PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn8d80e488-69e8-4bfc-9f70-05e9c5ef865d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cbn8d80e488-69e8-4bfc-9f70-05e9c5ef865d-415x250-IndiaHerald.jpgటీడీపీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న అనగా జూన్ 12 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , భారత హోం శాఖ మాత్యులు అమిత్ షా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు. ఇక ఎంతో మంది ముందు ఎంతో ఘనంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రcbn{#}Amith Shah;Governor;Andhra Pradesh;CBN;June;Prime Minister;Narendra Modi;Party;Bharatiya Janata Partyచంద్రబాబు అందుకే ఆ ఫైల్స్ పై సంతకం చేయలేదా..?చంద్రబాబు అందుకే ఆ ఫైల్స్ పై సంతకం చేయలేదా..?cbn{#}Amith Shah;Governor;Andhra Pradesh;CBN;June;Prime Minister;Narendra Modi;Party;Bharatiya Janata PartyThu, 13 Jun 2024 09:12:00 GMTటీడీపీ పార్టీ అధినేత అయినటువంటి చంద్రబాబు నాయుడు నిన్న అనగా జూన్ 12 వ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం మనకు తెలిసిందే. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ , భారత హోం శాఖ మాత్యులు అమిత్ షా ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వీరితో పాటు మరి కొంత మంది సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి విచ్చేశారు.

ఇక ఎంతో మంది ముందు ఎంతో ఘనంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారం రోజు చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ దస్త్రం పై ,  ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు పై , పింఛన్ల పెంపు ఫైల్స్ పై సంతకాలు చేస్తారు అని అంతా భావించారు. కానీ అలా చేయలేదు. దానితో వై సి పి పార్టీ శ్రేణులు అంతా కూడా టి డి పి పార్టీ ని ట్రీల్ చేస్తూ వస్తున్నారు. బాబు ఎందుకు చెప్పిన వాటిపై సంతకాలు చేయలేదు.

మర్చిపోయారా ..? లేక పెన్ను దొరకలేదా ..? ఇలా రకరకాలుగా టీ డీ పీ పార్టీని , చంద్రబాబును ట్రోల్ చేస్తున్నారు. చంద్రబాబు నిన్న సంతకాలు చేయకపోవడానికి ప్రధాన కారణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకు అంటే నిన్న చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి భారతీయ జనతా పార్టీ నేత మరియు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దేశ ప్రధాని ముందు సంతకం పెట్టాలి అంటే కచ్చితంగా ప్రోటో కాల్ పాటించవలసి ఉంటుంది.

అలాగే మోడీ ముందు చంద్రబాబు సంతకాలు పెట్టినట్లు అయితే అది బి జె పి పార్టీకి సంబంధించిన సంతకాలు కూడా అయినట్లు అవుతుంది. ఒక వేళ ఆ పథకాలు ఫెయిల్ అయినట్లయితే బి జె పి కి నష్టం జరుగుతుంది కాబట్టి సంతకాలు చేయలేదు అని కొంత మంది అభిప్రాయపడుతున్నారు. ఇక ఈ రోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఛార్జ్ తీసుకోనున్నాడు. దానితో ఈ రోజే వీటన్నింటిపై సంతకాలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>