PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-tdp-ycp-cm-chandrababu-ycp-c9559bd2-6008-4a69-9378-e6a47c1730ab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan-pawan-tdp-ycp-cm-chandrababu-ycp-c9559bd2-6008-4a69-9378-e6a47c1730ab-415x250-IndiaHerald.jpgమన పూర్వకాలంలో పెద్దవారు కొన్ని సామెతలు ఊరికే చెప్పలేదు. వారికి ఎంతో అనుభవం ఉండే ఇలాంటి సామెతలు చెబుతూ ఉండేవారు. ఆ సామెతలు ప్రస్తుత కాలంలో కొంతమందికి పక్కాగా సెట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. 2019 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆయన ఇచ్చిన పథకాలను చాలావరకు అమలు చేశారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే తీవ్రంగా విఫలమయ్యారని చెప్పవచ్చు.jagan;pawan;tdp;ycp;cm chandrababu;ycp;{#}Hanu Raghavapudi;Congress;media;Reddy;Andhra Pradesh;Bharatiya Janata Party;Jagan;CBN;TDP;YCPఅది పనికిరాదు జగన్..నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.!అది పనికిరాదు జగన్..నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుంది.!jagan;pawan;tdp;ycp;cm chandrababu;ycp;{#}Hanu Raghavapudi;Congress;media;Reddy;Andhra Pradesh;Bharatiya Janata Party;Jagan;CBN;TDP;YCPSun, 16 Jun 2024 08:34:57 GMT మన పూర్వకాలంలో పెద్దవారు కొన్ని సామెతలు ఊరికే చెప్పలేదు. వారికి ఎంతో అనుభవం  ఉండే ఇలాంటి సామెతలు చెబుతూ ఉండేవారు. ఆ సామెతలు ప్రస్తుత కాలంలో కొంతమందికి పక్కాగా సెట్ అవుతూ ఉంటాయి. అలాంటి వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.  2019 ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ కు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు. ఆయన ఇచ్చిన పథకాలను చాలావరకు అమలు చేశారు. కానీ ఆ ఒక్క విషయంలో మాత్రమే  తీవ్రంగా విఫలమయ్యారని చెప్పవచ్చు. 

ఎదుటి పార్టీని ప్రతిపక్ష నేతలను  రాజకీయంగా కాకుండా  కుటుంబ పరంగా సొంతంగా విమర్శించడం మొదలుపెట్టారు.  ఇక వారికి రాజకీయంలో ఎదురులేదు అనుకున్నారు. మరోసారి మా జగనన్న గెలుస్తాడని  ఎంతో సీనియారిటీ ఉన్నటువంటి టిడిపి నాయకులను  తీవ్రంగా విమర్శించారు కించపరిచారు. ఇక టిడిపి నాయకులు దాన్ని ఎంతో సహనంగా, ఓపిక పట్టి  గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నం చేశారు. అంతేకాకుండా నాయకుల యొక్క  మాటల తీరును క్యారెక్టర్ ను చెబుతా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. ఇలాంటి నాయకులు మనల్ని పాలిస్తే మన పరిస్థితి రాను రాను ఏమవుతుందో అని ప్రజలకు వివరించారు. ముఖ్యంగా మనకు జగన్ వల్ల ప్రమాదం అంటూ వారు చెబుతూ వచ్చారు. ఇదే సమయంలో జనసేన,టిడిపి, బిజెపి మూడు పార్టీలు కూటమి గా ఏర్పడ్డాయి.

దీనికి తోడు మెయిన్ మీడియా సోషల్ మీడియా ఇతర మీడియాలు అన్నీ కలిపి జగన్ పై ఎత్తిచూపడం  ప్రారంభించాయి. అయినా జగన్, కిందిస్థాయి వర్గనేతలంతా రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం ఆపలేదు. ఈ విధంగా జగన్ ఓటమికి కీలకంగా వారే కారణమయ్యారు. దీనివల్ల ప్రజలకు అభద్రతా భావం ఏర్పడి  టిడిపి కూటమికి ఓట్లు వేశారు.  2014 ఎన్నికల తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా వారు ఇలాగే చేశారు. ఆ టైంలో ప్రజలు అభద్రతాభావం లోకి వెళ్లి వైసీపీని గెలిపించారు. వైసిపి వాళ్ళు కూడా ఈ విధంగానే చేయడంతో మళ్ళీ కూటమికి అధికారాన్ని అందించారు. దీన్నిబట్టి చూస్తే మాత్రం నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత వైసిపి వారికి బాగా సెట్ అయిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>