PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu9effd30e-4db7-4f52-8acc-542078e29232-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-chandrababu9effd30e-4db7-4f52-8acc-542078e29232-415x250-IndiaHerald.jpg•ఓటమి భయంతో రాజకీయం మొదలెట్టిన బాబు.. •కళ్యాణ్ బాబు లేకపోతే చంద్రబాబు ఖతం •సినీ గ్లామర్ తోనే 100%స్ట్రైక్.. (ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ ) ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు... యావత్ దేశ రాష్ట్రాల ప్రజలను తమ వైపు చూసేలా చేశాయి.. ఒకవైపు టిడిపి మరొకవైపు వైసీపీ అనే కాన్సెప్ట్ కాకుండా ఒకవైపు కూటమి మరోవైపు వైసీపీ అంటూ ఎన్నికలు జోరుగా సాగాయి.. అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా కూటమికి అనుకూలంగా వచ్చాయి.. అయితే ఈ కూటమి గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ సPAWAN ;CHANDRABABU{#}Film Industry;pithapuram;Jagan;TDP;YCP;CBN;kalyan;Party;Success;CM;News;Elections;India;Deputy Chief Ministerఏపీ: పవన్ కి డిప్యూటీ సీఎం.. భయంతో రాజకీయం మొదలెట్టిన బాబు..!ఏపీ: పవన్ కి డిప్యూటీ సీఎం.. భయంతో రాజకీయం మొదలెట్టిన బాబు..!PAWAN ;CHANDRABABU{#}Film Industry;pithapuram;Jagan;TDP;YCP;CBN;kalyan;Party;Success;CM;News;Elections;India;Deputy Chief MinisterThu, 13 Jun 2024 10:40:00 GMT•ఓటమి భయంతో రాజకీయం మొదలెట్టిన బాబు..

•కళ్యాణ్ బాబు లేకపోతే చంద్రబాబు ఖతం

•సినీ గ్లామర్ తోనే 100%స్ట్రైక్..


(ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్ )

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు... యావత్ దేశ రాష్ట్రాల ప్రజలను తమ వైపు చూసేలా చేశాయి.. ఒకవైపు టిడిపి మరొకవైపు వైసీపీ అనే కాన్సెప్ట్ కాకుండా ఒకవైపు కూటమి మరోవైపు వైసీపీ అంటూ ఎన్నికలు జోరుగా సాగాయి..  అందుకు తగ్గట్టుగానే ఫలితాలు కూడా కూటమికి అనుకూలంగా వచ్చాయి.. అయితే ఈ కూటమి గెలవడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి.. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ తో సక్సెస్ సాధించి తన రాజకీయ భవిష్యత్తుకు పునాదులు వెయ్యడమే కాకుండా టిడిపిని మళ్లీ నిలబెట్టారు. ఇక రాజకీయాలలోకి అడుగుపెట్టిన ఈయన ఇప్పుడు ఏకంగా డిప్యూటీ సీఎం హోదాను దక్కించుకోవడంతో.. సీనియర్లను కాదని  పవన్ కి చంద్రబాబు ఈ పదవిని కట్టబెట్టడానికి గల కారణం ఏమిటి ? అంటూ పలు అనుమానాలు ప్రజలలో కూడా వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి ఈసారి టిడిపి ఓడిపోతే ఇక నామరూపాలు లేకుండా పోతుంది అంటూ ఓటర్లు, ప్రజలు అంతా భావించారు ..ఇక అందులో భాగంగానే ఆ భయమే చంద్రబాబుకి కూటమి వైపు వెళ్లేలా దారి చూపించింది.. ఇక్కడ పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు లేరు అనే అంశం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం గా పదవి ఇవ్వడం వెనుక రాజకీయ కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు సినీ గ్లామర్ ఎంతగా సపోర్టు ఇచ్చిందో మొన్న జరిగిన ఎన్నికలలో అది స్పష్టం అయ్యింది.. ముఖ్యంగా సినీ సెలబ్రిటీలంతా కూడా పవన్ కళ్యాణ్ గెలవాలని తమ పనులను పక్కనపెట్టి మరీ పిఠాపురం వచ్చి ప్రచారం నిర్వహించారు.. తమ అభిమానులను కూడా పవన్ కళ్యాణ్ కు మద్దతు పలికేలా తమ పోస్టులతో ఓటర్లను ప్రేరేపించారు.. ఇక వారు చేసిన కష్టమే నేడు పవన్ కళ్యాణ్ కు విజయ రూపంలో ఫలితాన్ని చూపించింది.ఇప్పటివరకు ఏ పార్టీ కూడా ఈ విధంగా గెలిచింది లేదు..


ఇక పవన్ కళ్యాణ్ ని విజయాన్ని చూసి ఆయనను ఎలాగైనా సరే అక్కున చేర్చుకోవాలని బాబు డిప్యూటీ సీఎం గా పదవి ఇచ్చారని తెలుస్తోంది.. ఒకవేళ పవన్ కళ్యాణ్ ను కాదని ఒంటరిగా పోరాటం చేస్తే మాత్రం ఇక టిడిపి పార్టీ నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోతుందని ఆయనకు స్పష్టం అయిందో ఏమో అందుకే జగన్ లాంటి వ్యక్తులను ఓడించాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు,  సినీ  గ్లామర్ తనకు అవసరమని భావించారు చంద్రబాబు. ఇక అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ను అక్కున చేర్చుకున్నారు.. మరొకవైపు చిరంజీవికి కూడా ఒక కీలక పదవి ఇవ్వనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినీ ఇండస్ట్రీ మొత్తం తమ వైపు తిప్పుకొని ఓటర్లను మరింతగా తమ వశం చేసుకోవాలని ఒక రాజకీయ పన్నాగం పన్నుతున్నారు చంద్రబాబు అనే వార్తలు ఇప్పుడు స్పష్టం అవుతున్నాయి. అందుకే టిడిపి పార్టీని నమ్ముకుని కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతున్న సీనియర్లను కూడా కాదనుకొని ఇప్పుడు కొత్తవారికి పదవులు కట్టబెట్టడం వెనుక ఈ రాజకీయ కుట్ర ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>