PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tg-bharath68ddeb83-5194-4bda-93d3-8bcce4bae413-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tg-bharath68ddeb83-5194-4bda-93d3-8bcce4bae413-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. జూన్ 12వ తేదీన చంద్రబాబుతో సహా 24 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్త, టీడీపీ యువ నేత T.G. భరత్ ఒకరు. భరత్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18,876 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు జిల్లా నుంచి ఈయనకొక్కరికే ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. ఈయన తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఒకప్పుడు ఏపీకి మంత్రిగా పనిచేశారు. ఆయన చిన్న నీటిపారుదల శాఖ మంత్tg bharath{#}bharath;Sri Bharath;Kurnool;TDP;June;CBN;Father;Andhra Pradesh;Venkatesh;Ministerశాఖలు-సవాళ్లు: సరైన శాఖకు మంత్రి అయిన టీజీ భరత్ రికార్డు.. ఏపీకి పేరు తెచ్చిపెట్టేలా ఉన్నారే..??శాఖలు-సవాళ్లు: సరైన శాఖకు మంత్రి అయిన టీజీ భరత్ రికార్డు.. ఏపీకి పేరు తెచ్చిపెట్టేలా ఉన్నారే..??tg bharath{#}bharath;Sri Bharath;Kurnool;TDP;June;CBN;Father;Andhra Pradesh;Venkatesh;MinisterThu, 13 Jun 2024 10:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మంత్రి వర్గం కొలువుదీరిన సంగతి తెలిసిందే. జూన్ 12వ తేదీన చంద్రబాబుతో సహా 24 మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కర్నూలు జిల్లా పారిశ్రామికవేత్త, టీడీపీ యువ నేత T.G. భరత్ ఒకరు. భరత్ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 18,876 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. కర్నూలు జిల్లా నుంచి ఈయనకొక్కరికే ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కడం విశేషం. ఈయన తండ్రి టీజీ వెంకటేష్ కూడా ఒకప్పుడు ఏపీకి మంత్రిగా పనిచేశారు. ఆయన చిన్న నీటిపారుదల శాఖ మంత్రిగా సేవలందించారు.

టీజీ భరత్ కు మంత్రివర్గంలో చోటు కల్పించడం కోసం చంద్రబాబు చాలానే విషయాలను పరిగణలోకి తీసుకున్నారు. సామాజిక సమీకరణాలను కన్సిడర్ చేశారు. బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీ నేతలతో సుదీర్ఘ చర్చల తర్వాత ఆయనకు తన కేబినెట్‌లో స్థానం కల్పించారు. భరత్ మంత్రి అయ్యాక కర్నూలులో టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నాయి.

ఈసారి టీ.జీ భరత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక, యువజన, క్రీడల శాఖకు మంత్రి అయ్యారు. విదేశాల్లో చదువుకొని చాలా నాలెడ్జ్ సంపాదించారు భరత్. ఇప్పటికీ యంగ్ అండ్ డైనమిక్ పొలిటిషన్ గా ఆయన ఉన్నారు. కాబట్టి ఈ శాఖలో ఉన్న సవాళ్లను ఆయన ఈజీగానే పరిష్కరించగలరు. ఏపీ టూరిజం రంగాన్ని బాగా అభివృద్ధి చేయగల సామర్థ్యం ఆయన సొంతమని చెప్పవచ్చు. ఇక క్రీడలు, యువత విషయంలో కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు ఏపీని ముందంజలో ఉంచుతాయని చెప్పవచ్చు.

టీజీ భరత్ యూకే లో ఎంబీఏ పూర్తి చేశారు. కంపెనీలను ప్రారంభించి మంచి పారిశ్రామికవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత తండ్రి బాటలో రాజకీయాల్లోకి దిగారు. భారత సతీమణి పేరు శిల్ప. ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. టీజీ భరత్ ప్రస్తుత వయసు 48 ఏళ్లు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>