MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgసంక్రాంతి సీజన్ తరువాత కలక్షన్స్ పరంగా చెప్పుకోతగ్గ సీజన్ సమ్మర్ టాప్ హీరోల సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సీజన్ లో పోటీ పడటం కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. అయితే ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిచిపోలేని సీజన్. ‘టిల్లు’ స్క్వేర్ తరువాత ఎన్ని సినిమాలు విడుదలైనా ఏఒక్క సినిమా వైపు జనం అడుగులు వేయలేదు. దీనికితోడు ఎన్నికలు ఐపీయల్ సీజన్ అడ్డు పడటంతో ప్రేక్షకులు సినిమాలకు రావడం మర్చిపోయారు. దీనితో కలక్షన్స్ లేక కొన్ని రోజుల పాటు తెలంగాణాలో ధియేటర్లను మూసివేశారు అంటే పరిస్థితి ఎంత TOLLYWOOD{#}Tollywood;Elections;Darsakudu;Director;Audience;ajay;sudheer babu;vijay sethupathi;Box office;Industry;Cinemaసమ్మర్ రేస్ కు ఊహించని ఫినిషింగ్ టచ్ !సమ్మర్ రేస్ కు ఊహించని ఫినిషింగ్ టచ్ !TOLLYWOOD{#}Tollywood;Elections;Darsakudu;Director;Audience;ajay;sudheer babu;vijay sethupathi;Box office;Industry;CinemaMon, 17 Jun 2024 13:19:01 GMTసంక్రాంతి సీజన్ తరువాత కలక్షన్స్ పరంగా చెప్పుకోతగ్గ సీజన్ సమ్మర్ టాప్ హీరోల సినిమాలతో పాటు అనేక సినిమాలు ఈ సీజన్ లో పోటీ పడటం కొన్ని దశాబ్ధాలుగా కొనసాగుతోంది. అయితే ఈ సంవత్సరం సమ్మర్ సీజన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో మరిచిపోలేని సీజన్. ‘టిల్లు’ స్క్వేర్ తరువాత ఎన్ని సినిమాలు విడుదలైనా ఏఒక్క సినిమా వైపు జనం అడుగులు వేయలేదు.



దీనికితోడు ఎన్నికలు ఐపీయల్ సీజన్ అడ్డు పడటంతో ప్రేక్షకులు సినిమాలకు రావడం మర్చిపోయారు. దీనితో కలక్షన్స్ లేక కొన్ని రోజుల పాటు తెలంగాణాలో ధియేటర్లను మూసివేశారు అంటే పరిస్థితి ఎంత నిరాశాజనకంగా ఉందో అర్థం ఔతుంది. మే నెలాఖరున వచ్చిన ‘భజేవాయువేగం’ మూవీకి మంచి టాక్ రావడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ ఊపిరి పీల్చుకుంది.



అయితే ఆతరువాత వారం వచ్చిన ‘మ‌న‌మే’ ‘స‌త్య‌భామ‌’ ‘ల‌వ్ మౌళి’ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోవడంతో తిరిగి టాలీవుడ్ ఇండస్ట్రీకి డల్ పీరియడ్ కొనసాగింది. కొన ఊపిరితో ఉన్న బాక్స్ ఆఫీస్ కు గత వారం విడులైన విజయ్ సేతుపతి ‘మహారాజ’ మూవీకి విమర్శకుల ప్రశంసలతో పాటు సగటు ప్రేక్షకుడి ఆదరణ కూడ లభించడంతో ఈమూవీ డబ్బింగ్ సినిమా అయినప్పటికీ జనం బాగా చూడటంతో కలక్షన్స్ బాగా వస్తున్నాయి.



ఇక వరస ఫ్లాప్ లతో సత్యమతమైపోతున్న సుధీర్ బాబు కోరుకున్న హిట్ అతడి లేటెస్ట్ మూవీ ‘హ‌రోం హ‌ర’ ఇచ్చింది. ఈమూవీని చూసిన వారు ‘కేజీ ఎఫ్‌’ ‘పుష్ప’ ఛాయలు ఈమూవీ పై కనిపిస్తున్నాయి అంటూ కామెంట్స్ చేసినప్పటికీ కలక్షన్స్ బాగానే ఉండటంతో ఇండస్ట్రీ వర్గాలు తెరిపిన పడ్డాయి. ఒక మామూలు రివెంజ్ డ్రామా స్టోరీని దర్శకుడు డిఫరెంట్ గా చూపెట్టడంతో ‘మహారాజ’ మూవీ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈసినిమాలతో పోటీగా విడుదలైన అజయ్ ఘోష్  మ్యూజిక్ షాప్ మూర్తి కూడా మంచి టాక్ రావడంతో ముగిసి పోతున్న సమ్మర్ సీజన్ ఊహించని ఫినిషింగ్ టచ్ ఇచ్చింది అనుకోవాలి..  


 










మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>