MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఒక వ్యక్తి ఒక సినిమాను అతడికి బాగా నచ్చితే రెండు మూడు సార్లు చూస్తాడు. అయితే ఒక సినిమాను 100 సార్లు పైగా చూసిన రికార్డు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉందట. ఈవిషయాన్ని స్వయంగా మహేష్ బావ హీరో సుధీర్ బాబు ఒక ఓపెన్ ఫంక్షన్ లో తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘హరోంహర’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేటెస్ట్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కు విశ్వక్ సేన్ అడవి శేషులు అతిధులుగా వచ్చారు. వాస్తవానికి ఈ ఫంక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ అతిధిగా వస్తాడని అంతా అనుకున్నారు. అయితే అతడు రాకుండా ఒక సిmahesh{#}sudheer babu;Rajani kanth;Hero;Viswak sen;Athadu;Tollywood;Cinema;Father;Telugu;Smart phone;krishna;CBNసుధీర్ బాబు బయటపెట్టిన మహేష్ సీక్రెట్ !సుధీర్ బాబు బయటపెట్టిన మహేష్ సీక్రెట్ !mahesh{#}sudheer babu;Rajani kanth;Hero;Viswak sen;Athadu;Tollywood;Cinema;Father;Telugu;Smart phone;krishna;CBNThu, 13 Jun 2024 08:42:35 GMTఒక వ్యక్తి ఒక సినిమాను అతడికి బాగా నచ్చితే రెండు మూడు సార్లు చూస్తాడు. అయితే ఒక సినిమాను 100 సార్లు పైగా చూసిన రికార్డు సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఉందట. ఈవిషయాన్ని స్వయంగా మహేష్ బావ హీరో సుధీర్ బాబు ఒక ఓపెన్ ఫంక్షన్ లో తెలియచేసి అందరికీ షాక్ ఇచ్చాడు. సుధీర్ బాబు హీరోగా నటిస్తున్న ‘హరోంహర’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లేటెస్ట్ గా జరిగింది.



ఈ ఫంక్షన్ కు విశ్వక్ సేన్ అడవి శేషులు అతిధులుగా వచ్చారు. వాస్తవానికి ఈ ఫంక్షన్ కు సూపర్ స్టార్ మహేష్ అతిధిగా వస్తాడని అంతా అనుకున్నారు. అయితే అతడు రాకుండా ఒక సింపుల్ ఫోన్ మెసేజ్ తో సుధీర్ బాబు సినిమా హిట్ అవ్వాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంలో సుధీర్ బాబు మహేష్ గురించి మాట్లాడుతూ సూపర్ స్టార్ కృష్ణ నయించిన ఒకనాటి ట్రెండ్ సెట్టింగ్ మూవీ ‘మోసగాళ్ళకు మోసగాడు’ మహేష్ తనకు నచ్చి 100 సార్లకు పైగా చూసిన విషాయాన్ని బయటపెట్టాడు.



1970 ప్రాంతాలలో విడుదలైన ‘మోసాగాళ్ళకు మోసగాడు’ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీలో కౌబాయ్ సినిమాల ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన విషయాన్ని సుధీర్ బాబు వివరిస్తూ ఆసినిమా గురించి పొగడ్తలు కురిపించాడు. అంతేకాదు మహేష్ తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ కోరికమేరకు ‘టక్కరి దొంగ’ అనే కౌబాయ్ సినిమాలో నటించిన విషయాన్ని గుర్తుకు చేస్తూ ఆ సినిమాతో మళ్ళీ టాలీవుడ్ ఇండస్ట్రీలో కౌబాయ్ సినిమాల వేవ్ కు మహేష్ తనవంతుగా చేసిన ప్రయత్నాన్ని వివరించాడు.



గత కొంతకాలంగా టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కౌబాయ్ సినిమాలను తీయడానికి చాలామంది దర్శక నిర్మాతలు ఇష్టపడటం లేదు. అయితే మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ ధైర్యం చేసి అలాంటి కౌబాయ్ సినిమాలో నటించి తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణకు సరైన వారసుడుని అని తెలియ చేస్తాడేమో చూడాలి..  












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>