PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jaganfad693fe-87a1-4fd1-be0a-3dab4c18db95-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/cm-jaganfad693fe-87a1-4fd1-be0a-3dab4c18db95-415x250-IndiaHerald.jpg2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెళ్లను జగన్ ఆపేశారు. కేబుల్ ఆపరేటర్ల పై ఒత్తిడి తేవడం ద్వారా ఆయన ఈ ఎల్లో మీడియాను ఏపీలో కట్టడి చేశారు. తద్వారా ప్రజలు ఆ ఛానెల్ ను చూడకుండా చేయగలిగారు ఈటీవీని మాత్రం ఆపలేకపోయారు ఎందుకంటే ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ లో ఒక ప్యాకేజీగా వస్తుంది. అయితే అప్పుడు జగన్ అలా చేశారని ఇప్పుడు టిడిపి కూడా వైసీపీ అనుకూల మీడియాని ఆపించేసింది. సాక్షి టీవీ 9, ఎన్టీవీ ఈ మూడు న్యూస్ ఛానెల్స్ కేబుల్ టీcm jagan{#}Jagan;Andhra Pradesh;television;Letter;TDP;YCP;Reddy;Sakshiజగన్‌కే కాదు సాక్షికి కూడా అతిపెద్ద గడ్డుకాలం..??జగన్‌కే కాదు సాక్షికి కూడా అతిపెద్ద గడ్డుకాలం..??cm jagan{#}Jagan;Andhra Pradesh;television;Letter;TDP;YCP;Reddy;SakshiWed, 12 Jun 2024 19:48:28 GMT2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 ఛానెళ్లను జగన్ ఆపేశారు. కేబుల్ ఆపరేటర్ల పై ఒత్తిడి తేవడం ద్వారా ఆయన ఈ ఎల్లో మీడియాను ఏపీలో కట్టడి చేశారు. తద్వారా ప్రజలు ఆ ఛానెల్ ను చూడకుండా చేయగలిగారు ఈటీవీని మాత్రం ఆపలేకపోయారు ఎందుకంటే ఈటీవీ ఆంధ్ర ప్రదేశ్ అనేది ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ లో ఒక ప్యాకేజీగా వస్తుంది. అయితే అప్పుడు జగన్ అలా చేశారని ఇప్పుడు టిడిపి కూడా వైసీపీ అనుకూల మీడియాని ఆపించేసింది. సాక్షి టీవీ 9, ఎన్టీవీ ఈ మూడు న్యూస్ ఛానెల్స్ కేబుల్ టీవీ యూసర్లకు కనిపించకూడదని కేబుల్ టీవీ ఆపరేటర్లకు టీడీపీ హుకుం జారీ చేసింది దాంతో వారు ఆ పని చేయక తప్పడం లేదు.

దీనివల్ల ఆయా ఛానెల్స్ వ్యుయర్ షిప్ తగ్గిపోతుంది. అలాగే వైసీపీ తరఫున ప్రజలకు విషయాలను తెలియజేయలేవు. ఇంటర్నెట్ ద్వారా మాత్రమే ఈ ఛానెల్స్ చూడటం సాధ్యమవుతుంది. కానీ ఇంటర్నెట్ ద్వారా ఎల్లవేళలా ఈ టీవీ ఛానెల్స్ చూసే వీలు చాలామందికి ఉండదు. కాబట్టి వైసీపీ రాజ్యసభ సభ్యుడు నిరంజన్ రెడ్డి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేశారు ఈ ఛానెల్స్ ని ఏపీలో ఆఫ్ చేయడం అన్యాయం అన్నట్లు ఆయన ఒక లేఖ రాశారు. అయితే ట్రాయ్ సంస్థ ఒక రూల్ పెట్టింది. అదేంటంటే ఏదైనా ఒక ఛానెల్ ను ఒక ప్రాంతంలో తప్పనిసరిగా అనుమతించాలంటే..ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రేక్షకులలో కనీసం 20 శాతం మంది అయినా మాకు ఆ ఛానెల్ కావాలి అని ప్రతి కేబుల్ ఆపరేటర్ ని  అడగాల్సి ఉంటుంది.

 కేబుల్ ఆపరేటర్ కి ఒక లిస్ట్ ఇస్తే ఆ లిస్టులో మనకి కావాల్సిన ఛానల్ వద్ద టిక్‌ పెట్టాలి. ఈ పేపర్లను ప్రతి కేబుల్ ఆపరేటర్ కూడా ట్రాయ్ సంస్థకు సమర్పించాలి. కానీ వారు అలా చేయకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ ఒత్తిడి ఉంటుంది. అలాగే ఏపీలో వైసీపీ పట్ల తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జనాలందరూ టీడీపీ వైపే ఉన్నారు కాబట్టి సాక్షి కావాలని ఎవరూ కోరుకోకపోవచ్చు. వైసిపి వాళ్లు కూడా దానిని రిస్టోర్ చేయమని అడగకపోవచ్చు ఎందుకంటే ఆ చానల్లో ప్రజాదరణ ఉన్నట్లు చూపించారు కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం విభిన్నంగా వచ్చాయి. మళ్లీ వైసీపీని చూసి మోసపోవడానికి ఇష్టపడకపోవచ్చు మొత్తం మీద సాక్షి ఏపీ ప్రజలకు దూరమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>