PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-sathyakumar-yadav-bjp-chadrababu-naidu-devadaya-shakha3bf86a3b-3270-43aa-91ec-22134eecdf36-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bjp-sathyakumar-yadav-bjp-chadrababu-naidu-devadaya-shakha3bf86a3b-3270-43aa-91ec-22134eecdf36-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసిపోయాయి. చివరికి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 164 నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి, జనసేనా అద్భుతమైన విజయ పరంపరా కొనసాగించింది. దీంతో టీడీపీ ఎదురులేని మనిషిలా అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. అంతేకాదు తన కింద 24 మంది మంత్రులను కూడా ఎంపిక చేసుకొని వారికి శాఖలను కేటాయించారు. ఇదంతా బాగానే నడిచిన జనం అనుకున్న విధంగా మాతBJP;SATHYAKUMAR YADAV;BJP;CHADRABABU NAIDU;DEVADAYA SHAKHA{#}satya;Doctor;Dharmavaram;Leader;Andhra Pradesh;kalyan;Elections;Assembly;CBN;Minister;Bharatiya Janata Party;TDPపట్టులేని శాఖ సత్యకుమార్ చెంత.. ఆ శాఖ అయితే న్యాయం చేసేవారెమో..?పట్టులేని శాఖ సత్యకుమార్ చెంత.. ఆ శాఖ అయితే న్యాయం చేసేవారెమో..?BJP;SATHYAKUMAR YADAV;BJP;CHADRABABU NAIDU;DEVADAYA SHAKHA{#}satya;Doctor;Dharmavaram;Leader;Andhra Pradesh;kalyan;Elections;Assembly;CBN;Minister;Bharatiya Janata Party;TDPSat, 15 Jun 2024 08:47:50 GMT- దైవభక్తి ఉన్న ఎమ్మెల్యేకు ఆరోగ్యశాఖ..
- దేవాదాయ అయితే బాగా సూట్ అయ్యేదేమో..

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  ఎన్నికలు ముగిసిపోయాయి. చివరికి టిడిపి కూటమి అధికారంలోకి వచ్చింది. మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను  164 నియోజకవర్గాల్లో టిడిపి, బిజెపి, జనసేనా అద్భుతమైన విజయ పరంపరా కొనసాగించింది. దీంతో టీడీపీ ఎదురులేని  మనిషిలా అసెంబ్లీలో అడుగు పెట్టింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగవసారి ముఖ్యమంత్రిగా  చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కూడా చేసేసారు. అంతేకాదు తన కింద 24 మంది మంత్రులను కూడా   ఎంపిక చేసుకొని వారికి శాఖలను కేటాయించారు. ఇదంతా బాగానే నడిచిన  జనం అనుకున్న విధంగా మాత్రం ఎమ్మెల్యేలకు  సెట్ అయ్యే శాఖలను  కేటాయించలేదు అనే ఒక టాక్ వినిపిస్తోంది.

 అంతేకాదు ఈ శాఖల కేటాయింపులో  సామాజిక, ఆర్థిక, కుల, మత గణన ఆధారంగా  చేసినట్టు తెలుస్తోంది. ఈసారి యూత్ కు మరియు కొత్తవారికి ఎక్కువగా అవకాశం ఇచ్చారు. కానీ శాఖల కేటాయింపులోనే కాస్త రాంగ్ స్టెప్ వేశారని తెలుస్తోంది. కీలకమైన శాఖలను  పవన్ కళ్యాణ్ కు కూడా ఇవ్వలేదు. దీన్నిబట్టి చూస్తే మాత్రం చంద్రబాబు నాయుడు కావాలనే వీరిని పక్కన పెట్టారా లేదంటే  అనుకోకుండానే వారికి శాఖలు కేటాయించారా అనేది అర్థం కావడం లేదు.  ఇందులో ఎమ్మెల్యేగా గెలిచిన వారిలో చాలామంది డాక్టర్ చదివిన వారు ఉన్నారు.. అలాంటి అనుభవం ఉన్నవారికి తప్పనిసరిగా  ఆరోగ్యశాఖ కేటాయిస్తే మరింత న్యాయం చేయగలరు. కానీ ఆ స్ట్రాటజీ ఫాలో అవ్వకుండా కన్ఫ్యూజన్ చేసేసారు చంద్రబాబు నాయుడు. బిజెపి నుంచి కూడా ఒకరికి మంత్రి పదవి కట్టబెట్టారు.

ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ధర్మవరం ఎమ్మెల్యే సత్య కుమార్ యాదవ్. ఈయన బిజెపిలో కీలక లీడర్ గా ఉన్నారు. అలాంటి ఈయనకు  దేవాదాయ శాఖ కేటాయిస్తే బాగుండేదని కొంతమంది అంటున్నారు. ఈ శాఖ అయితే బిజెపి వాళ్లకు బాగా సెట్ అవుతుందని, కానీ ఎలాంటి అనుభవం లేనటువంటి ఆరోగ్యశాఖ, కుటుంబ సంక్షేమ శాఖను సత్యకుమార్ యాదవ్ కు కేటాయించారు.  దీంతో చాలా మంది సీనియర్లు  చంద్రబాబు నాయుడు కావాలనే ఇలా వీరికి కన్ఫ్యూజ్ చేస్తూ శాఖల కేటాయించారా లేదంటే ఆ శాఖలో వారు సమర్థవంతంగా పనిచేయలేరు అనే మైనస్ తీసుకురావడానికి కేటాయించారా అనేది అస్సలు అర్థం కావడం లేదు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>