PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-vijayasai-reddy-tdp-bjp-apa4f22741-e46c-4508-a5eb-13b9beea6f99-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ycp-vijayasai-reddy-tdp-bjp-apa4f22741-e46c-4508-a5eb-13b9beea6f99-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఒకే ఒక్కసారి రాగానే వారు మాకు తిరుగులేదు అనుకున్నారు. ఇక అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఓవైపు బిజెపిని మరోవైపు టిడిపిని నిందిస్తూ అహంకారాన్ని పీక్స్ స్టేజ్ లోకి తీసుకెళ్లారు. చివరికి అదే అహంకారం వారిని వై నాట్ 11 అనే దగ్గరికి తీసుకొచ్చింది. అయినా వీరికి ఇంకా నోటి దురుసు తగ్గినట్టు లేదు. టిడిపి, బిజెపి లకు వైయస్సార్YCP;VIJAYASAI REDDY;TDP;BJP;AP{#}Chakram;Ishtam;MP;V Vijayasai Reddy;Bharatiya Janata Party;Congress;YCP;Party;Andhra Pradesh;TDPఏపీ: వైసీపీ నోటి దురుసు వారినే ముంచేస్తోందా..?ఏపీ: వైసీపీ నోటి దురుసు వారినే ముంచేస్తోందా..?YCP;VIJAYASAI REDDY;TDP;BJP;AP{#}Chakram;Ishtam;MP;V Vijayasai Reddy;Bharatiya Janata Party;Congress;YCP;Party;Andhra Pradesh;TDPThu, 13 Jun 2024 15:53:37 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి మాత్రమే అధికారంలోకి వచ్చింది. ఒకే ఒక్కసారి రాగానే వారు మాకు తిరుగులేదు అనుకున్నారు. ఇక అడ్డు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించారు. ఇక ఈ ఎన్నికల్లో కూడా వై నాట్ 175 అనే నినాదంతో ముందుకు వెళ్లారు. ఓవైపు బిజెపిని మరోవైపు టిడిపిని నిందిస్తూ  అహంకారాన్ని పీక్స్ స్టేజ్ లోకి తీసుకెళ్లారు. చివరికి అదే అహంకారం వారిని  వై నాట్ 11 అనే  దగ్గరికి తీసుకొచ్చింది. అయినా వీరికి ఇంకా  నోటి దురుసు తగ్గినట్టు లేదు. టిడిపి, బిజెపి లకు  వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలే ఆస్త్రాలను తయారు చేసి మరీ ఇస్తున్నారు. ఆ వివరాలు ఏంటో చూద్దాం. 

ఆంధ్ర ప్రదేశ్ లో అధికారం కోల్పోయిన వీరు  కేంద్రంలో చక్రం తిప్పగలమనే వ్యాఖ్యలు చేస్తుండడం ఆశ్చర్యకరంగా మారింది. ఉభయ సభల్లో కలిపి 15 మంది ఎంపీలు ఉన్నారని కచ్చితంగా రాజ్యసభలో బిజెపికి తమ పార్టీ అవసరం ఉంటుందని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించడం చాలా హాట్ టాపిక్ గా మారింది. ఈ విధంగా విజయసాయి రెడ్డి అన్న మాటలను బిజెపి అధిష్టానం సీరియస్ గా తీసుకుంటే మాత్రం  వైసిపి పునాదులు దగ్గర్నుండి  కదిలించేస్తుంది. అంటే వైసీపీ మాటలు బట్టి చూస్తే మాత్రం రాష్ట్ర మండలిలో తమకే ఎక్కువ బలం ఉందన్న అహంకారంతో ఇలా మాట్లాడుతున్నట్టు తెలుస్తోంది.

ఏవైనా కొత్త బిల్లులు ఆమోదం పొందాలంటే మండలిలో తమ అవసరం ఉంటుందని ఆయన ఊహల్లో బతుకుతున్నట్టున్నారు.  ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చూస్తే టిడిపి సైతం గట్టిగా ఫోకస్ చేస్తే మాత్రం మండలిలో బిల్లులు ఆమోదం పొందడం కూడా పెద్ద కష్టమేమీ కాదు. ఈ విషయం తెలియనటువంటి  విజయసాయిరెడ్డి ఈ విధమైన మాటలు మాట్లాడడం చాలా ఆశ్చర్యకరంగా ఉంది.. ఈ విధంగా సైలెంట్ గా ఉన్నటువంటి బిజెపి,  టిడిపిలను  లేపి మరీ  మమ్మల్ని ఏమైనా చేయండి అంటూ విజయసాయిరెడ్డి ఆలోచనలు ఇస్తున్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>