Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh6ab3b8b8-20d0-4015-ac7f-a808a4a1e62a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh6ab3b8b8-20d0-4015-ac7f-a808a4a1e62a-415x250-IndiaHerald.jpg - పప్పు నుండి పదునెక్కిన కత్తిలా మారిన లోకేష్ - - రాజకీయాలను చదివేసాడు - చంద్రబాబుకి తగ్గ వారసుడిగా పేరు (ఏపీ - ఇండియా హెరాల్డ్ ) మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కూటమి ఏకంగా 164 స్థానాలలో విజయ డంకా మోగించింది. అయితే ఇక ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఇక బాబు క్యాబినెట్లో 24మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. Lokesh{#}Master;Sasanamandali;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;Father;YCP;TDP;CBN;India;Minister;Assembly;CMరెండోసారి మంత్రిగా లోకేష్.. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్?రెండోసారి మంత్రిగా లోకేష్.. కానీ బోత్ ఆర్ నాట్ సేమ్?Lokesh{#}Master;Sasanamandali;Mangalagiri;Lokesh;Lokesh Kanagaraj;Father;YCP;TDP;CBN;India;Minister;Assembly;CMThu, 13 Jun 2024 09:45:00 GMT- పప్పు నుండి పదునెక్కిన కత్తిలా మారిన లోకేష్
-
- రాజకీయాలను చదివేసాడు  
- చంద్రబాబుకి తగ్గ వారసుడిగా పేరు

(ఏపీ - ఇండియా హెరాల్డ్ )

మొన్నటికి మొన్న ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించిన కూటమి ఏకంగా 164 స్థానాలలో విజయ డంకా మోగించింది. అయితే ఇక ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అదే సమయంలో ఇక బాబు క్యాబినెట్లో 24మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. వారికి ఏ శాఖల కేటాయిస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే చంద్రబాబు తనయుడు మంగళగిరి ఎమ్మెల్యే లోకేష్ కూడా ఇలా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.


 అయితే ఆయనకు ఐటి మినిస్టర్ గా బాధ్యతలు అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది  అయితే గతంలో 2017లో టిడిపి అధికారంలోకి వచ్చినప్పుడు కూడా లోకేష్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు మంగళగిరి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఆయనకు మంత్రి పదవి కేటాయించారు. ఇలా మంత్రిగా పరమాణ స్వీకారం చేసిన తర్వాత ఇక శాసనమండలి సభ్యులుగా లోకేష్ నియమితులు అయ్యారు అన్న విషయం తెలిసిందే. దీంతో తండ్రి చంద్రబాబు సీఎం గా ఉన్నాడు కాబట్టి లోకేష్ కి మంత్రి పదవి వచ్చింది. లేదంటే సాధారణ కార్యకర్తకు కూడా పనికొచ్చేవాడు కాదు అంటూ వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేసింది.


 సాధారణంగా పొలిటికల్ మాస్టర్ మైండ్ అయిన చంద్రబాబు వారసుడిగా లోకేష్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఆయనపై ఉండే అంచనాలు అంతా ఇంతా కాదు. కానీ మొదట్లో ఆయన ఎక్కడ అంచనాలను అందుకోలేకపోయారు. కనీసం ప్రసంగాలు కూడా సరిగ్గా ఇవ్వలేక ప్రతిపక్షాలకు దొరికి పోయేవారు. దీంతో లోకేష్ ని పప్పు పప్పు అంటూ ఇక ఎన్నోసార్లు విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. లోకేష్ ప్రస్తావన వచ్చినప్పుడు అల్లా పప్పు అనే మాట తప్ప మరోమాట అనేవారు కాదు విపక్ష నేతలు. కానీ ఇప్పుడు పప్పు అన్నోడే పదునెక్కిన కత్తిలా మారాడు.

ఏకంగా రాజకీయాలను పూర్తిగా చదివేశాడు. ఇక ఇప్పుడు రాజకీయ ఉద్దండుడు చంద్రబాబుకు తగ్గ వారసుడిగాపేరు సంపాదించుకున్నాడు. దీంతో ఒకప్పుడు 2017లో ఎమ్మెల్సీ పదవి ద్వారా మంత్రి అవ్వటానికి 2019లో టిడిపికి పెద్దగా ఎడ్జ్ లేని మంగళగిరిలో భారీ మెజారిటీతో విజయం సాధించి మంత్రి పదవి చేపట్టడానికి ఎంతో తేడా ఉంది అంటున్నారు నిపుణులు. అందుకే అప్పుడు ఇప్పుడు మంత్రి పదవి దక్కిన.. బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ టిడిపి శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>