar;Degree;Nimmala Ramanaidu;Kandula Durgesh;bharath;Sri Bharath;Kannada;Cabinet;Nadendla Manohar;ATCHANNAIDU KINJARAPU;srinivas;Nara Lokesh;Backward Classes;Reddy;Minister;India;Telangana Chief Minister;Bharatiya Janata Party;Party;Janasena;CBN;Andhra PradeshTue, 18 Jun 2024 12:05:24 GMT•రాష్ట్రానికి విద్యావంతులు మంత్రులు


•చంద్రబాబు తాట్ కి హాట్స్ ఆఫ్ అంటున్న ఆంధ్రులు


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: 24 మంది మంత్రులతో అధికార పార్టీ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా చక్కగా కొలువుదీరింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4 వ సారి చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించగా, కొత్త మంత్రులు పదవీ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధం అయ్యారు.చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లో అందరూ ఉన్నత విద్యావంతులు ఉండడం విశేషం. ఇది ఆయన అధికారం లోకి వచ్చాక చేసిన మొట్టమొదటి మంచి పని. ఎందుకంటే విద్యావంతులు మాత్రమే రాష్ట్రాన్ని చాలా వేగంగా అభివృద్ధి చేస్తారు. అందుకే బాబు సరైన నిర్ణయం తీసుకున్నారు.ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంఎ ఎకనామిక్స్ చదివారు. జనసేన పార్టీ నుండి మంత్రి అయిన కందుల దుర్గేష్ కూడా ఎంఎ ఎకనామిక్స్ చదివారు. అలాగే బీజేపీ నుండి మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ ఎంఎ పొలిటికల్ సైన్స్ చదివారు. ఆయనకు హిందీ, ఇంగ్లీష్, మరాఠీ ఇంకా అలాగే కన్నడ భాషలు కూడా అనర్గళంగా వస్తాయి.చంద్రబాబు తనయుడు నారా లోకేష్ అమెరికాలోని స్టాన్ ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో, టీజీ భరత్ బ్రిటన్ లో ఎంబీఎ చదివారు.


అలాగే నాదెండ్ల మనోహర్ ఎంబీఎతో పాటు మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. ఇక పయ్యావుల కేశవ్ కూడా మార్కెటింగ్ స్పెషలైజేషన్ చదివారు. మరో మంత్రి అయిన గొట్టిపాటి రవికుమార్ ఇంజనీరింగ్ చదవగా, డోలా బాల వీరాంజనేయ స్వామి వైద్య విద్యను చదివారు.ఇక నిమ్మల రామానాయుడు ఎంఎ, ఎంఫిల్ చదివి పీహెచ్డీ డాక్టరేట్ అందుకున్నారు. మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాత్రం బీడీఎస్ ను మద్యలో ఆపేశారు. కొండపల్లి శ్రీనివాస్ యూఎస్ లో ఎంఎస్ చదవగా, ఆనం రామనారాయణ రెడ్డి, వాసంశెట్టి సుభాష్ ఇంకా కొల్లు రవీంద్రలు న్యాయవిద్యను అభ్యసించారు. పొంగూరు నారాయణ, వంగలపూడి అనితలు పీజీ విద్యని పూర్తి చేశారు. సవిత, సంద్యారాణి, బీసీ జనార్ధన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, ఇంకా కొలుసు పార్ధసారధిలు డిగ్రీ చదివారు. ఇక అచ్చెన్నాయుడు బీఎస్సీ మధ్యలో ఆపేయగా, ఎన్ఎండీ ఫరూక్ ఇంటర్ ని మాత్రమే పూర్తిచేశారు. ఇలా ఎక్కువగా చదువుకున్నవారు మంత్రులు అవ్వడం వలన ఏపి ప్రజలు చాలా ఆశగా ఉన్నారు. చంద్ర బాబు ఈ నిర్ణయం తీసుకున్నందుకు శభాష్ అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>