PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/are-the-branches-given-to-pawan-correct-full-disappointment-for-them9be663bb-a96f-4b48-a9b5-610621cc4e31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/are-the-branches-given-to-pawan-correct-full-disappointment-for-them9be663bb-a96f-4b48-a9b5-610621cc4e31-415x250-IndiaHerald.jpg- పంచాయ‌తీల‌ను స్ట్రాంగ్ చేసే బాధ్య‌త ప‌వ‌న్‌దే - హోం శాఖ ద‌క్క‌క‌పోవడంతో జ‌న‌సైనిక్స్ నిరాశ‌ ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) కేబినెట్ కూర్పులో భాగంగా ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. కూట‌మిని క‌ట్టించ డంలోనూ.. కూట‌మిని గెలిపించ‌డంలోనూ ఆయ‌న శ్ర‌మ ప‌డ్డారు. ముఖ్యంగా బీజేపీని ఒప్పించ‌డంలోనూ ప‌వ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న శ్ర‌మ‌కు త‌గిన విధంగానే.. చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌కు గౌర‌వించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఇక, శాఖ‌ల కేటAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; chandrababu; tdp{#}India;Deputy Chief Minister;police;Ishtam;YCPప‌వ‌న్‌కు ఇచ్చిన శాఖ‌లు క‌ర‌క్టేనా.. వాళ్ల‌కు ఫుల్ డిజ‌ప్పాయింట్మెంట్‌..!ప‌వ‌న్‌కు ఇచ్చిన శాఖ‌లు క‌ర‌క్టేనా.. వాళ్ల‌కు ఫుల్ డిజ‌ప్పాయింట్మెంట్‌..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; chandrababu; tdp{#}India;Deputy Chief Minister;police;Ishtam;YCPSat, 15 Jun 2024 08:23:50 GMT- పంచాయ‌తీల‌ను స్ట్రాంగ్ చేసే బాధ్య‌త ప‌వ‌న్‌దే
- హోం శాఖ ద‌క్క‌క‌పోవడంతో జ‌న‌సైనిక్స్ నిరాశ‌

( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )

కేబినెట్ కూర్పులో భాగంగా ఉప‌ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ద‌క్కించుకున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. కూట‌మిని క‌ట్టించ డంలోనూ.. కూట‌మిని గెలిపించ‌డంలోనూ ఆయ‌న శ్ర‌మ ప‌డ్డారు. ముఖ్యంగా బీజేపీని ఒప్పించ‌డంలోనూ ప‌వ‌న్ ఎంతో క‌ష్ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. దీంతో ఆయ‌న శ్ర‌మ‌కు త‌గిన విధంగానే.. చంద్ర‌బాబు కూడా ఆయ‌న‌కు గౌర‌వించారు. డిప్యూటీ సీఎం ప‌ద‌విని ఆఫ‌ర్ చేశారు. ఇక, శాఖ‌ల కేటాయింపు విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఈ విష‌యంలోనూ కీల‌క శాఖ‌ల‌నే ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల‌ను అభివృద్ధి చేసే సంపూర్ణ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు.


ఎన్నిక‌ల‌కుముందు ప‌వ‌న్ క‌ల్యాణ్ అనేక సంద‌ర్భాల్లో గ్రామీణ అభ్యుద‌యం గురించి ప్ర‌స్తావించారు. గ్రామీణ ప్రాంతాలు బాగుంటే నే రాష్ట్రం బాగుంటుంద‌ని చెప్పుకొచ్చారు. అదే స‌మ‌యంలో ప‌లు సంద‌ర్భాల్లో తాగునీటి స‌మ‌స్య‌ను కూడా లేవ‌నెత్తారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఆయ‌న‌కు, గ్రామీణ అభివృద్ది, తాగునీటి శాఖ‌ల‌ను అప్ప‌గించారు. అంటే ఒక‌ర‌కంగా.. ప‌వ‌న్‌కు విస్తృత‌మై న ప‌ని క‌ల్పించార‌నే చెప్పాలి. ఒక‌వైపు సినిమాలు.. మ‌రోవైపు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి మంత్రిగా డిప్యూటీ సీఎంగా.. ప‌వ‌న్‌కు క్ష‌ణం కూడా తీరిక ఉండే అవ‌కాశం లేదు. అయిన‌ప్ప‌టికీ.. ఇష్ట‌మైన స‌బ్జెక్ట్ కావ‌డంతో ఆయ‌న అంతే ఇష్టం గా చేయొచ్చు.


ఇక‌, మ‌రీ ముఖ్యంగా పంచాయ‌తీరాజ్ శాఖ‌ను కూడా.. ప‌వ‌న్‌కే ఇచ్చారు. ప్ర‌స్తుతం పంచాయ‌తీరాజ్‌లో అనేక స‌మ‌స్య‌లు ఉన్నాయి. కేంద్రం ఇస్తున్న గ్రాంట్ల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం వాడేసుకుంది. దీంతో అనేక మంది స‌ర్పంచులు గ‌త వైసీపీ స‌ర్కారుపై యుద్ధ‌మే చేశారు. ఇప్పుడు వారిని కూడా గాడిలో పెట్టే బాధ్య‌త‌, కేంద్రం నుంచి నిధులు తీసుకువ‌చ్చే బాధ్య‌త కూడా ప‌వ‌న్‌పై ఉన్నాయి. ఇది అంత తేలికకాదు. అయినా.. కేంద్రంలోనూ ద‌న్నుగా ఉన్నారు కాబ‌ట్టి.. ప‌వ‌న్ ఆమేర‌కు సాధించే అవ‌కాశం ఉంది. అలానే పంచాయతీరాజ్ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు కూడా ప‌వ‌న్‌కు అవ‌కాశం ఏర్ప‌డింది.


అయితే.. ఇక్క‌డే చిన్న అసంతృప్తి అయితే. క‌నిపిస్తోంది. త‌మ నాయ‌కుడికి హోం శాఖ అప్ప‌గిస్తే బాగుండేద‌ని మెజారిటీ జ‌న‌సేన  నాయ‌కులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో వైసీపీ హ‌యాంలో చెల్లాచెదురైన లా అండ్ ఆర్డ‌ర్‌ను త‌మ నాయ‌కుడు.. మెరుగు ప‌రిచేందుకు అవ‌కాశం ఇచ్చి ఉండాల్సి ఉంద‌ని భావిస్తున్నారు. పోలీసు కుటుంబం నుంచి వ‌చ్చిన ప‌వ‌న్‌.. ప‌దే ప‌దే తాను చెప్పుకొన్న విష‌యాన్ని కూడా వారు ప్ర‌స్తావిస్తున్నారు. ఈ ఒక్క అసంతృప్తి మిన‌హా.. ప‌వ‌న్‌కు ఇచ్చిన బాధ్య‌త‌ల విష‌యంలో వారు సంతోషంగానే ఉండ‌డం గ‌మ‌నార్హం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>