PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh74cd4394-23d6-4a6e-a611-66091431bb5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/nara-lokesh74cd4394-23d6-4a6e-a611-66091431bb5c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో.... పాలనలో దూసుకువెళుతోంది. ఐదు సంవత్సరాల వైసిపి పరిపాలన భూస్థాపితం చేసిన తెలుగుదేశం కూటమి... ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 24 మందికి మంత్రి పదవులు ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం... శాఖలను కూడా డివైడ్ చేసింది. ఇక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను తవ్వుతున్నారు. nara lokesh{#}Telugu Desam Party;Nara Lokesh;Reddy;Government;Minister;YCPజగన్‌ పై రివేంజ్‌ కు పెద్ద స్కెచ్‌ వేసిన లోకేష్‌ ?జగన్‌ పై రివేంజ్‌ కు పెద్ద స్కెచ్‌ వేసిన లోకేష్‌ ?nara lokesh{#}Telugu Desam Party;Nara Lokesh;Reddy;Government;Minister;YCPSun, 16 Jun 2024 08:06:18 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన నేపథ్యంలో.... పాలనలో దూసుకువెళుతోంది. ఐదు సంవత్సరాల వైసిపి పరిపాలన భూస్థాపితం చేసిన తెలుగుదేశం కూటమి... ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 24 మందికి మంత్రి పదవులు ఇచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం... శాఖలను కూడా డివైడ్ చేసింది. ఇక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్... జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ తప్పిదాలను తవ్వుతున్నారు.


వైసిపి పాలనలో జరిగిన అవకతవకలను... వెలికితీస్తున్నారు నారా లోకేష్. ముఖ్యంగా విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పెట్టిన పెండింగ్ లను  క్లియర్ చేసే పనిలో పడ్డారు నారా లోకేష్. తాజాగా విద్యాశాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించిన నారా లోకేష్... అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థి దీవన మరియు వసతి దీవెన బకాయిలను కూడా చెల్లించేందుకు... నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు.


వైసిపి ప్రభుత్వం ఇంటర్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు అలాగే నోట్ బుక్ లు ఇవ్వకపోవడంపై ఫైర్ అయ్యారు నారా లోకేష్. గత తెలుగుదేశం ప్రభుత్వంలో కొనుగోలు చేసిన సైకిళ్లను విద్యార్థులకు ఇవ్వకుండా మూలన పడేసిందని నిప్పులు జరిగారు. ఇకనుంచి గతంలో లాగా కాకుండా.. ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా ఉంటాయని తెలిపారు. నోట్ బుక్స్, పాఠ్యపుస్తకాలు జూలై 15వ తేదీ లోపు విద్యార్థులందరికీ అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు.


అలాగే విద్యార్థులకు ఇవ్వాల్సిన కిట్టులు... ఈ నెల చివర్లో కల్లా పూర్తి చేయాలని తెలిపారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్బి వినియోగం మీద... పూర్తి సమాచారాన్ని తనకు ఇవ్వాలని వెల్లడించారు. వైసిపి పాలనలో ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి... ఎంతమంది టీచర్లు ఉన్నారు... ఇన్ని భర్తీలు జరిగాయి... అనేదానిపై పూర్తి వివరాలు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు నారా లోకేష్. ఇలా గత ప్రభుత్వం చేసిన అవకతవకలను వెలికి తీస్తున్నారు నారా లోకేష్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>