EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_latestnews/chandrababuf09aff9b-c395-440a-b59e-b7580470ac3f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/politics_latestnews/chandrababuf09aff9b-c395-440a-b59e-b7580470ac3f-415x250-IndiaHerald.jpgఅధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ పైనే పెడతామని మాటచ్చిన చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం కాగానే సైలెంట్ గా తిరుమల వెళ్లారు. అయితే దీనిపై వైసీపీ అభిమానులు అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టారు. తొలి సంతకం పెడతానన్న చంద్రబాబుకి పెన్ను దొరకలేదు ఏమో అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు. అయితే కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఓ యువతి పెన్ను కానుకగా అందించారు. ఈ పెన్నుతోనే తొలి సంతకం చేయాలని ఆమె కోరింది. దీంతో ఆయన కూటమి అధికారంలోకి chandrababu{#}Tirupati;kakinada;Jaggampeta;media;Janasena;YCP;TDP;CBN;Prime Minister;Narendra Modi;Bharatiya Janata Partyఅప్పుడే బాబు మాట తప్పేశారా.. సంతకానికి పెన్ను దొరకలేదా?అప్పుడే బాబు మాట తప్పేశారా.. సంతకానికి పెన్ను దొరకలేదా?chandrababu{#}Tirupati;kakinada;Jaggampeta;media;Janasena;YCP;TDP;CBN;Prime Minister;Narendra Modi;Bharatiya Janata PartyThu, 13 Jun 2024 09:10:00 GMTఅధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ  నోటిఫికేషన్ పైనే పెడతామని మాటచ్చిన చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం కాగానే సైలెంట్ గా తిరుమల వెళ్లారు. అయితే దీనిపై వైసీపీ అభిమానులు అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టారు. తొలి సంతకం పెడతానన్న చంద్రబాబుకి పెన్ను దొరకలేదు ఏమో అని సోషల్ మీడియా వేదికగా సెటైర్లు పేల్చుతున్నారు.

అయితే కాకినాడ జిల్లా జగ్గంపేట ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు మాట్లాడుతుండగా.. ఓ యువతి పెన్ను కానుకగా అందించారు. ఈ పెన్నుతోనే తొలి సంతకం చేయాలని ఆమె కోరింది. దీంతో ఆయన కూటమి అధికారంలోకి రాగానే డీఎస్పీ నోటిఫికేషన్ పై ఇదే పెన్నుతోనే తొలి సంతకం చేస్తానని  ప్రకటించారు. అయితే ఆయన సైలెంట్ గా తిరుపతి వెళ్లడంతోనే మొదలైంది చర్చంతా.

అయితే దీనికి పలు కారణాలను విశ్లేషకులు చెబుతున్నారు. 2014లో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అయిదు అంశాలపై ఆయన సంతకం చేశారు. రైతు రుణమాఫీ, బెల్టు షాపుల రద్దు వంటి అంశాలు అందులో ఉన్నాయి. అలాగే 2024లో కూడా జరుగుతుంది అని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో వైసీపీ నాయకులు చంద్రబాబు మాట తప్పారు అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు.

గతంలో ప్రమాణ స్వీకార సమయంలో ప్రధాని మోదీ లేరు. ఈ సారి నరేంద్ర మోదీ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. పీఎం ప్రోటోకాల్ ప్రకారం ఇక్కడ జరిగే అంశాల గురించి పీఎంవోకి షెడ్యూల్ ఇవ్వాలి. కానీ అలా జరగలేదు. పైగా బీజేపీ టీడీపీ, జనసేన పార్టీలు ఇచ్చిన హామీలకు తమకు సంబంధం లేదని ఎన్నికల సమయంలోనే తెగేసి చెప్పింది. అందువల్ల దీనిని ప్రధాని సమక్షంలో చేయలేదు. ఇదిలా ఉండగా.. మరోవైపు ప్రోటోకాల్ ప్రకారం విధానపరమైన నిర్ణయాలు తీసుకోకూడదు కాబట్టి అందుకే సంతకం చేయలేదు అని టీడీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఏది ఏమైనా  ఏ చిన్న విషయాన్ని అయినా విమర్శించేందుకు వైసీపీ సిద్ధంగా ఉంది అని చెప్పడానికి ఈ ఘటనే ఉదాహరణ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>