PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ayyannapatrudu25791f56-1446-45ee-b754-9c97f1df46cf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ayyannapatrudu25791f56-1446-45ee-b754-9c97f1df46cf-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు నాయుడు తరువాత అంతటి ప్రతిభావంతుడైన అయ్యన్నపాత్రుడుకి మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్రమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత అయిన నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం ఆయన చేశారు.గతంలో తనకు కూడా 26 ఏళ్లకే మంత్రి పదవి దక్కిందని ఆయన చెప్పారు. అప్పుడు సీనియర్లంతా కూడా బాధపడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కొత్త రక్తం రావాలని, యువ మAyyannapatrudu{#}Yuva;Ayyannapatrudu;Vishakapatnam;Minister;TDP;MLA;CBNశభాష్ అయ్యన్న: మంత్రి పదవి దక్కలేదని ఏమన్నాడంటే?శభాష్ అయ్యన్న: మంత్రి పదవి దక్కలేదని ఏమన్నాడంటే?Ayyannapatrudu{#}Yuva;Ayyannapatrudu;Vishakapatnam;Minister;TDP;MLA;CBNThu, 13 Jun 2024 22:51:13 GMTప్రస్తుతం టీడీపీలో చంద్రబాబు నాయుడు తరువాత అంతటి ప్రతిభావంతుడైన అయ్యన్నపాత్రుడుకి మంత్రి పదవి దక్కకపోవడంపై తీవ్రమైన చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్‌ నేత అయిన నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మంత్రి పదవి రాకపోవడంపై తనకు బాధేమీ లేదని స్పష్టం ఆయన చేశారు.గతంలో తనకు కూడా 26 ఏళ్లకే మంత్రి పదవి దక్కిందని ఆయన చెప్పారు. అప్పుడు సీనియర్లంతా కూడా బాధపడ్డారా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు కొత్త రక్తం రావాలని, యువ మంత్రులకు అండగా ఉంటామని అయ్యన్న స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో కొంతమంది అధికారులు ఓవర్‌ యాక్షన్‌ చేశారని అయ్యన్న తెలిపారు. వారిని చంద్రబాబు నాయుడు క్షమించినా కూడా తాను మాత్రం క్షమించనని స్పష్టం చేశారు. 


రాష్ట్ర ప్రజల కోసం చాలా ఇబ్బందులు పడ్డామని తెలిపారు. ఏపీకి ఇప్పుడు మంచి రోజులు వచ్చాయని అయ్యన్న పేర్కొన్నారు.టీడీపీ సీనియర్‌ నేత, నర్సీపట్నం ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో చోటు దక్కకపోవడం ఏపీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే టీడీపీలో అత్యంత సీనియర్‌ నాయకుడు, చంద్రబాబుకు సమకాలీకుడు అయిన అయ్యన్నపాత్రుడికి మంత్రి పదవి గ్యారంటీ అని చాలామంది కూడా ఊహించారు. కానీ ఊహించని విధంగా ఆయనకు కేబినెట్‌లో చోటు దక్కలేదు. విశాఖ జిల్లా నుంచి వంగలపూడి అనితకు మంత్రి పదవిని కేటాయించారు. అయితే అయ్యన్నపాత్రుడు అసంతృప్తిలో ఉన్నట్లు చర్చ మొదలయ్యింది. ఈ నేపథ్యంలో స్పందించిన అయ్యన్నపాత్రుడు ఆ వార్తలను ఖండించారు. అయ్యన్న కామెంట్స్ కి టీడీపీ ఫ్యాన్స్ శభాష్ అని అంటున్నారు.నాయకుడు అంటే మా అయ్యన్న లాగా ఉండాలని టీడీపీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.మంత్రి పదవి దక్కకున్నా కూడా ఏమాత్రం కోపం, గర్వం లేకుండా పాజిటివ్ గా తీసుకొని కొత్త వారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు అయ్యన్నని ప్రశంసిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>