EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/childrena430829a-5a91-42a8-9ecb-2445481d411e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/childrena430829a-5a91-42a8-9ecb-2445481d411e-415x250-IndiaHerald.jpgపెళ్లిళ్లే లేటుగా అవుతున్నాయి. గతంలో జీవితంలో ఒక్కరూ సెటిల్ అయినా వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ స్థిరపడితేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నచ్చిన వరుడి కోసమో.. అమ్మాయి కోసమో అంటూ దేశంలో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. 30 ఏళ్లు వచ్చే వరకు నేటి యువతరం పెళ్లిళ్లు చేసుకోవడం లేదు. ఆ తర్వాత పెళ్లి చేసుకునే సమయానికి వీరిలో పిల్లల్నీ కనే సామర్థ్యం తగ్గిపోతుంది. చివరకు మందులు వాడకం, అశాస్త్రీయ పద్ధతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభాchildren{#}Yuva;Shakti;Population;Girl;marriage;Indianదక్షిణ భారతం.. పిల్లలను కనడం తగ్గించేసిందా?దక్షిణ భారతం.. పిల్లలను కనడం తగ్గించేసిందా?children{#}Yuva;Shakti;Population;Girl;marriage;IndianSun, 16 Jun 2024 11:00:00 GMTపెళ్లిళ్లే లేటుగా అవుతున్నాయి. గతంలో జీవితంలో ఒక్కరూ సెటిల్ అయినా వివాహం చేసుకునేవారు. కానీ ఇప్పుడు అమ్మాయి, అబ్బాయి ఇద్దరూ స్థిరపడితేనే పెళ్లికి అంగీకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నచ్చిన వరుడి కోసమో.. అమ్మాయి కోసమో అంటూ దేశంలో వివాహాలు ఆలస్యం అవుతున్నాయి. 30 ఏళ్లు వచ్చే వరకు నేటి యువతరం పెళ్లిళ్లు చేసుకోవడం లేదు.


ఆ తర్వాత పెళ్లి చేసుకునే సమయానికి వీరిలో పిల్లల్నీ కనే సామర్థ్యం తగ్గిపోతుంది. చివరకు మందులు వాడకం, అశాస్త్రీయ పద్ధతులపై ఆధారపడాల్సి వస్తోంది. ఈ క్రమంలో దక్షిణాది రాష్ట్రాల్లో యువ జనాభా తగ్గడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశ ఆర్థికాభివృద్ధిలో కీలకమైన యువ జనాభా రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని ఓ నివేదిక పేర్కొంది. ఇప్పటి వరకు విద్యావంతులు, చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న భారత్.. భవిష్యత్తులో డిమాండ్ కు తగినంత యువ కార్మిక బలగం అందుబాటులో ఉండదని హెచ్చరికలు జారీ చేసింది.


దక్షిణాధి రాష్ట్రాల్లో 15-29 ఏళ్లలోపు యువ జనాభా అంతకంతకూ క్షీణిస్తోంది. ఇదే సమయంలో వృద్ధుల జనాభా గణనీయంగా పెరుగుతోంది. ఈ విషయాన్ని ఇండియన్ ఎంప్లాయీమెంట్-2024 వెల్లడించింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో యువ శ్రామిక శక్తి డిమాండ్ పెరుగుతుంది అని అంచనా వేసింది. దీంతో దక్షిణాది రాష్ట్రాల్లో యువ శ్రామికుల కొరత ఏర్పడుతుందని వివరించింది.


ఉత్తర్ ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, బిహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల్లో యువ జనాభా స్థిరంగా ఉందని పేర్కొంది. ఈ మేరకు 2021 నుంచి 2036 వరకు ఉపాధి అవకాశాల స్థితి గతులపై నివేదికను వెలువరించింది. ఏపీలోని మొత్తం జనాభాలో 15-29 ఏళ్ల లోపు యువకులు 25.1 శాతం ఉంటే.. 2031 నాటికి యువ జనాభా 21 శాతానికి పడిపోతుందని…అదే 2036 నాటికి మొత్తం జనాభాలో యువ జనాభా కేవలం 19.6 శాతానికి తగ్గిపోతుందని తన నివేదికలో వెల్లడించింది. ఏపీలో యువ జనాభా 2021లో 3.6శాతంతో ఉంటే 2031లో 3.2 శాతం, 2036లో 3.1శాతానికి తగ్గిపోతుందని సంచలన విషయాన్నివెల్లడించింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>