PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan2d46a78b-aebb-4883-96d9-2e6ae68f412a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/pawan-kalyan2d46a78b-aebb-4883-96d9-2e6ae68f412a-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రోజున కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నారం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయగా... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా లేచి కేరింతలు, చప్పట్లతో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. pawan kalyan{#}Allu Arjun;WhatsApp;Nagababu;Assembly;Telugu Desam Party;Government;wednesday;Pawan Kalyan;YCP;Andhra Pradesh;News;CBN;Janasena;kalyanపవన్‌ ప్రమాణ స్వీకారం: అల్లు ఫ్యామిలీకి అందని ఆహ్వానం?పవన్‌ ప్రమాణ స్వీకారం: అల్లు ఫ్యామిలీకి అందని ఆహ్వానం?pawan kalyan{#}Allu Arjun;WhatsApp;Nagababu;Assembly;Telugu Desam Party;Government;wednesday;Pawan Kalyan;YCP;Andhra Pradesh;News;CBN;Janasena;kalyanThu, 13 Jun 2024 07:26:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం రోజున కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నారం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగవసారి ప్రమాణ స్వీకారం చేయగా... జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా లేచి కేరింతలు, చప్పట్లతో పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు.
 

ఇటు టీవీలలో చూసేవారు కూడా ఎగిరిగంతేశారు. ఇక కొంతమంది పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్లిప్పును వాట్సాప్ స్టేటస్ గా కూడా పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కూడా చాలామంది పవన్ కళ్యాణ్ కు ఈ సందర్భంగా శుభాకాంక్షలు చెబుతున్నారు.
అయితే జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారం ఉన్న నేపథ్యంలో... మెగా కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు ఇలా చాలామంది... ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఇక్కడ పెద్ద ట్విస్ట్ చోటుచేసుకుంది. ప్రమాణ స్వీకారం సందర్భంగా అందరి కుటుంబ సభ్యులు కల్పించారు కానీ... అల్లు ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఒక్కరూ... ఆ కార్యక్రమంలో కనిపించకపోవడం అందరూ గమనించారు.

 

దీంతో అల్లు ఫ్యామిలిని మెగా కుటుంబం దూరంగా పెడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి  ఇంటికి వెళ్లి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడం... ఆ తర్వాత మెగా బ్రదర్ నాగబాబు వివాదాస్పద పోస్ట్ పెట్టడం జరిగిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి నుంచి... అల్లు కుటుంబం అలాగే మెగా కుటుంబం కాస్త డిస్టెన్స్ మైంటైన్ చేస్తున్నారట. ఇక ఇటు లేటెస్ట్ గా సాయి ధరంతేజ్ కూడా సోషల్ మీడియాలో... అల్లు అర్జున్ ను అన్ ఫాలో చేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు తాజాగా పవన్ కళ్యాణ్ ప్రమాణస్వీకారానికి కూడా అల్లుడు ఫ్యామిలీ హాజరు కాలేకపోయింది.

ఈ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఆహ్వానం... అల్లు వారి కుటుంబానికి అందిందా లేదా అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అల్లు కుటుంబానికి ఆహ్వానం అందకపోవడంతో... వారు రాలేదని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. కానీ కొంతమంది మాత్రం ఆహ్వానం అందినా కూడా అల్లు కుటుంబం రాలేదని అంటున్నారు. ఒకవేళ అల్లు అర్జున్ కుటుంబం ఆ ఫంక్షన్కు వస్తే... దారుణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుందని... రాలేదని కొంతమంది భావిస్తున్నారు. మొత్తానికి అల్లు అలాగే మెగా కుటుంబం మధ్య చీలిక ఏర్పడిందని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>