MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghattamaneni-manjula4a14b05f-0d4c-4ebf-b2b3-570bec106e99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ghattamaneni-manjula4a14b05f-0d4c-4ebf-b2b3-570bec106e99-415x250-IndiaHerald.jpgతెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు విశేషమైన సేవలందించారు. చాలామంది సినిమా కార్మికులకు ఉపాధి కల్పించారు. ఇక ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సినిమా పరిశ్రమలో చాలా కాలంగా పనిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమె సినిమాల్లో యాక్టింగ్ కూడా చేశారు. ఉదాహరణకి ఆరంజ్. ఆమె సైతం మంచి నటి. నటన ఆమె రక్తంలోనే ఉందిGhattamaneni Manjula{#}gautham new;krishna;mahesh babu;manjula;Pokiri;gautham;sudheer babu;gold;Ram Charan Teja;Husband;Chiranjeevi;producer;Producer;Heroine;Cinemaఘట్టమనేని మంజుల కూతురు ఎంత అందంగా ఉందో.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్...ఘట్టమనేని మంజుల కూతురు ఎంత అందంగా ఉందో.. లేటెస్ట్ ఫోటోషూట్ వైరల్...Ghattamaneni Manjula{#}gautham new;krishna;mahesh babu;manjula;Pokiri;gautham;sudheer babu;gold;Ram Charan Teja;Husband;Chiranjeevi;producer;Producer;Heroine;CinemaSun, 16 Jun 2024 20:36:00 GMTతెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ ఫ్యామిలీకి ఎంత క్రేజ్ ఉందో సూపర్ స్టార్ కృష్ణ ఫ్యామిలీకి కూడా అంతే క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. ఘట్టమనేని కృష్ణ తెలుగు సినిమా పరిశ్రమకు విశేషమైన సేవలందించారు. చాలామంది సినిమా కార్మికులకు ఉపాధి కల్పించారు. ఇక ఆయన కుమారుడు మహేష్ బాబు కూడా సినిమా పరిశ్రమలో చాలా కాలంగా పనిచేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. మహేష్ బాబు అక్క మంజుల ఘట్టమనేని కూడా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. ఆమె సినిమాల్లో యాక్టింగ్ కూడా చేశారు. ఉదాహరణకి ఆరంజ్. ఆమె సైతం మంచి నటి. నటన ఆమె రక్తంలోనే ఉంది.

మంజుల భర్త సంజయ్ స్వరూప్ కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తూ ఎంటర్‌టైన్‌ చేస్తున్నారు. కృష్ణ ఫ్యామిలీ నుంచి మరో జనరేషన్ కూడా మూవీ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి సిద్ధమైంది. మహేష్ కుమారుడు గౌతమ్ ఆల్రెడీ చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిచయమయ్యాడు. త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక సుధీర్ బాబు సైతం హీరోగా  అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ నెక్స్ట్ జనరేషన్ హీరోల ఫొటోలు చాలా హైలెట్ కూడా అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం మహేష్ బాబు అక్క మంజుల ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అందులో మంజుల కూతురు, మహేష్ మేనకోడలు జాహ్నవి స్వరూప్ కనిపించింది ఆమె చాలా అందంగా ఉంది. చిన్నప్పుడు ఎప్పుడో ఆమె ఫోటోలు బయటికి వచ్చాయి మళ్లీ ఇప్పుడు ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జాహ్నవిని చూసి ఆమె చాలా అందంగా ఉందని, అచ్చం హీరోయిన్ లానే కనిపిస్తోందని కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. పేరెంట్స్‌తో కలిసి ట్రెడిషనల్ వేర్ లో జాహ్నవి దర్శనం ఇచ్చింది ఆమె అందాలని చూసి బంగారం అంటూ చాలామంది కామెంట్ చేస్తున్నారు. మెన కోడళ్లు, మేనల్లుళ్లతో కలిస్తే మహేష్ చిన్న పిల్లాడిలా మారిపోతారట. వారితో కలిసి బాగా ఆడుకుంటాడట. ఇకపోతే మంజుల, ఆమె భర్త ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్క, బావగా కనిపించారు. మంజుల కొన్ని సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేశారు. పోకిరి సినిమాకు కో ప్రొడ్యూసర్ గా పని చేశారు. వ్యాపార రంగంలోనూ ఆమె రాణిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>