Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv0fdcdc1c-fd56-4a0a-8f13-f5dff15534d7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rgv0fdcdc1c-fd56-4a0a-8f13-f5dff15534d7-415x250-IndiaHerald.jpgడైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే రాజమౌళి సరికొత్తగా సినిమాలను తీస్తున్నారు అని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇక టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ మైంటైన్ చేశాడు రాంగోపాల్ వర్మ. అందరిలా కాకుండా సరికొత్తగా సినిమాలను తీసి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో ఆయనను మించిన డైరెక్టర్ మరొకరు ఉండేవారు కాదు. సరికొత్త టెక్నాలజీని సినిమాల కోసం వాడుతూ ఇక టాలీవుడ్ లో గ్రేటెస్ట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు ఆయన. బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో అప్పట్లోనే నిరూRgv{#}Rajamouli;Ram Gopal Varma;bollywood;Andhra Pradesh;CBN;TDP;ram pothineni;Director;Tollywood;Cinemaఇక అలాంటి సినిమాలు చేయను.. మరోసారి నొక్కి చెప్పిన ఆర్జీవి?ఇక అలాంటి సినిమాలు చేయను.. మరోసారి నొక్కి చెప్పిన ఆర్జీవి?Rgv{#}Rajamouli;Ram Gopal Varma;bollywood;Andhra Pradesh;CBN;TDP;ram pothineni;Director;Tollywood;CinemaSat, 15 Jun 2024 16:52:00 GMTడైరెక్టర్ రాంగోపాల్ వర్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇప్పుడంటే రాజమౌళి సరికొత్తగా సినిమాలను తీస్తున్నారు అని అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే ఒకప్పుడు ఇక టాలీవుడ్ లో రాజమౌళి రేంజ్ మైంటైన్ చేశాడు రాంగోపాల్ వర్మ. అందరిలా కాకుండా సరికొత్తగా సినిమాలను తీసి బ్లాక్ బస్టర్లు కొట్టడంలో ఆయనను మించిన డైరెక్టర్ మరొకరు ఉండేవారు కాదు. సరికొత్త టెక్నాలజీని సినిమాల కోసం వాడుతూ ఇక టాలీవుడ్ లో గ్రేటెస్ట్ డైరెక్టర్గా పేరు సంపాదించుకున్నారు ఆయన. బాలీవుడ్ లో కూడా తన సత్తా ఏంటో అప్పట్లోనే నిరూపించుకున్నాడు.


 అలాంటి రాంగోపాల్ వర్మ ఇప్పుడు తీసే సినిమాలు చూస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. ఎందుకంటే ఒకప్పుడు అద్భుతమైన సినిమాలు తీసి ఇక ఎంతో మంది డైరెక్టర్లను సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసిన రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మాత్రం ఏకంగా రాజకీయ కక్షలతో కూడిన సినిమాలను తీయడంలో బిజీ అయిపోయారు అన్న విషయం తెలిసిందే. మరి ముఖ్యంగా వైసిపికి అనుకూలంగా టిడిపిని టార్గెట్ చేస్తూ ఆయన తీసిన సినిమాలు ఏపీ రాజకీయాలలో ఎంత దుమారం  రేపాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.


 ఎన్ని విమర్శలు వచ్చిన పట్టించుకోకుండా ఆయన ఇలాంటి సినిమాలను తీశారు. అయితే ఇటీవలే ఏపీలో టిడిపి ప్రభుత్వం కొలువుదీరింది. దీంతో తాను పొలిటికల్ సినిమాలు తీయను అంటూ ప్రకటించి షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు రామ్ గోపాల్ వర్మ. అయితే మరోసారి ఆ మాటను నొక్కి చెప్పాడు. కొత్త దర్శకులను పరిచయం చేసే ప్రెస్మీట్లో ఓ జర్నలిస్టు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెబుతూ.. పొలిటికల్ బయోపిక్ జోలికి వెళ్లేది లేదు అంటూ తేల్చి చెప్పారు. కాగా వర్మ తీసిన వ్యూహం, శపథం లాంటి సినిమాలను అటు చంద్రబాబు లోకేష్లను ఉద్దేశించే తీశారు అంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి అన్న విషయం తెలిసిందే.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>