MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yvs-chowdary711f9ac8-8ed5-4d5f-b9db-f7e8f5a1edab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/yvs-chowdary711f9ac8-8ed5-4d5f-b9db-f7e8f5a1edab-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వైవిఎస్ చౌదరి ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఏ మూవీ కూడా చేయలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆయన తన తదుపరి మూవీ కి సంబంధించిన వివరాలను వెల్లడించాడు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన వైవిఎసyvs chowdary{#}raghava lawrence;sai dharam tej;Love Story;Devadasu;Akkineni Nagarjuna;choudary actor;Chiranjeevi;Ileana D'Cruz;Box office;ram pothineni;Tollywood;Makar Sakranti;Darsakudu;January;Director;Cinemaచిరు.. నాగ్ వల్ల నా సినిమాకు జనాలు లేరు... వై.వి.ఎస్ చౌదరి..!చిరు.. నాగ్ వల్ల నా సినిమాకు జనాలు లేరు... వై.వి.ఎస్ చౌదరి..!yvs chowdary{#}raghava lawrence;sai dharam tej;Love Story;Devadasu;Akkineni Nagarjuna;choudary actor;Chiranjeevi;Ileana D'Cruz;Box office;ram pothineni;Tollywood;Makar Sakranti;Darsakudu;January;Director;CinemaSun, 16 Jun 2024 09:39:40 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి వైవిఎస్ చౌదరి ఆఖరుగా సాయి ధరమ్ తేజ్ హీరోగా రూపొందిన రేయ్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఈ మూవీ విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతోంది. ఇప్పటివరకు ఈ దర్శకుడు ఏ మూవీ కూడా చేయలేదు. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే ఆయన తన తదుపరి మూవీ కి సంబంధించిన వివరాలను వెల్లడించాడు.

ఆ కార్యక్రమంలో భాగంగా ఈయన వైవిఎస్ చౌదరి దర్శకత్వం వహించిన దేవదాసు సినిమా సమయంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి వివరించారు. తాజాగా ఈయన మాట్లాడుతూ ... నేను రామ్ హీరోగా ఇలియానా హీరోయిన్గా దేవదాసు సినిమాను చేశాను. ఆ సినిమా సమయంలో రామ్ కి ఎలాంటి క్రేజ్ లేదు. నేను ఆ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 11 వ తేదీన విడుదల చేశాను. సంక్రాంతి సీజన్ లో పెద్దగా లవ్ స్టోరీ సినిమాలను విడుదల చేయరు.

సంక్రాంతి సీజన్ అంతా ఫ్యామిలీ సినిమాలని జనాలు ఎక్కువ చూస్తుంటారు. అయినా నేను రిస్కు చేసి ఆ మూవీ ని విడుదల చేశాను. ఇక నా మూవీ జనవరి 11.వ తేదీన విడుదల అయితే ఆ తర్వాత రోజు అనగా జనవరి 12 వ తేదీనే లారెన్స్ హీరోగా రూపొందిన స్టైల్ సినిమా విడుదల అయింది. ఆ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి , టాలీవుడ్ కింగ్ నాగార్జున గెస్ట్ పాత్రలలో నటించారు. దానితో జనాలు అంత ఆ సినిమా వైపే వెళ్ళిపోయారు. నా సినిమా వైపు జనాలు రాలేదు. ఇక ఆ తర్వాత నాలుగు వారాలు పూర్తయ్యాక నా సినిమా మెల్లమెల్లగా పుంజుకొని మంచి విజయం అందుకుంది అని వైవిఎస్ చౌదరి తాజాగా చెప్పుకొచ్చాడు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>