PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/atchannaidu-kinjarapu-tdp8c0b54aa-aa56-40f1-84f6-bbd277d976e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/atchannaidu-kinjarapu-tdp8c0b54aa-aa56-40f1-84f6-bbd277d976e3-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడుకు ప్రత్యేక స్థానం ఉంది. అచ్చెన్నాయుడు మాటలకు చంద్రబాబు సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే పేరు ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు బీఎస్సీ చదివారు. చంద్రబాబు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి & మత్స్య శాఖలను కేటాయించారు. atchannaidu{#}ATCHANNAIDU KINJARAPU;Srikakulam;Tekkali;YCP;Andhra Pradesh;CBN;Ministerఅచ్చెన్నకు కూడా అన్యాయమేనా.. అభిమానులు, అనుచరులు కోరుకున్న శాఖలివే!అచ్చెన్నకు కూడా అన్యాయమేనా.. అభిమానులు, అనుచరులు కోరుకున్న శాఖలివే!atchannaidu{#}ATCHANNAIDU KINJARAPU;Srikakulam;Tekkali;YCP;Andhra Pradesh;CBN;MinisterSat, 15 Jun 2024 09:20:00 GMTతెలుగుదేశం పార్టీలో అచ్చెన్నాయుడుకు ప్రత్యేక స్థానం ఉంది. అచ్చెన్నాయుడు మాటలకు చంద్రబాబు సైతం ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే పేరు ఉంది. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అచ్చెన్నాయుడు బీఎస్సీ చదివారు. చంద్రబాబు అచ్చెన్నాయుడుకు వ్యవసాయం, సహకార, మార్కెటింగ్, పశు సంవర్ధక, పాడి అభివృద్ధి & మత్స్య శాఖలను కేటాయించారు.
 
అచ్చెన్నకు కేటాయించిన శాఖల విషయంలో అభిమానులు కానీ అనుచరులు కానీ సంతృప్తితో లేరు. అచ్చెన్నకు హోం శాఖ ఇస్తారని అనుచరులు భావించగా కార్మిక శాఖ ఇస్తే బాగుండేదని అభిమానులు భావిస్తున్నారు. అచ్చెన్నాయుడుకు గతంలో కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన అనుభవం అయితే ఉంది. ఆ శాఖ గురించి పూర్తిస్థాయిలో అనుభవం, అవగాహన ఉన్న అచ్చెన్నాయుడు మరోసారి కార్మిక శాఖ మంత్రి అయ్యి ఉంటే కార్మికులకు న్యాయం జరిగేది.
 
శాఖల కేటాయింపునకు సంబంధించి చంద్రబాబు కొన్ని నిర్ణయాలను మార్చుకుంటే ఏపీ ప్రజలకు మరింత మెరుగైన పాలన అంది ఉండేదని చెప్పవచ్చు. ఈ ఎన్నికల్లో అచ్చెన్నాయుడు ఏకంగా 34 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అచ్చెన్నాయుడుకు కేటాయించిన శాఖలలో వ్యవసాయ శాఖ మినహా మిగతా శాఖలు మరీ అంత ప్రాధాన్యత ఉన్నవి కావని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
అచ్చెన్న మాత్రం కేటాయించిన శాఖల విషయంలో సంతృప్తితోనే ఉన్నానని వ్యవసాయాభివృద్ధికి పాటు పడతానని రైతన్నలకు అన్ని విధాలుగా అండగా నిలబడతానని చెప్పుకొచ్చారు. విత్తనం నుంచి విక్రయం వరకు రైతులకు అన్ని విధాలుగా అండగా నిలబడతానని ఆయన పేర్కొన్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న అచ్చెన్నాయుడు ఏ పదవి ఇచ్చినా పూర్తిస్థాయిలో న్యాయం చేయగలరు. అయితే అనుభవం ఉన్న శాఖను ఇచ్చి ఉంటే మరింత మేలు జరిగేదని చెప్పవచ్చు. వైసీపీ పాలనలో వ్యవసాయ శాఖ పనితీరు ఏ మాత్రం బాలేదని అచ్చెన్నాయుడు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. తను మంత్రిగా ఉన్న సమయంలో అలాంటి విమర్శలు రాకుండా అచ్చెన్నాయుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.











మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>