Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/maps29b79a7a-5d9d-4e4a-be4b-4581efbda99c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/maps29b79a7a-5d9d-4e4a-be4b-4581efbda99c-415x250-IndiaHerald.jpgనేటి రోజుల్లో మనిషి టెక్నాలజీ మీద ఎంత విపరీతంగా ఆధారపడిపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు కూడా తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవడం కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు కావాల్సినవన్నీ కూడా ఇంటి ముంగిటీకే వచ్చి వాలిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్నాడు మనిషి కొన్ని కొన్ని సార్లు ఇక ఇలా టెక్నాలజీ మీద అతిగా డిపెండ్ అయిపోతున్నాడు. ఇMaps{#}Huzur Nagar;Smart phone;Google;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;Acerగూగుల్ మ్యాప్స్ నేను నమ్మితే.. చివరికి జీవితమే నా సమయం?గూగుల్ మ్యాప్స్ నేను నమ్మితే.. చివరికి జీవితమే నా సమయం?Maps{#}Huzur Nagar;Smart phone;Google;TECHNOLOGY;Samsung;Apple;Huawei;Nokia;Sony;LG;HTC;Motorola;Redmi;Dell;HP;Asus;AcerMon, 17 Jun 2024 20:50:00 GMTనేటి రోజుల్లో మనిషి టెక్నాలజీ మీద ఎంత విపరీతంగా ఆధారపడిపోతున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా పెరిగిపోయిన టెక్నాలజీ మనిషి జీవనశైలిలో ఎన్నో మార్పులు కూడా తీసుకువచ్చింది. ఇక ఇప్పుడు ఏది కావాలన్నా ఎక్కడికో వెళ్లి తెచ్చుకోవడం కాదు అరచేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్ లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు కావాల్సినవన్నీ కూడా ఇంటి ముంగిటీకే వచ్చి వాలిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.


 దీంతో ఇక టెక్నాలజీకి బాగా అలవాటు పడిపోతున్నాడు మనిషి  కొన్ని కొన్ని సార్లు ఇక ఇలా టెక్నాలజీ మీద అతిగా డిపెండ్ అయిపోతున్నాడు. ఇదే కొన్ని కొన్ని సార్లు చివరికి ఎన్నో అనర్ధాలకు కారణం అవుతూ ఉంది. సాధారణంగా ఒకప్పుడు ఎవరైనా తెలియని ప్రాంతాలకు వెళ్లాలి అంటే.. ఇక రోడ్డు పక్కన ఉన్న మనుషులని దారి అడుగుతూ వెళ్లేవారు. కానీ ఇప్పుడు ఆ అవసరమే లేకుండా పోయింది. ఎందుకంటే మొబైల్ లో గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకుంటే చాలు ఇక గమ్యస్థానాన్ని ఎలా చేరుకోవచ్చు అనే రూట్ ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే ఎంతోమంది ఈ గూగుల్ మ్యాప్ ని నమ్ముకునే తమ ప్రయాణాలను సాగిస్తూ ఉంటారు.


 కానీ గూగుల్ మ్యాప్ ని అతిగా నమ్ముకుంటే మాత్రం చివరికి అనర్థం తప్పదు అన్న విషయం ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన ఎన్నో ఘటనల ద్వారా అర్థమైంది  ఇక ఇప్పుడు ఇలాంటి తరహా ఘటన వెలుగు చూసింది. మహారాష్ట్రలోని సమర్ధ నగర్ లో ఉన్న స్వామి వివేకానంద కాలేజీలో యుపిఎస్సి ఎగ్జామ్స్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. అయితే ఆ సెంటర్ వడగవ్ కోహ్లాటీ లో ఉన్నట్లు గూగుల్ మ్యాప్స్ చూపించింది. దీంతో ఎంతోమంది ఎగ్జామ్ రాసేవాళ్ళు మ్యాప్స్ పై ఆధారపడ్డారు. దీంతో 50 మందికి పైగా అభ్యర్థులు మొదట పడగవు కోహ్లాటికీ వెళ్లారు  తప్పుడు సెంటర్ కి వచ్చామని గ్రహించి మళ్లీ సమర్ధ నగర్ కు చేరుకునే సమయానికి చివరికి అప్పటికే టైం అయిపోయింది. దీంతో వారంతా చివరికి పరీక్షకు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>