PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/six-life-lessons-that-youth-should-learn-from-powerstar5f39dd42-e2e8-487d-8518-06c9b0759763-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/six-life-lessons-that-youth-should-learn-from-powerstar5f39dd42-e2e8-487d-8518-06c9b0759763-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకుని సత్తా చాటారు. ప్రజల మద్దతు లభించడంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన సునాయాసంగా విజయం సాధించింది. అయితే సాధారణంగా ఈ స్థాయి ఫలితాలు వచ్చాయంటే ఎవరిలోనైనా గర్వం పెరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన కామెంట్లతో విపక్ష నేతలను సైతం మెప్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. pawan kalyan{#}Pawan Kalyan;kalyan;Janasena;YCPవిపక్ష నేతలను సైతం మెప్పించేలా పవన్ కామెంట్స్.. గర్వం అణువంతైనా లేదుగా!విపక్ష నేతలను సైతం మెప్పించేలా పవన్ కామెంట్స్.. గర్వం అణువంతైనా లేదుగా!pawan kalyan{#}Pawan Kalyan;kalyan;Janasena;YCPThu, 13 Jun 2024 15:40:00 GMTజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో సంచలన ఫలితాలను సొంతం చేసుకుని సత్తా చాటారు. ప్రజల మద్దతు లభించడంతో పోటీ చేసిన అన్ని స్థానాల్లో జనసేన సునాయాసంగా విజయం సాధించింది. అయితే సాధారణంగా ఈ స్థాయి ఫలితాలు వచ్చాయంటే ఎవరిలోనైనా గర్వం పెరుగుతుంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన కామెంట్లతో విపక్ష నేతలను సైతం మెప్పిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.
 
ఏపీలో జనసేన నుంచి పోటీ చేసిన అభ్యర్థులంతా తన వల్లే గెలిచినా పవన్ లో గర్వం అణువంత కూడా లేకపోవడం గమనార్హం. వైసీపీ నేతలు గతంలో తనపై విమర్శలు చేయడంలో తప్పేం లేదని పాలిటిక్స్ లో విమర్శలు ప్రతివిమర్శలు సర్వ సాధారణమని పవన్ చేసిన కామెంట్లు విశ్లేషకులను సైతం మెప్పించడం గమనార్హం. తను కోరుకుంటే హోం శాఖ వచ్చే ఛాన్స్ ఉన్నా పవన్ మాత్రం గ్రామీణాభివృద్ధి, పంచాయితీరాజ్, అటవీ శాఖలను తీసుకున్నారని తెలుస్తోంది.
 
వైసీపీ నేతలపై తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ద్వేషం లేదని చెప్పడం ద్వారా పవన్ కళ్యాణ్ గొప్ప మనస్సును చాటుకున్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇతరులను ఇబ్బంది పెట్టడానికి తాను వ్యతిరేకమని పవన్ తన మాటల ద్వారా చెప్పకనే చెబుతున్నారు. అధికారం ఉన్నా లేకపోయినా తాను ఎప్పుడూ ఒకే విధంగా ఉంటానని పవన్ చెప్పకనే చెబుతున్నారు. పవన్ వ్యవహార శైలి విషయంలో వైసీపీ నేతలు సైతం హ్యాపీగా ఉన్నారు.
 
వైసీపీ అభిమానుల మెప్పు సైతం పొందేలా పవన్ వ్యవహార శైలి ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. మిగతా రాజకీయ నేతలకు తాను భిన్నమని పవన్ కళ్యాణ్ ప్రూవ్ చేసుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కూడా పవన్ ఇదే విధంగా ఉంటే ఆయనకు తిరుగుండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. తన నిర్ణయాలతో ఏపీలో పవన్ తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటారని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>