PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan277f10ed-368b-4b7b-9559-c5da29257df0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan277f10ed-368b-4b7b-9559-c5da29257df0-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి... ఇప్పుడు వైసిపి పై ప్రతి కారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వ తప్పిదాలను తెరపైకి తీసుకువస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలోనే తాజాగా ఫర్నిచర్ అంశాన్ని తెలుగుదేశం పార్టీ.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ ను ఉద్దేశిస్తూ వివాదాస్పద పోస్ట్ పెట్టింది. jagan{#}Red chilly powder;politics;Government;Reddy;Telangana Chief Minister;Yevaru;Telugu Desam Party;YCP;Jagan;TDPజగన్‌ : ఏపీలో ఫర్నిచర్ పాలిటిక్స్‌...టీడీపీ రివేంజ్‌ అదుర్స్‌?జగన్‌ : ఏపీలో ఫర్నిచర్ పాలిటిక్స్‌...టీడీపీ రివేంజ్‌ అదుర్స్‌?jagan{#}Red chilly powder;politics;Government;Reddy;Telangana Chief Minister;Yevaru;Telugu Desam Party;YCP;Jagan;TDPSun, 16 Jun 2024 10:05:53 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత  రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. గత ఐదు సంవత్సరాల వైసిపి పాలనలో.. అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టిడిపి... ఇప్పుడు వైసిపి పై ప్రతి కారం తీర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి విషయంలోనూ వైసీపీ ప్రభుత్వ  తప్పిదాలను తెరపైకి తీసుకువస్తుంది కూటమి ప్రభుత్వం. ఈ తరుణంలోనే తాజాగా ఫర్నిచర్ అంశాన్ని  తెలుగుదేశం పార్టీ.మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్  ను ఉద్దేశిస్తూ వివాదాస్పద పోస్ట్ పెట్టింది. 


జగన్మోహన్ రెడ్డి క్యాంప్ ఆఫీసులో ఉన్న ఫర్నిచర్.. ప్రభుత్వానికి అంటూ... మండిపడింది టిడిపి. అధికారంలో ఉన్నప్పుడు... సచివాలయ ఫర్నిచర్ తో.. తన ఆఫీసును పూర్తిగా నింపేసుకున్నాడని...  ఆ ఫర్నిచర్ వెనక్కి ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ... టిడిపి కొత్త అంశానికి తెరలేపింది. జగన్మోహన్ రెడ్డి ఉన్న ఇంటికి అల్యూమినియం విండోస్, డోర్స్, ఇతర సామాగ్రికి 73 లక్షలు ఖర్చు చేశారని ఆరోపణలు చేసింది. అలాగే ఇంటి రెయిన్ ప్రూఫ్ కోసం... మొబైల్ టాయిలెట్స్  అవసరాల కోసం 23 లక్షలు వినియోగించారని.. టిడిపి ఆరోపణలు చేసింది. 


సచివాలయానికి సంబంధించిన 40 లక్షల ఫర్నిచర్ ను... జగన్ దొంగిలించాడని... ఆ సంచలన ఆరోపణలు చేస్తూ టిడిపి పోస్ట్ పెట్టింది. అయితే తెలుగుదేశం పార్టీ పెట్టిన పోస్ట్ కు అదే స్థాయిలో వైసిపి కూడా కౌంటర్ ఇచ్చింది. అధికారం చేపట్టాక కూటమి ప్రవర్తన, వారు వ్యవహరిస్తున్న తీరు రోజురోజుగా దిగజారుతోందని...జగన్‌ నే లక్ష్యంగా చేసుకుని వ్యక్తిత్వ హనానికి పాల్పడ్డం ఒక అలవాటుగా టీడీపీ మార్చుకుందని ఆగ్రహించారు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి.
 

నిస్సిగ్గుగా, నీతిమాలిన రాజకీయం చేస్తూ తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని....ముఖ్యమంత్రి హోదాలో జగన్‌  క్యాంపు కార్యాలయంలో పరిపాలనకు అవసరమైన సౌకర్యాలను గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని క్లారిటీ ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఉన్నా.. వారి క్యాంపు కార్యాలయాలకు తగిన సౌకర్యాలు ఏర్పాటు చేయడం సర్వసాధారణ విషయం అన్నారు. ఇందులో భాగంగానే  జగన్‌ క్యాంపు కార్యాలయంలో కూడా ఏర్పాటు చేశారన్నారు వైయస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి. ప్రభుత్వం మారాక ఏయే వస్తువులను క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారో జాబితాను అధికారులకు ఇప్పటికే సమర్పించడం జరిగిందని అని వెల్లడించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>