PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cf0e6945-1b87-45cc-b83c-97c99456341b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-cf0e6945-1b87-45cc-b83c-97c99456341b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. నేటి నుంచి ఆయన కొత్త పాలన అందించేలాగా కనిపిస్తున్నారు. నిన్న సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “మీరు వెర్షన్ 1.0, వెర్షన్ 2.0, వెర్షన్ 3.0 చూశారు. ఇప్పుడు మీరు వెర్షన్ 4.0 చూస్తారు.’’ అని చంద్రబాబు ఒక సినిమా హీరో లాగా డైలాగు వదిలారు. Chandrababu {#}Paritala Sunitha;Evening;central government;Sri Venkateswara swamy;Telangana Chief Minister;Government;CBN;kalyan;Cinemaరూట్ మార్చిన చంద్రబాబు.. ఈసారి పాలనతో ఏపీ ముఖచిత్రాన్నే మార్చేస్తారు..??రూట్ మార్చిన చంద్రబాబు.. ఈసారి పాలనతో ఏపీ ముఖచిత్రాన్నే మార్చేస్తారు..??Chandrababu {#}Paritala Sunitha;Evening;central government;Sri Venkateswara swamy;Telangana Chief Minister;Government;CBN;kalyan;CinemaThu, 13 Jun 2024 13:57:00 GMTఆంధ్రప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం బాధ్యతలు స్వీకరించనున్నారు. నేటి నుంచి ఆయన కొత్త పాలన అందించేలాగా కనిపిస్తున్నారు. నిన్న సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “మీరు వెర్షన్ 1.0, వెర్షన్ 2.0, వెర్షన్ 3.0 చూశారు. ఇప్పుడు మీరు వెర్షన్ 4.0 చూస్తారు.’’ అని చంద్రబాబు ఒక సినిమా హీరో లాగా డైలాగు వదిలారు.

అంతేకాదు, ఈసారి చాలా డిఫరెంట్‌గా కనిపిస్తున్నారు. ఆయన కొత్త మంత్రివర్గంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 25 మంది సభ్యులలో, 17 మంది మొదటిసారి మంత్రులయ్యారు. బాబు తన టీమ్‌కి ఫ్రెష్ లుక్ ఇవ్వడానికి చాలా మంది సీనియర్ సభ్యులను పక్కన పెట్టారు. గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన్నరాజప్ప, పరిటాల సునీత వంటి సీనియర్ నేతలకు ఈసారి మంత్రివర్గంలో చోటు దక్కలేదు. వారిలో చాలా మంది బాబుకు చాలా కాలంగా క్లోజ్‌గా ఉంటూ వస్తున్నారు కాబట్టి వారిని పక్కన పెట్టేయడం ద్వారా బాబు పెద్ద సాహసమే చేశారని చెప్పుకోవాలి.

చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం కూడా ఇప్పుడు చాలా వేగంగా జరుగుతోంది. బాబు ఒకప్పుడు చాలా సమయం మేధోమథనం చేసేవారు, అందువల్ల ప్రతి చిన్న పని కూడా చాలా ఆలస్యమయ్యేది. ఈసారి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఉదాహరణకు, CID త్వరగా బెవరేజెస్ కార్పొరేషన్ ఛైర్మన్‌పై చర్య తీసుకుంది. గత పాలనలో అవినీతిని వెలికితీసేందుకు అనేక కార్యాలయాలను సీజ్ చేసింది.

మెగా డీఎస్సీపై సంతకం చేయడం, భూ పట్టాదారు చట్టం రద్దు, పెన్షన్ల పెంపు, స్కిల్ సెన్సస్ నిర్వహించడం, అన్న క్యాంటీన్లు ప్రారంభించడం వంటివి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు చేసిన తొలి చర్యలు. ఈ సారి పరిపాలన మరింత వేగంగా సాగుతుందని ఈ చర్యలు తెలియజేస్తున్నాయి.బాబు ఎప్పుడూ ఫీలింగ్స్ ఎక్స్‌ప్రెస్ చేయరు. అతని ముఖం సంతోషాన్ని లేదా విచారాన్ని సులభంగా చూపించదు. దీని వల్ల అతనికి పబ్లిక్‌తో కనెక్ట్ అవ్వడం కష్టమని చాలా మంది అనుకుంటారు. ప్రజలు అతన్ని అసలు సిసలైన నేతగా పరిగణించి ఆయనకు ఓటు వేశారు. అయితే పవన్ కళ్యాణ్ రాక తర్వాత చంద్రబాబు ఫేస్ లో ఎక్స్‌ప్రెషన్స్ మారాయి. వయసు పైబడినా బాబు ఇప్పుడు కాస్త ఎక్స్ ప్రెసివ్ అయ్యి తన ఎమోషన్స్ ని చూపిస్తున్నారు.

ఈసారి, అదృష్టం కూడా అతని వైపు ఉంది ఎందుకంటే ఎన్డీయే ప్రభుత్వం టీడీపీకి చెందిన పదహారు మంది ఎంపీలపై ఆధారపడి ఉంది. ఈ అడ్వాంటేజ్ వల్ల రాష్ట్రాన్ని ఎలా సమర్థంగా నిర్వహించాలో బాబుకు తెలుసు. ఆంధ్రప్రదేశ్‌ను కేంద్ర ప్రభుత్వం పక్షపాతం లేకుండా ఆదుకుంటే రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>