EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan14fee30c-9ca8-45cb-8376-cfc2d3bf9756-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan14fee30c-9ca8-45cb-8376-cfc2d3bf9756-415x250-IndiaHerald.jpgఎందుకు ఓడిపోయానో.. ఎలా ఓడిపోయానో అర్థం కావడం లేదు. అందరికీ మంచి చేశానని.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించానని అయినా ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం చేశారో తెలియడం లేదు. ఇవి ఓటమి తర్వాత తరచూ జగన్ నోటి వెంట వినిపించిన మాటలు. అయితే ఎందుకు ఓడిపోయారో నిజంగా జగన్ కు తెలియదా అంటే కచ్ఛితంగా తెలుసు. ఇదిలా ఉండగా.. వైసీపీ ఘెర పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి. దేని గురించి చెప్పుకున్నా మరోకటి మిగిలే ఉంటుంది. అంతలా ఉన్నాయి మరి కారణాలు.. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఈ పేర్లు వినగానే మద్యం ప్రియులు అంjagan{#}dr rajasekhar;vegetable market;YCP;Jagan;CBNజగన్‌ను అందరికంటే ఎక్కువ ముంచింది.. ఆ రెడ్డిగారేనా?జగన్‌ను అందరికంటే ఎక్కువ ముంచింది.. ఆ రెడ్డిగారేనా?jagan{#}dr rajasekhar;vegetable market;YCP;Jagan;CBNMon, 17 Jun 2024 10:04:00 GMTఎందుకు ఓడిపోయానో.. ఎలా ఓడిపోయానో అర్థం కావడం లేదు.  అందరికీ మంచి చేశానని.. ప్రతి కుటుంబానికి సంక్షేమం అందించానని అయినా ఎందుకు పదకొండు సీట్లకు పరిమితం చేశారో తెలియడం లేదు. ఇవి ఓటమి తర్వాత తరచూ జగన్ నోటి వెంట వినిపించిన మాటలు. అయితే ఎందుకు ఓడిపోయారో నిజంగా జగన్ కు తెలియదా అంటే కచ్ఛితంగా తెలుసు.


ఇదిలా ఉండగా.. వైసీపీ ఘెర పరాజయానికి కారణాలు చాలానే ఉన్నాయి.  దేని గురించి చెప్పుకున్నా మరోకటి మిగిలే ఉంటుంది. అంతలా ఉన్నాయి మరి కారణాలు.. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్.. ఈ పేర్లు వినగానే మద్యం ప్రియులు అంతెత్తున లేచి పడతారు. ఎందుకు అంటే ఇవన్నీ మద్యం బ్రాండ్లు. పిచ్చి పిచ్చి పేర్లతో మద్యం బ్రాండ్లను సృష్టించి అధిక ధరలకు విక్రయించారు. అసలు మద్యపాన నిషేధం చేస్తానని ఎన్నికల ముందు ప్రకటించి ఆ తర్వాత మద్యం రేట్లు పెంచి రాష్ట్ర ఖజానాతో పాటు సొంత జేబులు నింపుకొనే ప్రయత్నం చేశారు.


ఇప్పటి వరకు ఇష్టంగా తాగిన బ్రాండ్లను పక్కకు పెట్టించి వైసీపీ నేతలకు చెందిన మద్యం బ్రాండ్లను కొత్త పేర్లతో మార్కెట్ కు పరిచయం చేశారు. డిస్టిటరీలు, బ్రూవరీస్ ను చేజిక్కించుకొన జే బ్రాండ్లను తయారు చేసి జనంపైకి వదిలారు. మహిళలు మద్యపాన నిషేధ చేస్తారని భావిస్తే.. వారి భర్తలు ఇతర బ్రాండ్ల రకం మద్యం తాగి ఎక్కువగా డబ్బులు వృథా చేసుకోవడమే కాక.. అనారోగ్యం బారిన కూడా పడ్డారు.  దీంతో పురుషులతో పాటు మహిళలు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు.


ఇదే సమయంలో చంద్రబాబు మద్యం ధరలు తగ్గిస్తానని చెప్పడంతో పాటు.. పాత రకం కంపెనీలనే తీసుకువస్తానని చెప్పారు. దీంతో వారంతా కూటమి వైపై మొగ్గు చూపారు. అయితే జగన్ ఓటమిలో కీలకమైన మద్యం విషయంలో ఏ బ్రాండ్ అమ్మాలో నిర్ణయించేది కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని తాజాగా వెలుగులోకి వచ్చింది. అంటే కొత్త రకం బ్రాండ్లు, ఇతర మద్యం పాలసీలు అంతా కసిరెడ్డి కనుసన్నల్లోనే జరిగాయి అని అర్థం అవుతోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>