Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-fadc1253-ba1a-42db-ae22-2842ece1b620-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-fadc1253-ba1a-42db-ae22-2842ece1b620-415x250-IndiaHerald.jpgఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన.. తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే వేదికపై మరో 25 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎలాంటి బాధ్యతలను అప్పగించబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే శాఖల కేటాయింపులో భాగంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పంచాయతీPolitical {#}Minister;kalyan;Janasena;Andhra Pradesh;Deputy Chief Minister;CBN;CM;TDP;Governmentఏంటీ.. 'డిప్యూటీ సీఎం' రాజ్యాంగబద్ధ పదవి కాదా.. షాక్ లో పవన్ ఫ్యాన్స్?ఏంటీ.. 'డిప్యూటీ సీఎం' రాజ్యాంగబద్ధ పదవి కాదా.. షాక్ లో పవన్ ఫ్యాన్స్?Political {#}Minister;kalyan;Janasena;Andhra Pradesh;Deputy Chief Minister;CBN;CM;TDP;GovernmentSat, 15 Jun 2024 17:15:00 GMTఇటీవల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన.. తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇదే వేదికపై మరో 25 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. కాగా ఇలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎలాంటి బాధ్యతలను అప్పగించబోతున్నారు అనే విషయంపై అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే ఇటీవలే శాఖల కేటాయింపులో భాగంగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవిని అప్పగించారు సీఎం చంద్రబాబు. అదే సమయంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖను కూడా అప్పగించారు.


 జనసేన పార్టీని స్థాపించిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అయితే చూడాలని అభిమానులు జనసైనికులు ఎన్నో కలలు కన్నారు. అయితే ఇక ఇప్పుడు సీఎం కాకపోయినప్పటి డిప్యూటీ సీఎం తర్వాత సీఎం అంత పదవి చేపట్టారు పవన్ కళ్యాణ్. దీంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా పదవీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో.. ఇక ఆ పదవిలో ఉన్న ఆయనకు రాజ్యాంగం ప్రకారం ఎలాంటి అధికారాలు ఉంటాయి అన్న విషయాన్ని తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. కానీ ఒక విషయం గురించి తెలిసి అందరూ షాక్ లో మునిగిపోతున్నారు.


 అదేంటంటే అసలు రాజ్యాంగంలో డిప్యూటీ సీఎం పదవి అనే ప్రస్తావనే లేదట. అంతేకాదు ఇక డిప్యూటీ సీఎం పదవికి ఎలాంటి అధికారాలు ఉంటాయి అన్న చట్టాలు కూడా ఎక్కడ లేవట. అందుకే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ముందే డిప్యూటీ సీఎం పదవి ఖరారు అయినప్పటికీ కేవలం ఒక సాధారణ మంత్రి గానే ప్రమాణ స్వీకారం చేశారు అన్నది తెలుస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఎవరికైనా మంత్రి కంటే పైస్థాయి, సీఎం తర్వాత స్థాయి ఇవ్వాలనుకున్నప్పుడు మాత్రం ఇలా డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్తూ ఉంటారట. అయితే దీనికి పాలనలో ప్రాధాన్యం ఉన్నప్పటికీ.. అటు రాజ్యాంగపరంగా మాత్రం ప్రత్యేక హక్కులు అధికారాలు లాంటివి ఏమీ ఉండవట. అయితే డిప్యూటీ సీఎం మాత్రమే కాదు డిప్యూటీ పిఎంకు కూడా ఇలాగే ఎలాంటి అధికారాలు ఉండవట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>