MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babic4cdb54e-b15f-4145-b5a6-7050af3d954c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/babic4cdb54e-b15f-4145-b5a6-7050af3d954c-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో బాబీ ఒకరు. ఈయన ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ తో చిరు కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కగా బాబీ కి కూడbabi{#}Shruti Haasan;thaman s;urvashi;Makar Sakranti;lion;Mass;Blockbuster hit;Balakrishna;Chiranjeevi;Bobby;Box office;sree;sithara;naga;surya sivakumar;Music;Hero;Heroine;Telugu;Cinemaచిరుతో ఓకే... బాలయ్యతో పెండింగ్... బాబీ ఈసారి కూడా పాస్ అయ్యేనా..?చిరుతో ఓకే... బాలయ్యతో పెండింగ్... బాబీ ఈసారి కూడా పాస్ అయ్యేనా..?babi{#}Shruti Haasan;thaman s;urvashi;Makar Sakranti;lion;Mass;Blockbuster hit;Balakrishna;Chiranjeevi;Bobby;Box office;sree;sithara;naga;surya sivakumar;Music;Hero;Heroine;Telugu;CinemaThu, 13 Jun 2024 12:59:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకులలో బాబీ ఒకరు. ఈయన ఆఖరుగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా రూపొందిన వాల్తేరు వీరయ్య అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా పోయిన సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. శృతి హాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించగా , మైత్రి సంస్థ వారు ఈ మూవీ ని నిర్మించారు.

దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈ మూవీ తో చిరు కి ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కగా బాబీ కి కూడా ఈ మూవీ విజయంతో మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇక వాల్టేరు వీరయ్య లాంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత బాబి , నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ఓ మూవీ ని స్టార్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ 2 వీడియోలను విడుదల చేశారు. వాటికి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు మేకర్స్ ఇప్పటివరకు టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ బాలయ్య కెరియర్ లో 109 వ మూవీ గా తెరకెక్కుతూ ఉండడంతో ఈ మూవీ ని "ఎన్ బి కె 109" అనే వర్కింగ్ టైటిల్ తో చిత్రీకరిస్తున్నారు. ఊర్వశి రౌటేలా ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనుండగా , ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇక ఇప్పటి వరకు ఈ మూవీ నుండి మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా జనాలను ఆకట్టుకున్నాయి. దానితో వాల్టేరు వీరయ్య మూవీ తో చిరు కి బ్లాక్ బస్టర్ అందించిన బాబి "ఎన్ బి కె 109" తో బాలయ్య కు కూడా అదిరిపోయే మాస్ విజయాన్ని అందిస్తాడు అని బాలకృష్ణ అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>