Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawana572fc36-94f2-4e65-b65b-3eb1299848dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawana572fc36-94f2-4e65-b65b-3eb1299848dc-415x250-IndiaHerald.jpg - మోడీకి బాబు, బాబుకి మోడీ అవసరం - జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య అంతా కపట ప్రేమ - రాజకీయ అవసరాల కోసమే ఈ నాటకం (ఏపీ - ఇండియా హెరాల్డ్ ) ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో హట్టహాసంగా జరిగింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా ఎంతోమంది సినీ సెలబ్రిటీల మధ్య ఇక ఈకార్యక్రమం జరిగింది అన్న విషయంPawan{#}central government;prema;Love;TDP;Narendra Modi;Prime Minister;CBN;kalyan;Janasena;Assembly;India;Minister;Governmentమోడీకి బాబు కావాలి.. బాబుకి పవన్ కావాలి.. అంతా కపట ప్రేమేనా?మోడీకి బాబు కావాలి.. బాబుకి పవన్ కావాలి.. అంతా కపట ప్రేమేనా?Pawan{#}central government;prema;Love;TDP;Narendra Modi;Prime Minister;CBN;kalyan;Janasena;Assembly;India;Minister;GovernmentThu, 13 Jun 2024 10:15:00 GMT- మోడీకి బాబు, బాబుకి మోడీ అవసరం
- జనసేన, బీజేపీ, టీడీపీ మధ్య అంతా కపట ప్రేమ
- రాజకీయ అవసరాల కోసమే ఈ నాటకం

(ఏపీ - ఇండియా హెరాల్డ్ )

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం ఎంతో హట్టహాసంగా జరిగింది. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సహా ఎంతోమంది సినీ సెలబ్రిటీల మధ్య ఇక ఈకార్యక్రమం జరిగింది అన్న విషయం తెలిసిందే. అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేపట్టగా ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా ఇక కూటమిలోని ఎంపిక చేసిన నేతలు అందరూ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.


 అయితే ఈ వేదికపై టిడిపి, జనసేన, బిజెపిల మధ్య ప్రేమ, ఆప్యాయతలు కాస్త ఎక్కువగానే కనిపించాయి.  ఏకంగా నరేంద్ర మోడీ చంద్రబాబుతో ఎప్పుడూ లేనంతగా ఆప్యాయంగా ఉన్నారూ. ఏకంగా ఆయన ఆప్యాయంగా పలకరించడం.. ఆలింగనం చేసుకోవడం చేశారు. మరోవైపు అటు టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం కూడా చూసాం. పవన్ పై ఎన్నడూ చూపునంత ప్రేమని బాబు నివేదికపై చూపించారు. అయితే ఇదంతా చూసిన తర్వాత ఇది కేవలం పొలిటికల్ డ్రామా మాత్రమే అని కొంతమంది అభిప్రాయపడుతున్నారట.


 ఎందుకంటే రాజకీయ అవసరాల కోసం మాత్రమే పైపైకి కపట ప్రేమ నటిస్తున్నారు అంటూ ఒక టాక్ ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే మోడీకి బాబు అవసరం ఉందని.. అలాగే చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ అవసరం ఉందని.. అందుకే ఇదంతా జరుగుతుందంటు ఏపీలోని కొంతమంది చర్చించుకుంటున్నారట. కేంద్రంలో అధికారాన్ని చేపట్టేందుకు బిజెపికి సరైన మెజారిటీ రాలేదు. దీంతో టిడిపి మద్దతుతోనే అటు కేంద్రంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగింది బిజెపి. ఒకవేళ బాబు మొండికేసి ఎన్డీఏకు మద్దతు విరమించుకుంటే మాత్రం ఇక మోడీ ప్రభుత్వం కూలిపోతుంది అనడంలో సందేహం లేదు.


 ఇంకోవైపు టిడిపికి అధికారాన్ని చేపట్టేందుకు కావలసినంత మెజారిటీగా ఉంది. అయినప్పటికీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో అంతా ఆప్యాయకంగా ఉండడానికి కారణం.. పవన్ కళ్యాణ్ తోడుతోనే టీడీపీ ఈ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించగలిగింది. అదే సమయంలో పవన్ కూడా 21కి 21 స్థానాలలో విజయం సాధించారు. ఒకవేళ పవన్ చంద్రబాబు దూరం పెడితే ఇక వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు బాబును దూరం పెట్టే అవకాశం లేకపోలేదు. అందుకే చంద్రబాబుతో మోడీ.. పవన్ కళ్యాణ్ తో చంద్రబాబు ఇలా మితిమీరిన ఆప్యాయతలను చూపిస్తున్నారని కొంతమంది నిపుణుల వాదన. కానీ అలాంటిదేం లేదు కేవలం వాళ్ళ మధ్య ఉన్న స్నేహబంధమే అలాంటి ఆప్యాయతకి కారణమని కూటమిలోని పార్టీల శ్రేణులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>