PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-the-video-leak-a-trap-for-lokesh8041f4c8-0cd1-4b6a-85d3-1bc5beea72d1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/is-the-video-leak-a-trap-for-lokesh8041f4c8-0cd1-4b6a-85d3-1bc5beea72d1-415x250-IndiaHerald.jpgఏపీ రాజకీయాలలో నారా లోకేశ్ పేరు ఎప్పుడూ మారు మ్రోగుతుందనే తెలిసిందే. చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 91 వేల మెజార్టీతో గెలవడంతో పాటు మంత్రి పదవిని దక్కించుకున్నారు. nara lokesh{#}Hyderabad;Ford;Mangalagiri;Nara Brahmani;Chakram;Hanu Raghavapudi;Minister;Nara Lokesh;TDP;CBNఇంతింతై వటుడింతై.. అప్పుడు బాబుకు దక్కిన క్రెడిట్ ఇప్పుడు లోకేశ్ కు దక్కనుందా?ఇంతింతై వటుడింతై.. అప్పుడు బాబుకు దక్కిన క్రెడిట్ ఇప్పుడు లోకేశ్ కు దక్కనుందా?nara lokesh{#}Hyderabad;Ford;Mangalagiri;Nara Brahmani;Chakram;Hanu Raghavapudi;Minister;Nara Lokesh;TDP;CBNThu, 13 Jun 2024 08:17:00 GMTఏపీ రాజకీయాలలో నారా లోకేశ్ పేరు ఎప్పుడూ మారు మ్రోగుతుందనే తెలిసిందే. చంద్రబాబు నాయుడు కొడుకుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నారా లోకేశ్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 91 వేల మెజార్టీతో గెలవడంతో పాటు మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న లోకేశ్ కు మరోసారి ఐటీ మినిష్టర్ గా ఛాన్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
 
ఇంతింతై వటుడింతై అనే విధంగా ఎదిగిన నారా లోకేశ్ వయస్సు ప్రస్తుతం 41 సంవత్సరాలు కాగా 2017 సంవత్సరంలో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేశ్ అప్పట్లో బాబు మంత్రి వర్గంలో ఐటీ, గ్రామీణభివృద్ధి మంత్రిగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన లోకేశ్ గతంలో ఏపీలో ఐటీ కంపెనీల స్థాపనకు కృషి చేసిన నేపథ్యంలో ఐటీ మినిష్టర్ పదవికి లోకేశ్ పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
2019 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గంలో స్వల్ప తేడాతో లోకేశ్ ఓటమిపాలయ్యారు. ఐదేళ్లలో పరిస్థితులు పూర్తిగా మారిపోవడంతో పాటు మంగళగిరి అభివృద్ధి కోసం లోకేశ్ తీసుకున్న నిర్ణయాలు నియోజకవర్గ ప్రజల్లో లోకేశ్ పై మంచి అభిప్రాయాన్ని కలిగించాయి. గతేడాది జనవరిలో యువగళం పాదయాత్ర చేపట్టిన పవన్ 4,0000 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర నిర్వహించి ప్రశంసలు అందుకున్నారు.
 
పాదయాత్ర చేసిన వ్యక్తి కుటుంబానికే అధికారం దక్కుతుందని మెజారిటీ సందర్భాల్లో ప్రూవ్ అయిన సెంటిమెంట్ ను నారా లోకేశ్ మరోసారి ప్రూవ్ చేశారు. హైదరాబాద్ లో వందల సంఖ్యలో ఐటీ కంపెనీల స్థాపనకు బాబు కారణం కాగా లోకేశ్ కు ఐటీ మినిష్టర్ పదవి దక్కితే అప్పుడు బాబుకు దక్కిన క్రెడిట్ ఇప్పుడు లోకేశ్ కు దక్కనుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నారా లోకేశ్ సక్సెస్ వెనుక చంద్రబాబు, బ్రాహ్మణి పాత్ర కూడా కొంతమేర ఉందని చాలామంది భావిస్తారు. భవిష్యత్తులో లోకేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>