HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health48c365d4-53c2-4132-bd28-7aebad11d684-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health48c365d4-53c2-4132-bd28-7aebad11d684-415x250-IndiaHerald.jpgఎండాకాలం పొయ్యింది. వానా కాలం రానే వచ్చేసింది. వానా కాలం కావడంతో ఈ సీజన్‌లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మనకు మొదలవుతాయి. అందులో జలుబు, దగ్గు జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు మొదలైందంటే..అవి అంత ఈజీగా పోవు. ఇంకా దీనితో పాటు ఊపిరితిత్తులలో కఫం కూడా పేరుకుపోతుంది. ఇంకా అలాగే, ఇంటిల్లిపాదిని కూడా వెంటాడుతుంది. మీరు ఈ సమస్యలని వదిలించుకోవడానికి సమర్థవంతమైన ఇంటి నివారణల కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ కొన్ని మంచి హోం రెమిడీస్‌ ఉన్నాయి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి.వర్షాకాలంలో వేధిHealth{#}Rasam;Ginger;Eveningవర్షాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఈ టిప్స్ పాటించండి?వర్షాకాలంలో జలుబు, దగ్గు రాకుండా ఈ టిప్స్ పాటించండి?Health{#}Rasam;Ginger;EveningThu, 13 Jun 2024 23:45:00 GMTఎండాకాలం పొయ్యింది. వానా కాలం రానే వచ్చేసింది. వానా కాలం కావడంతో ఈ సీజన్‌లో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు మనకు మొదలవుతాయి. అందులో జలుబు, దగ్గు జ్వరం ఎక్కువగా వేధిస్తాయి. ఒకసారి ఇంట్లో ఎవరికైనా దగ్గు జలుబు మొదలైందంటే..అవి అంత ఈజీగా పోవు. ఇంకా దీనితో పాటు ఊపిరితిత్తులలో కఫం కూడా పేరుకుపోతుంది. ఇంకా అలాగే, ఇంటిల్లిపాదిని కూడా వెంటాడుతుంది. మీరు ఈ సమస్యలని వదిలించుకోవడానికి సమర్థవంతమైన ఇంటి నివారణల కోసం చూస్తున్నట్లయితే, ఇక్కడ కొన్ని మంచి హోం రెమిడీస్‌ ఉన్నాయి. ఇవి మీకు చాలా ఉపయోగపడతాయి.వర్షాకాలంలో వేధించే సీజనల్‌ సమస్యలకు తేనె ఎంతో అద్భుతమైన హోం రెమిడీగా పనిచేస్తుంది. తేనెలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా యాంటీ మైక్రోబియల్ గుణాలు కఫం నుండి ఉపశమనం పొందడంలో బాగా ఉపయోగపడతాయి.


బ్యాక్టీరియా, వైరల్ ఇన్ఫెక్షన్లను తొలగించడంలో తేనె చాలా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 2 చెంచాల తేనెని మిక్స్ చేసి తాగితే జలుబు, దగ్గు వంటి సమస్యలతో పాటు జ్వరం, తలనొప్పి కూడా చాలా ఈజీగా దూరమవుతాయి. ఉదయం, సాయంత్రం ఒక చెంచా తేనె తినడం కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.ఇంకా అంతే కాకుండా, అల్లం తినడం వల్ల కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది. పచ్చి అల్లం తినడం లేదా దాని రసం తీసి తాగడం వల్ల కూడా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. అలాగే మిరియాల పొడిని ఒక చెంచా తేనెలో కలుపుకుని తాగితే జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఈజీగా ఉపశమనం లభిస్తుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. కానీ, దీన్ని ఎక్కువగా తీసుకుంటే శరీరంలో ఉష్ణోగ్రత పెరిగే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి కేవలం మితంగా మాత్రమే తీసుకోండి. ఎల్లప్పుడూ కూడా జలుబు, దగ్గు, జ్వరం రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>