PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amarnath-reddy9243be02-e2df-4c43-8de5-20891cb6a1b4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/amarnath-reddy9243be02-e2df-4c43-8de5-20891cb6a1b4-415x250-IndiaHerald.jpgఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రిగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. 1999 ఉపఎన్నిక, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన అమర్నాథ్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. amarnath reddy{#}Agri;Chittoor;palamaner;Amarnath Cave Temple;రాజీనామా;District;CBN;News;Party;Hanu Raghavapudi;Minister;YCPఆ లెక్కల వల్లే అమర్నాథ్ కు నో ఛాన్స్ .. మంత్రి పదవి కోరిక నెరవేరలేదుగా!ఆ లెక్కల వల్లే అమర్నాథ్ కు నో ఛాన్స్ .. మంత్రి పదవి కోరిక నెరవేరలేదుగా!amarnath reddy{#}Agri;Chittoor;palamaner;Amarnath Cave Temple;రాజీనామా;District;CBN;News;Party;Hanu Raghavapudi;Minister;YCPMon, 17 Jun 2024 10:33:00 GMTఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గతంలో అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర పరిశ్రమలు, ఆహార శుద్ధి, అగ్రి బిజినెస్‌, కామర్స్‌, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖల మంత్రిగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. 1999 ఉపఎన్నిక, 2004, 2009, 2014 ఎన్నికల్లో గెలిచిన అమర్నాథ్ రెడ్డి 2019 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు.
 
2012 సంవత్సరంలో అమర్నాథ్ రెడ్డి టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరి 2014లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి 2016లో మళ్లీ టీడీపీలో చేరి మంత్రి పదవిని దక్కించుకున్నారు. అయితే చంద్రబాబు నాయుడు సొంత జిల్లాకు మొండిచెయ్యి చూపించడానికి అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడానికి ముఖ్యమైన కారణాలే ఉన్నాయని సమాచారం అందుతోంది. ఈ జిల్లా నుంచి నల్లారి కిషోర్ కూడా మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు.
 
అమర్నాథ్ రెడ్డి, కిషోర్ లలో ఎవరికి పదవి ఇచ్చినా మరొకరు ఫీలవుతారని చంద్రబాబు ఫీలయ్యారని తెలుస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి 12 స్థానాల్లో విజయం సాధించగా చంద్రబాబు ఉమ్మడి చిత్తూరులో పట్టు మరింత పెంచుకోవాలనే ఆలోచనతో ఎవరికీ ఛాన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. గతంలో అమర్నాథ్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చినా 2019లో చిత్తూరులో టీడీపీకి ఆశించిన ఫలితాలు రాకపోవడం కూడా ఆయనకు మైనస్ అయిందని తెలుస్తోంది.
 
ఈసారి కేబినేట్ లో మంత్రి పదవి రాని వాళ్లకు ఎక్కువగా ఛాన్స్ ఇవ్వడం కూడా అమర్నాథ్ రెడ్డికి మైనస్ అయిందని సమాచారం అందుతోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా విషయంలో చంద్రబాబు లెక్కలు ఆయనకు ఉన్నాయని అందుకే జిల్లాలో ఎవరికీ మంత్రి పదవి ఇవ్వలేదని భోగట్టా. మంత్రి పదవుల విషయంలో ఉమ్మడి చిత్తూరుకు ప్రాధాన్యత దక్కకపోవడం పార్టీ క్యాడర్ ను సైతం ఒకింత బాధ పెట్టిందని తెలుస్తోంది. మంత్రి పదవి దక్కకపోవడంతో కొందరు నేతలు బాబు ప్రమాణ స్వీకారానికి సైతం హాజరు కాలేదని పొలిటికల్ వర్గాల టాక్.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>