PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anamramanarayana2a673128-326c-4e69-93fc-1588236f6cc4-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/anamramanarayana2a673128-326c-4e69-93fc-1588236f6cc4-415x250-IndiaHerald.jpg•సీనియర్ నేతకి ఒట్టి దేవదాయ శాఖ ఎంతవరకు కరెక్టు? •అనుభవం ఉన్న నేతకి ఒక్క శాఖ సరిపోతుందంటారా? •బాగా చదువున్న సీనియర్ నేత ఆనంని సరిగ్గా వాడుకోలేకపోయిన టీడీపీ అమరావతి - ఇండియా హెరాల్డ్: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులకు శాఖల బాధ్యతలని అప్పగించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించిన శాఖ ఆయనకి తగినదేనా అన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.చాలా మందికి కూడా రెండు నుంచి 4,5 శాఖలు దాకా దక్కగా ఒక్క ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం కేవలం దేవాదాయ శాఖని కేటాయింanamramanarayana{#}Kiran Kumar;ANAM RAMANARAYANA REDDY;Nellore;TDP;India;Telangana Chief Minister;Minister'ఆనం'కి దేవదాయ శాఖా? అనుభవాన్ని సరిగ్గా వినియోగించుకోలేదుగా?'ఆనం'కి దేవదాయ శాఖా? అనుభవాన్ని సరిగ్గా వినియోగించుకోలేదుగా?anamramanarayana{#}Kiran Kumar;ANAM RAMANARAYANA REDDY;Nellore;TDP;India;Telangana Chief Minister;MinisterSat, 15 Jun 2024 11:52:14 GMT•సీనియర్ నేతకి ఒట్టి దేవదాయ శాఖ ఎంతవరకు కరెక్టు?
•అనుభవం ఉన్న నేతకి ఒక్క శాఖ సరిపోతుందంటారా?
•బాగా చదువున్న సీనియర్ నేత ఆనంని సరిగ్గా వాడుకోలేకపోయిన టీడీపీ


అమరావతి - ఇండియా హెరాల్డ్: ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర మంత్రులకు శాఖల బాధ్యతలని అప్పగించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆనం రామనారాయణ రెడ్డికి కేటాయించిన శాఖ ఆయనకి తగినదేనా అన్న కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి.చాలా మందికి కూడా రెండు నుంచి 4,5 శాఖలు దాకా దక్కగా ఒక్క ఆనం రామనారాయణ రెడ్డికి మాత్రం కేవలం దేవాదాయ శాఖని కేటాయించడం జరిగింది. పేరుకు ఆనం మంత్రి అయినా ఆయనకు దేవాదాయ శాఖ మాత్రమే కేటాయించడాన్ని చూసి ఆశ్చర్య పోవాల్సిందే అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. కనీసం మరో శాఖను అయినా ఆయనకు కేటాయించి ఉంటే బాగుండేదని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా అత్మకూరుకు చెందిన ఆనం రామనారాయణ రెడ్డి మంచి సీనియర్ నేత. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. బాగా చదువుకున్న నేత కూడా. ఆయన బీకాం, బీఎల్ చదివారు.అంతటి రాజకీయ నేతగా ఆనంకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. 1983లో నెల్లూరు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.


టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆర్ అండ్ బీ మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఆయనకి ఉంది. అలాంటిది ఆ శాఖ అయిన ఇవ్వకుండా దేవదాయ శాఖ ఎందుకిచ్చారబ్బా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. గతంలో ఆనం మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో కూడా ఆయన పని చేశారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులలో కొందరికి మంత్రులుగా అనుభవం ఉంది.మంచి అనుభవం ఉన్న సీనియర్ నేత కాబట్టి అన్ని శాఖలపై ఆనంకు పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. కాస్త పెద్ద శాఖ ఇచ్చుంటే బాగుండు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆరోగ్య శాఖ లేదా ఐటి శాఖ ఇలాంటి శాఖలకు ఆనం తగినవారు. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువగా ఉంది. అంత పెద్ద సమస్యకి ఆనం లాంటి సీనియర్ నేత తగినవాడు. అలాంటి నేతకి ఐటి శాఖ కానీ విద్యా శాఖ కానీ ఇచ్చుంటే ఇంకా బాగుండేది.ఈ శాఖల బాధ్యతలు ఇచ్చుంటే బాగుండు అంటున్నారు నెటిజన్స్. ఇంతటి అనుభవం ఉన్న నేతకి కేవలం ఒక్క శాఖ మాత్రమే కేటాయిస్తే  మంత్రి పదవి ఇచ్చి కూడా లాభమేంటనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. దేవాదాయ శాఖ మంచి శాఖే అయినా ఆనం వయస్సు, అనుభవానికి మరింత ప్రాధాన్యత ఇచ్చి ఇంకా ఏదైన పెద్ద శాఖ ఉంటే బాగుండేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>