MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/saripoda-sanivaaram-first-song-is-impressing2a2c36f9-37f2-4ae0-b56d-ace8c037a5e2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/saripoda-sanivaaram-first-song-is-impressing2a2c36f9-37f2-4ae0-b56d-ace8c037a5e2-415x250-IndiaHerald.jpgసరిపోదా శనివారం: నాని ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తున్న గరంగరం సాంగ్?టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్‌కు కేవలం రెండు నెలలు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి 'గరం గరం' టైటిల్ ట్రాక్ విడుదలైంది. ఈ ఫస్ట్ సింగిల్ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో చెబుతోంది.గరంగరంగా కోపోద్రిక్తుడిగా ఉండే యువకుడి (నాని) కథ ఇదని ఈ పాటలో అర్థమవుతోంది. అతడు శివమెత్తే శివుడిలా చెలరేగిపోతాడని సినిమా ఆద్యNani{#}atreya;Sangeetha;Singer;Athadu;Nani;surya sivakumar;Posters;Saturday;Mass;priyanka;Darsakudu;Director;Tamil;Hero;Cinemaసరిపోదా శనివారం: ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తున్న గరంగరం సాంగ్?సరిపోదా శనివారం: ఫ్యాన్స్ ని పిచ్చెక్కిస్తున్న గరంగరం సాంగ్?Nani{#}atreya;Sangeetha;Singer;Athadu;Nani;surya sivakumar;Posters;Saturday;Mass;priyanka;Darsakudu;Director;Tamil;Hero;CinemaSun, 16 Jun 2024 16:21:21 GMTటాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నానీ హీరోగా తెరకెక్కుతున్న 'సరిపోదా శనివారం' మూవీ త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా రిలీజ్‌కు కేవలం రెండు నెలలు మాత్రమే ఉండటంతో మేకర్స్ ప్రచారంలో స్పీడ్ పెంచారు. తాజాగా ఈ మూవీ నుంచి 'గరం గరం' టైటిల్ ట్రాక్ విడుదలైంది. ఈ ఫస్ట్ సింగిల్ ఈ మూవీ కాన్సెప్ట్ ఏంటో చెబుతోంది.గరంగరంగా కోపోద్రిక్తుడిగా ఉండే యువకుడి (నాని) కథ ఇదని ఈ పాటలో అర్థమవుతోంది. అతడు శివమెత్తే శివుడిలా చెలరేగిపోతాడని సినిమా ఆద్యంతం యాక్షన్ కి కొదవేమీ ఉండదని తాజాగా రిలీజైన గరం గరం పాట చెబుతోంది. నాని లాంటి అద్భుతమైన నటనా నైపుణ్యం ఉన్న స్టార్ కి ఒక మాస్ పాత్ర పడితే ఎలా ఉంటుందో ఈ మూవీతో ఖచ్చితంగా తెలిసొస్తుందనే భరోసా కూడా ఈ పాటలో కనిపిస్తోంది. నానిని మాస్ కమర్షియల్ అవతార్‌లో ప్రెజెంట్ చేస్తున్న సరిపోదా శనివారం మూవీ ప్రచారం సరి కొత్తగా ఉంది. ఇప్పటి దాకా విడుదలైన గ్లింప్స్ పోస్టర్లు హీరో సాధారణ పాత్రలకు దూరంగా మాస్ అప్పీల్‌తో నిండిన పాత్రలో నటిస్తున్నాడని సూచిస్తున్నాయి.


ఈ గరం గరం పాటలో నాని పాత్ర సూర్య థ్రిల్లింగ్ యాక్షన్ తో రక్తి కట్టిస్తుందని అర్థమవుతోంది.'గరం గరం' పాట సూర్యలో స్పీడ్‌ని, పాత్ర తీరుతెన్నులను నిర్వచించింది. సాహిత్యం ఎంతో ఆకట్టుకుంటోంది. అలాగే సంగీత దర్శకుడు J ఏకేస్ బిజోయ్ రాకింగ్ మ్యూజిక్ కూడా ఎంతగానో ఆకర్షిస్తోంది. గాయకుడు విశాల్ దద్లానీని లోని జోష్‌ని ఉపయోగించుకుంటూ బిజోయ్ 'గరం గరం' పాటని సరికొత్త స్థాయికి ఎలివేట్ చేశాడు. గరం గరం పాట నాని కెరీర్‌లో అరుదైన క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సాంగ్‌గా నిలుస్తుంది. ఈ అసాధారణ ఎంపికతో న్యాచురల్ స్టార్ అభిమానులు థ్రిల్లింగ్‌గా ఉన్నారని చెప్పాలి.వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన 'సరిపోదా శనివారం' మూవీలో ప్రియాంక మోహన్ హీరోయిన్. తమిళ నటుడు, దర్శకుడు SJ సూర్య ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలో నటించారు. ఈ మూవీ యాక్షన్ డ్రామా కథాంశంతో రక్తి కట్టించనుంది.ఈ సినిమాని ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటిగా నిలపడం కోసం నాని తనవంతు ప్రయత్నాల్లో ఉన్నాడు. సరిపోదా శనివారం సినిమా విడుదలకు సమయం దగ్గరపడడంతో నాని ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>